Bigg Boss Telugu 9 Winner Kalyan Padala: బిగ్‌బాస్ తెలుగు 9 టైటిల్ విన్నర్‌గా కళ్యాణ్ పడాల.. జయహో జవాన్!
Bigg Boss Telugu 9 Winner: తెలుగు బుల్లితెరపై 105 రోజుల పాటు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా ముగిసింది. సెప్టెంబర్ 10న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఎన్నాడు చూడని ట్విస్టులు, టర్న్స్ తో కొనసాగింది. ఇక గ్రాండ్ ఫినాలే ఆ ఎంటర్టైన్మెంట్ ను మరింత పెంచింది. ఇక ఫినాలే సమీపించే కొద్దీ 'ఈసారి టైటిల్ ఎవరి చేతికి వెళ్తుంది?' అన్న ప్రశ్నకు సమాధానం కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. చివరకు.. అందరూ అనుకున్నట్టుగానే.. అందరూ అంచనా వేసినట్టే బిగ్ బాస్ టైటిల్ సోల్జర్ చేతుల్లోకి వెళ్లింది. బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌గా కళ్యాణ్ పడాల నిలిచారు.
బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 కంటెస్టెంట్లుగా కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, సంజన నిలిచారు. చివరి వారం వచ్చేసరికి పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. మొదట కళ్యాణ్, తనూజ మధ్య గట్టి పోరు సాగగా, చివరి దశలో డీమాన్ పవన్ కూడా టైటిల్ రేస్‌లోకి దూసుకొచ్చాడు. అయితే చివరి క్షణాల్లో ఓటింగ్‌లో స్పష్టమైన మెజార్టీ సాధించారు. బిగ్ బాస్ ప్రేక్షకలందరూ సోల్జర్ కళ్యాణ్ కు జై కొట్టారు. దీంతో బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ కళ్యాణ్ చేతుల్లోకి వెళ్లింది.

గత కొన్ని వారాలుగా బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌పై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఎక్కువమంది కళ్యాణ్ వైపే మొగ్గు చూపినా... 'ఈసారి లేడీ విన్నర్ అవుతుందా?' అనే చర్చ కూడా జోరుగా సాగింది. తనూజకు భారీ ఫ్యాన్ సపోర్ట్ ఉండటంతో ఆమె పేరు కూడా బలంగా వినిపించింది. కానీ, ఓటింగ్ సరళిని బట్టి చూస్తే చివరకు ప్రేక్షకుల మెజారిటీ మద్దతు కళ్యాణ్‌కే దక్కింది.
ఫైనల్ వీక్ ఓటింగ్ డీటైల్స్
ఫైనల్ వీక్ ఓటింగ్‌లో ప్రధాన పోటీ కళ్యాణ్ పడాల, తనూజ మధ్యే సాగింది. డీమాన్ పవన్ మధ్యలో మంచి పర్‌ఫార్మెన్స్ ఇచ్చి పోటీగా నిలిచినా... టాప్ 2లోకి వెళ్లలేకపోయాడు. సమాచారం ప్రకారం.. కళ్యాణ్ పడాలకు 40 శాతం పైగా ఓట్లు, తనూజకు సుమారు 35 శాతం, డీమాన్ పవన్‌కు 27 శాతం, ఇమ్మాన్యుయేల్‌కు 25 శాతం, సంజనకు 20 శాతం లోపు ఓట్లు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ ఓటింగ్ ట్రెండ్ చివరి వరకూ కళ్యాణ్ స్పష్టమైన ఆధిక్యతతో కొనసాగారు.
అయితే.. ఇప్పటివరకు జరిగిన ఎనిమిది సీజన్లలో ఒక్కసారి కూడా మహిళ విన్నర్‌గా నిలవలేదు. శ్రీముఖి ఒకసారి కప్‌కు చాలా దగ్గరగా వచ్చి రన్నర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 'ఈసారి అయినా లేడీ కంటెస్టెంట్‌కి టైటిల్ ఇవ్వాలి' అన్న అభిప్రాయం కొంతమంది ప్రేక్షకుల్లో కనిపించింది. అందుకే తనూజ విన్నర్ అవుతుందన్న ప్రచారం ఊపందుకుంది. కానీ, చివరకు ఓటింగ్ ట్రెండ్స్, ప్రేక్షకుల మద్దతు కళ్యాణ్ వైపే భారీగా ఉండటంతో... బిగ్ బాస్ టీమ్ కూడా కళ్యాణ్ కు సలాం కొట్టింది. దీంతో రన్నరప్ గా తనూజ పుట్టస్వామి నిలిచారు.
ఎవరీ కళ్యాణ్ పడాల?
కళ్యాణ్ పడాల జర్నీ నిజంగా స్ఫూర్తిదాయకం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన ఆయన.. ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా దేశానికి సేవలందిస్తున్నాడు. మూడేళ్లుగా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న కళ్యాణ్... కామనర్స్ కోటాలో బిగ్ బాస్ అగ్నిపరీక్షలో గెలిచి హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఫిజికల్ టాస్కులు, మైండ్ గేమ్స్ రెండింట్లోనూ తన సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. హౌస్‌లో తన యాటిట్యూడ్, నిజాయితీ గేమ్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.
ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మరో కీలక ఘట్టం. గతంలో పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కోటాలో విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో కళ్యాణ్ పడాల మరోసారి సామాన్యుడి శక్తిని నిరూపించాడు. సైనికుడిగా దేశాన్ని కాపాడుతున్న వ్యక్తి... రియాలిటీ షోలోనూ విజేతగా నిలవడం అభిమానులకు మరింత గర్వకారణంగా మారింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్‌గా కళ్యాణ్ పడాల నిలవడం ఈ సీజన్‌కు సరైన ముగింపుగా మారిందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











