Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరంటే? పబ్లిక్‌గా లీక్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
దాదాపు 105 రోజులుగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కు మరికొద్దిగంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. గత సీజన్ల కంటే భిన్నంగా కామన్‌మెన్ vs సెలబ్రిటీలు అంటూ జరిగిన పోరులో తుది విజేత ఎవరు అన్నది ఆదివారంతో తేలిపోనుంది. ప్రస్తుతం టాప్ 5లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉండగా వీరిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 9 టైటిల్ విన్నర్ కానున్నారు. అయితే వీరిలో ఎవరు విజేత అనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ, ప్రజల్లోనూ విజేత ఎవరు అన్న దానిపై చర్చ జరుగుతోంది. తాజాగా బిగ్‌బాస్ తెలుగు 9 విన్నర్ ఎవరు? అన్న దానిపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ ఫైనల్ ఎక్కడ చూడాలంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారం కానుంది. స్టార్ మాతో పాటు జియో హాట్ స్టార్‌లో ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి లేదా రామ్ చరణ్ తేజ్‌లలో ఒకరు ఈ గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా వస్తారని గాసిప్స్ వస్తున్నాయి. అయితే బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కు ఈసారి చీఫ్ గెస్ట్ ఉండరని కొందరు చెబుతున్నారు. నాగార్జునే హోస్ట్‌గా, గెస్ట్‌గా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తారని ఫిలింనగర్ టాక్.

ఫినాలేకి భారీ ఏర్పాట్లు
బిగ్‌బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి నిర్వాహకులు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారట. హీరోయిన్ల డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు, స్కిట్లు, పాటలు, కొత్త సినిమాల ప్రమోషనల్ కార్యక్రమాల తాలూకా ఈవెంట్స్‌తో పలువురు సెలబ్రిటీలు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖులు హౌస్‌లోకి వెళ్లి సందడి చేశారు. ఈరోజు సర్‌ప్రైజ్‌లు మామూలుగా ఉండవని అంటున్నారు.
టాప్ 5లో ఐదుగురు
బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభం నుంచి నేటి వరకు అన్ని రకాలుగా సత్తా చాటి, టాస్క్‌లు, గేమ్స్‌లలో గెలిచి ఐదుగురు కంటెస్టెంట్స్ టాప్ 5లో నిలిచారు. వారే పవన్ కళ్యాణ్, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, డిమోన్ పవన్, ఇమ్యాన్యుయేల్. వీరిలో ముగ్గురు సెలబ్రిటీలు, ఇద్దరు కామన్‌మెన్స్ ఉన్నారు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్ మొదలవ్వగా.. పవన్ కళ్యాణ్ - తనూజాల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. వీరిలో ఒకరు ఖచ్చితంగా విజేత అవుతారని ఎక్కువమంది భావిస్తున్నారు.
బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరంటే
బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరన్న దానిపై సామాన్యులతో పాటు సెలబ్రిటీలలోనూ ఉత్కంఠ నెలకొంది. తాజాగా బుల్లితెర నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రేరణ కంభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా స్టార్ మాలో ప్రసారవమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో ఈ ఆదివారం బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంతా సందడి చేశారు. నిఖిల్ మలియక్కల్, శోభా శెట్టి, యష్మిగౌడ, రీతూ చౌదరి, దివ్వెల మాధురి, నిఖిల్ నాయర్, టేస్టీ తేజా, ప్రేరణ కంభం తదితరులు సరదాగా గేమ్స్ ఆడి ఆడియన్స్‌ను అలరించారు.
లీక్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
ఈ సందర్భంగా బిగ్‌బాస్ తెలుగు 9 విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారని వారి అభిప్రాయాలను శ్రీముఖి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రేరణ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అనిపిస్తోంది, ఎందుకంటే కామనర్‌గా వచ్చి కూడా అందిరినీ ఓడించి, ప్రతీ వీక్ ఆడాడు అని ప్రశంసించింది. ఆ తర్వాత అతని గురించి మొత్తం లీక్ చేయబోతుండగా చాలు అంటూ శ్రీముఖి, టేస్టీ తేజాలు అడ్డుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దానిని కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











