ఆ రోజు మళ్లీ నా జీవితంలో రాకూడదు.. బిగ్‌బాస్‌పై కళ్యాణ్ పడాల షాకింగ్ కామెంట్స్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల (Kalyan Padala)గురించి పరిచయం అవసరం లేదు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. ఇండియన్ ఆర్మీలో సేవలందించారు. ఆ తర్వాత బిగ్‌బాస్ వేదికపై అడుగుపెట్టి లక్షలాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న కళ్యాణ్.. తాజాగా ప్రముఖ టాక్ షో 'కిస్క్ టాక్స్'లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అయితే అందులో ముఖ్యంగా బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన రోజు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

షోలో యాంకర్ వర్షా అడిగిన ప్రశ్నలకు కళ్యాణ్ చాలా సరదాగా, మరోవైపు ఎమోషనల్‌గా సమాధానాలు ఇచ్చాడు. "బిగ్‌బాస్‌లోకి వెళ్తానని ఎప్పుడైనా అనుకున్నావా?" అని అడగగా, "వెళ్తానని అనుకున్నా.. కానీ ఇంత ప్రేమ దక్కుతుందని, విన్నర్ అవుతానని మాత్రం అస్సలు ఊహించలేదు" అని చెప్పాడు. దీనికి వర్షా "తెలుగు వాళ్లు ఎవరినైనా ప్రేమిస్తే చివరి వరకు వదిలిపెట్టరు" అని చెప్పగా, వెంటనే కళ్యాణ్ "మరి నేనేమైనా హిందీ వాడినా?" అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చాడు.

Bigg Boss Telugu 9 Winner Kalyan Padala s Shocking Comments on His Winning Moment

అలాగే బిగ్‌బాస్ హౌస్‌లో తనకు అత్యంత ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అని అడగగా, ఎలాంటి సందేహం లేకుండా "తనుజ" అని సమాధానం ఇచ్చాడు. ఆమె తన జీవితంలో ఎంత ప్రత్యేకమో కూడా వివరించాడు. ప్రతి విషయంలో సలహాలు ఇస్తుందని, ఇప్పటికీ కొత్త ప్రదేశాలకు వెళ్లినా జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేస్తుందని చెప్పాడు. అంతేకాదు, బిగ్‌బాస్ తర్వాత తాను ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు తనుజ తన పరిచయాలతో ఆ సమస్యను పరిష్కరించిందని వెల్లడించాడు.

"బిగ్‌బాస్ హౌస్‌లో ఏర్పడే రిలేషన్స్ నిజంగానే ఉంటాయా? లేక షో వరకు మాత్రమే పరిమితమవుతాయా?" అని ప్రశ్నించగా కళ్యాణ్ ఆసక్తికరంగా స్పందించాడు. "అవి నిజంగానే ఉంటాయి. అయితే ఎవరి అభిప్రాయం వారిది. కొందరు వాటిని నమ్ముతారు, మరికొందరు నమ్మరు. కానీ హౌస్‌లో కలిసి గడిపిన అనుభవాలు మాత్రం నిజమే" అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో బిగ్‌బాస్ రిలేషన్స్‌పై మరోసారి చర్చ మొదలైంది. అలాగే తనుజ గురించి మాట్లాడుతూ కళ్యాణ్ మరింత ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బిగ్‌బాస్ ముగిసిన తర్వాత కూడా తమ మధ్య మంచి అనుబంధం కొనసాగుతోందని చెప్పాడు. ఒక సందర్భంలో తన తల్లి తనుజకు ప్రత్యేకంగా గిఫ్ట్ ఇవ్వడం తనకే ఆశ్చర్యంగా అనిపించిందని వెల్లడించాడు. "అమ్మ తనుజకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. " అని చెప్పారు.

ఇక కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా వర్షా ప్రశ్నలు సంధించింది. "నువ్వు సింగిలా? కమిటెడ్‌నా? నువ్వు సింగిల్ అయితే మా వాళ్లు ట్రై చేసుకుంటారు" అంటూ సరదాగా ప్రశ్నించగా, కళ్యాణ్ చిన్న నవ్వుతో "కష్టమే" అని సమాధానం ఇచ్చాడు. ఈ ఒక్క సమాధానంతోనే అక్కడ ఉన్నవారిలో నవ్వులు పూశాయి. అయితే వెంటనే వర్షా, "అంటే కళ్యాణ్ పడాల కమిటెడ్ అన్నమాట" అంటూ సరదాగా గాసిప్ క్రియేట్ చేయడంతో షో మరింత ఎంటర్‌టైనింగ్‌గా మారింది.

అయితే ఈ ఇంటర్వ్యూలో అసలు హైలైట్ మాత్రం చివర్లో వచ్చింది. "నీ జీవితంలో మళ్లీ రాకూడదనుకునే రోజు ఏదైనా ఉందా?" అని యాంకర్ ప్రశ్నించగా, అందరూ ఊహించని సమాధానం ఇచ్చాడు కళ్యాణ్ పడాల. సాధారణంగా జీవితంలో అత్యంత మధురమైన క్షణంగా భావించే బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన రోజునే ప్రస్తావిస్తూ, "బిగ్‌బాస్ టైటిల్ విన్నింగ్ మూమెంట్ మళ్లీ రాకూడదు" అని చెప్పాడు. కళ్యాణ్ చేసిన ఈ కామెంట్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

బిగ్‌బాస్ ట్రోఫీ గెలవడం కోసం వేలాది మంది కలలు కంటుంటే, విజేతగా నిలిచిన కళ్యాణ్ అలాంటి వ్యాఖ్య చేయడం వెనుక కారణమేంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టైటిల్ గెలిచిన తర్వాత అతను ఊహించిన అవకాశాలు రాలేదా? లేక ఆ విజయంతో పాటు వచ్చిన ఒత్తిడి, బాధ్యతలు, విమర్శలు అతడిని ఇబ్బంది పెట్టాయా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే దీనిపై పూర్తి క్లారిటీ మాత్రం ప్రోమోలో కనిపించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X