కళ్యాణ్ పడాలపై షాకింగ్ రూమర్స్... దిమ్మతిరిగేలా బిగ్‌బాస్ విన్నర్ తల్లి కౌంటర్

సైనికుడిగా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు సెలబ్రిటీగా మారారు కళ్యాణ్ పడాల. బిగ్‌బాస్ తెలుగు 9లో సామాన్యుడి కేటగిరిలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పడాల పవన్ కళ్యాణ్.. సెలబ్రిటీలను దాటుకుని బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచారు. తన వ్యక్తిత్వం, గేమ్, ప్రజల ఆదరణతో టైటిల్ కైవసం చేసుకున్నాడు. బిగ్‌బాస్ విజేతగా గెలిచిన తర్వాత సినీరంగం వైపు అడుగులు వేస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సత్తా చాటుతున్నాడు కళ్యాణ్ పడాల.

Also Read
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్

స్టార్ మాలో ప్రసారమవుతున్న కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 ఉత్కంఠగా సాగుతోంది. ప్రదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు సీనియర్ నటి అరుణ ముచ్చర్ల, హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్, కమెడియన్ అలీ, సెలబ్రిటీ చెఫ్ సంజయ్ తుమ్మాలు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. బుల్లితెర సెలబ్రిటీలు వారం వారం ఓ ప్రత్యేక థీమ్‌తో వంటలు వండుతూ.. మధ్యలో ఆటాపాటలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఈ వారం కూడా కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 రెడీ అయ్యింది. మదర్స్ డే సందర్భంగా బుల్లితెర సెలబ్రిటీలు తమ తల్లులతో షోకు వచ్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

Bigg Boss Telugu 9 Winner Kalyan Padala Emotional with Mother in Cooku With Jathiratnalu 2 Promo

ప్రోమో స్టార్టింగ్‌లో పల్లవి రామిశెట్టి, పల్లవి గౌడ, నిఖిల్ విజయేంద్ర సింహ, కళ్యాణ్ పడాల, అషిక గోపాల్, రాకింగ్ రాకేష్ వారి వారి అమ్మలను తీసుకొచ్చారు. మీ అబ్బాయి చేసిన అల్లరి గురించి చెప్పమని శ్రీదేవి విజయ్ కుమార్ అడగ్గా.. చెప్పాలంటే చాలా ఉన్నాయి నాన్న, మా అబ్బాయి చాలా రిజర్వ్‌డ్ అని నిఖిలి తల్లి చెబుతుంది. మీ అబ్బాయి రిజర్వ్‌డ్ కాదు.. ఎంతమంది కోసం టేబుల్స్ రిజర్వ్ చేశారో తెలుసా? అంటూ రోహిణి పంచ్ విసురుతుంది. ఆ వెంటనే అత్తయ్య గారు అబ్బాయి చేసిన అల్లరి పనుల గురించి చెప్పండి అంటుంది రోహిణి. నువ్వు సిగ్గు పడతావేంటీ అని కళ్యాణ్ పడాల మండిపడతాడు. మా అబ్బాయి సైలెంట్‌గా ఉంటాడని కళ్యాణ్ తల్లి చెబుతుండగా.. ఎన్నెన్ని చేశాడో మీకు తెలియదని అంటుంది రోహిణి. నాకు తెలిసు వాడు ఏం చేయడని చెబుతుంది కళ్యాణ్ తల్లి.

Recommended For You
'ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’
'ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’

ఆ తర్వాత పల్లవి రామిశెట్టి తల్లి మాట్లాడుతూ.. చిన్నప్పుడు తెలియకుండానే కత్తెర తెచ్చుకుని జుట్టు మొత్తం కట్ చేసేసుకుందని చెప్పింది. అషికా తల్లి మాట్లాడుతూ.. పుట్టుకతోనే మా అమ్మాయి యాక్టర్. కొట్టినా కొట్టనట్లు, కొట్టకున్నా ఏడ్చినట్లుగా నటించేదని అషిక వెంటపడి కొడుతుంది. దాంతో తల్లికి సారి చెప్పి హగ్ చేసుకుంటుంది అషిక. ఆ వెంటనే మా అమ్మపేరు లక్ష్మీ.. ఈవిడ మా ఇంట్లో ఉండటం వల్ల డబ్బులు బాగానే ఉంది మా ఇంట్లో అంటుంది పల్లవి గౌడ. దాంతో మా ఇంటికి రండి అంటూ అలీ, శ్రీదేవి విజయ్ కుమార్ సెటైర్లు వేస్తారు. మీకు కాబోయే అల్లుడికి ఉండాల్సిన క్వాలిటీలు ఏంటని ఎక్స్‌ప్రెస్ హరి అడగ్గా.. నీలాగా ఉండకూడదని ఇమ్మాన్యుయేల్ పంచ్ విసురుతాడు.

You May Also Like
'ఆ నాలుగేళ్లు నరకం చూశా... అలా సీతాలక్ష్మీ నుంచి యాస్మిన్‌గా మారా’
'ఆ నాలుగేళ్లు నరకం చూశా... అలా సీతాలక్ష్మీ నుంచి యాస్మిన్‌గా మారా’

మా అమ్మ జయలక్ష్మీగారు.. జయలక్ష్మీలో జయం ఎప్పుడూ నాకిచ్చేసి, లక్ష్మీలా మా ఇంట్లో ఉంటుందని రాకింగ్ రాకేష్ తన తల్లిని పరిచయం చేస్తాడు. మా అమ్మంటే చాలా ఎమోషన్ నాకు.. చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా ధైర్యంగా పెంచింది. ఎక్కడైనా ఏదైనా సాధించేలా పెంచింది. నేను ఏది దేవుడిని కోరుకోను. ఎంత సంపాదించావు నాన్న అని అడగను, ఎంత ఖర్చు పెడుతున్నావని అడగను, కాకపోతే మంచి పేరు తెచ్చుకోవాలని చెబుతూ ఎమోషనల్ అయ్యారు రాకింగ్ రాకేష్ తల్లి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more about: Bigg Boss Telugu 9 pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X