బిగ్‌బాస్ తెలుగు 9 విజేతగా పవన్ కళ్యాణ్... ప్రైజ్‌మనీ ఎంత? ఇంకా కళ్లు చెదిరే బహుమతులు?
105 రోజుల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బిగ్‌బాస్ తెలుగు 9కి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ విజేతగా పవన్ కళ్యాణ్ పడాల అలియాస్ సోల్జర్ కళ్యాణ్ నిలిచాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ విజయం సాధించగా.. కన్నడ నటి తనూజ రన్నరప్‌గా నిలిచింది. అయితే బిగ్‌బాస్ విజేతగా పవన్ కళ్యాణ్ ఎంత మొత్తం అందుకున్నాడు? చివరికి ఎంత మిగిలింది? ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 9లో విజేతకు టైటిల్ ట్రోఫీతో పాటు ప్రైజ్‌మనీ కింద 50 లక్షల రూపాయలు, మారుతి సుజుకీ విక్టోరియస్ కారును బహుమతిగా అందిస్తామని నాగార్జున గతంలోనే ప్రకటించారు. అయితే బిగ్‌బాస్ ఫైనల్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంజన, ఇమ్మాన్యుయేల్‌లు ఎలిమినేట్ అయ్యాక టాప్ 3లో తనూజ పుట్టస్వామి, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్ నిలిచారు. వీరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని లేదంటే బ్రీఫ్‌కేస్‌లో ఉన్న అమౌంట్ ఇచ్చి బయటకు తీసుకురావాలని మాస్ మహారాజా రవితేజకు టాస్క్ ఇచ్చారు నాగార్జున.

దాంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన రవితేజ.. పవన్, కళ్యాణ్, తనూజలను తీసుకుని యాక్టివిటీ రూమ్‌కి వచ్చారు. బిగ్‌బాస్ నుంచి టాప్ 3లో ఒకరు బయటకు రావాల్సిన సమయం వచ్చిందని, అయితే సిల్వర్ కలర్ బ్రీఫ్ కేస్‌లో 10 లక్షల రూపాయలు ఉన్నాయని నాగార్జున చెప్పారు. అది తీసుకుని బయటకు వచ్చేయొచ్చని ఆఫర్ ఇచ్చారు. అయితే ముగ్గురిలో ఏ ఒక్కరూ ఒప్పుకోకపోవడంతో నాగార్జున ఆ మొత్తాన్ని 15 లక్షల రూపాయలకు పెంచారు. దాంతో ముగ్గురు ఆలోచనలో పడ్డారు.
అయితే పవన్ కాస్త టెంప్ట్ అవ్వడంతో అతని తల్లిదండ్రులతో మాట్లాడించారు నాగార్జున. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే అని పవన్ తల్లిదండ్రులు చెప్పడంతో ఇక తప్పని పరిస్ధితుల్లో బిగ్‌బాస్ ఇచ్చిన 15 లక్షల రూపాయల బ్రీఫ్ కేస్ తీసుకోవడానికి డిమోన్ పవన్ ఓకే చెప్పాడు. దాంతో సెకండ్ రన్నరప్‌గా బిగ్‌బాస్‌ను వీడాడు పవన్. అంతేకాదు.. అతని అదృష్టం కూడా బాగుందని చెప్పాలి. ఒకవేళ ఈ ఆఫర్‌కు అంగీకరించకుండా ఉంటే ఓటింగ్ ప్రకారం పవన్ ఎలిమినేట్ అయ్యేవాడు. దాంతో ఖాళీ చేతులతో హౌస్‌ను వీడాల్సి వచ్చేది. మంచి నిర్ణయం తీసుకున్నావని వేదిక మీద నాగార్జున, రవితేజలు పవన్‌ను ప్రశంసించారు.
ఇక చివరికి పవన్ కళ్యాణ్- తనూజలు రేసులో మిగలగా.. నాగార్జున గోల్డ్ కలర్ బ్రీఫ్ కేస్‌తో హౌస్‌లోకి వెళ్లారు. బిగ్‌బాస్ మీకు 20 లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చారని ఇది తీసుకుని ఒకరు బయటకు వచ్చేయొచ్చని చెప్పారు నాగ్. అయితే దానికి పవన్ కళ్యాణ్ - తనూజలు నో చెబుతారు. దాంతో నరాలు తెగే ఉత్కంఠ మధ్య బిగ్‌బాస్ తెలుగు 9 విజేతగా పవన్ కళ్యాణ్ గెలిచినట్లు నాగార్జున అనౌన్స్ చేయడంతో తనూజ బాగా ఎమోషనల్ అయ్యింది.
ఇక బిగ్‌బాస్ తెలుగు 9 విజేతగా నిలిచిన పవన్ కళ్యాణ్‌కు మొత్తం ప్రైజ్‌మనీలో డిమోన్ పవన్ 15 లక్షల రూపాయలు పట్టికెళ్లగా.. మిగిలిన 35 లక్షల రూపాయలను బహుమతిగా అందజేశారు. అలాగే విక్టోరీయస్ కారు (దీని ఎక్స్ షోరూం ధర 10.50 లక్షల రూపాయల నుంచి 19.99 లక్షల రూపాయలు)ను, అలాగే బిగ్‌బాస్ విజేతకు రోఫ్ సంస్థ 5 లక్షల రూపాయలను నజరానాగా అందించింది. దాంతో విజేతగా దాదాపు 60 లక్షల రూపాయల వరకు పవన్ కళ్యాణ్ అందుకున్నాడు.
ఇక బిగ్‌బాస్ హౌస్‌లో దాదాపు 15 వారాల పాటు ఉన్నందుకు గాను రోజుకు 10 వేల రూపాయల చొప్పున వారానికి 70 వేల రూపాయలు చొప్పున 10.50 లక్షల రూపాయలను పారితోషికం కింద అందుకున్నాడు. దాంతో రెమ్యునరేషన్‌తో పాటు ప్రైజ్‌మనీ, ట్రోఫీతో పాటు మొత్తంగా బిగ్‌బాస్‌లో ఉన్నందుకు గాను పడాల పవన్ కళ్యాణ్ 70 లక్షల రూపాయలకు పైగా సంపాదించాడు.


Click it and Unblock the Notifications











