టైటిల్ గెలిచాడు.. కానీ, ప్రేమలో ఓడిపోయాడు.. బిగ్ బాస్ కళ్యాణ్ పడాల ఎమోషనల్ స్టోరీ

బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్‌ విన్నర్‌గా నిలిచిన కళ్యాణ్ పడాల ( Kalyan Padala) పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కామన్ మ్యాన్‌గా అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ హౌజ్‌ వరకు తన ప్రయాణాన్ని కొనసాగించి, చివరకు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ గా నిలిచారు. అలా అందరినీ ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా ఆడి, అనూహ్యంగా విన్నర్‌గా నిలిచిన కళ్యాణ్, బిగ్‌బాస్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాడు.

అయితే టైటిల్ గెలిచిన తర్వాత కూడా కళ్యాణ్ పెద్దగా హడావుడి చేయలేదు. గతంలో బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, చాలా సైలెంట్‌గా ఉన్నారు. తిరిగి తన జీవితంలోకి మళ్లీ అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలోనే కళ్యాణ్‌కు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్నిపరీక్ష గెలిచిన తర్వాత ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో కళ్యాణ్ తన వ్యక్తిగత విషయాలను, బిగ్ బాస్ అగ్ని పరీక్ష విషయాలను పంచుకున్నారు. అన్నింటి కన్న ముఖ్యంగా ఎవరికీ తెలియని తన ఫస్ట్ లవ్ స్టోరీని తొలిసారి బయటపెట్టాడు.

Bigg Boss Telugu 9 Winner Kalyan Padala s Heartbreaking Love Story Goes Viral

కళ్యాణ్ లవ్ స్టోరీ ఓ ప్రేమ కథ సినిమాలాగా అనిపిస్తోంది. చిన్ననాటి క్లాస్‌మేట్‌తో పరిచయం, ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆసక్తికరంగా, మొదట ప్రేమ వ్యక్తం చేసింది ఆమెనే. కానీ అప్పట్లో తన పరిస్థితిని గుర్తుచేసుకుని, "నన్ను మా అమ్మనే భరించదు, ఇది అవ్వదు" అంటూ కళ్యాణ్ ఆమెను రిజెక్ట్ చేశాడట. ఆ మాటలు ఆమెను తీవ్రంగా బాధపెట్టాయట.

కానీ, కొన్ని రోజులకు తన మాటలు గుర్తొచ్చి, ఆమెను బాధపెట్టాననే భావనతో కళ్యాణ్ ఆమె ప్రేమను అంగీకరించాడు. ప్రేమ కొత్తగా మొదలైన రోజుల్లోనే మరో కీలక మలుపు తిరిగింది. కళ్యాణ్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు. ట్రైనింగ్ కోసం బయటకు వెళ్లాల్సి వచ్చింది. అప్పటిదాకా బాగానే నడిచిన ప్రేమ, దూరంతో కాస్త తడబడటం మొదలుపెట్టింది.

వస్తానని చెప్పి రాలేని రోజు
లీవ్‌లో ఊరికి వస్తున్నానని చెప్పి, ఇంటికి వచ్చి మాట్లాడాలని ఆమె కోరిందట. కానీ వాతావరణ పరిస్థితుల వల్ల ఫ్లైట్‌లో వెళ్లిపోవాల్సి వచ్చి, ఆమెను కలవలేకపోయాడు. ఆ తర్వాత ఫోన్లు, మెసేజులు తగ్గిపోయాయి. మొదట ఇంట్లో ఒత్తిడి ఉండొచ్చని భావించిన కళ్యాణ్, కాలేజీలో చేరిందని తెలిసి ఆమె నంబర్ సంపాదించి కాల్ చేస్తే, మాట్లాడనని స్పష్టంగా చెప్పిందట.

కొన్ని రోజుల తర్వాత లీవ్ దొరికినప్పుడు ఊరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె తల్లిదండ్రులు ఈ పెళ్లి సాధ్యం కాదని, ఇక ఇంటికి రావద్దని గట్టిగా చెప్పారట. ఆ మాటలతో నిరాశ చెందిన కళ్యాణ్ తిరిగి వెళ్లిపోయాడు. కొంత కాలానికి ఆమె తండ్రి ద్వారా మళ్లీ మాట్లాడే అవకాశం వచ్చింది. తన వద్ద ఉన్న పుస్తకాల విషయంలో ఫోన్ చేస్తే, నువ్వే మాట్లాడమని నంబర్ ఇచ్చారట. మూడు నాలుగు రోజులు ప్రయత్నించి చివరకు ఆమెను కన్విన్స్ చేశాడట.

'నా కంటే వాడు బెటర్'
అంతా సెట్ అయ్యిందనుకున్న సమయంలోనే మరో షాక్. మళ్లీ ఫోన్లు ఎత్తడం మానేసింది. బ్లాక్‌లో పెట్టింది. ఆరా తీస్తే.. మరో అబ్బాయితో రిలేషన్‌లోకి వెళ్లిందని తెలిసింది. 'నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడు' అన్న కారణంతో తనను వదిలేసిందని కళ్యాణ్ చెప్పాడు. ఆ నిజం తెలిసిన క్షణం తనకు గట్టిగానే దెబ్బ తగిలిందని, ఆ హార్ట్ బ్రేక్‌ను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. టైటిల్ గెలిచాడు.. కానీ, ప్రేమలో ఓడిపోయాడు.. ఆ అమ్మాయికి లక్ లేదంటూ బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X