బిగ్‌బాస్‌లో రణరంగం.. టికెట్ ఫినాలే కోసం తెగబడిన కంటెస్టెంట్లు

Recommended Video

Bigg Boss Telugu 3 : Episode 92 Highlights || టికెట్ ఫినాలే కోసం కొట్టేసుకున్న కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 రియాలిటీ షో తుది దశకు చేరుకోవడంతో కంటెస్టెంట్ల మధ్య పోటీ ఎక్కువగా పెరిగిపోయింది. నువ్వా నేనా అనే రీతిలో ఇంటి సభ్యులు తెగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో 92వ రోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇవ్వడంతో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. దాంతో శారీరక దాడులకు కూడా సిద్ధపడే విధంగా టాస్క్ పురిగొల్పింది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కంటతడి పెట్టిన వరుణ్

కంటతడి పెట్టిన వరుణ్

వితిక ఎలిమినేషన్ తర్వాత వరుణ్ ఒంటరయ్యాడు. ఓ మూలన కూర్చొని వితికను గుర్తు చేసుకొంటూ వరుణ్ కంటతడి పెట్టాడు. అది చూసి వరుణ్ వచ్చి సముదాయించాడు. ఊరుకో బాస్.. ఒక వీక్ అయితే వాళ్లే వస్తారు అని బుజ్జగించారు. దాంతో వితికతో కలిసి ఉండే వాడిని. ఇప్పుడు లేకపోయే సరికి కాస్త బాధగా ఉందంటూ వరుణ్ చెప్పాడు.

బ్యాటరీ ఉంటే జరుపుకోండి పండుగ

బ్యాటరీ ఉంటే జరుపుకోండి పండుగ

ఆ తర్వాత మండే టాస్క్ గురించి చెప్పాడు. బ్యాటరీ ఉంటే నిండుగా జరుపుకోండి పండుగ అనే నామినేషన్ టాస్క్ ఇచ్చారు. ఒక బోర్డుపై రంగుల ప్లేట్స్ పెట్టి వాటిని ఇంటి సభ్యులు తీసుకోవాలని సూచించారు. అలా ప్లేట్ తీసుకోగా 70 శాతం బ్యాటరీ పాయింట్స్ అలీకి వచ్చాయి. కలర్ బ్లాక్‌లో శ్రీముఖి 50 శాతం వచ్చింది. వరుణ్‌కు 40 శాతం చొప్పున వచ్చాయి.

అలీ, శివజ్యోతి మధ్య

అలీ, శివజ్యోతి మధ్య

టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను ఇద్దరి చొప్పున జట్టుగా చేసి వారికి పోటీ పెట్టారు. వరుణ్-రాహుల్, బాబా భాస్కర్-శ్రీముఖి, శివజ్యోతి-అలీరెజా జట్లుగా రూపొందించి టాస్క్ ఇచ్చారు. శివజ్యోతి, అలీకి అరటి పళ్లు తినే సింపుల్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో అలీకి ఎక్కువ పాయింట్లు సంపాదించారు. ఎవరు ముందు గంట కొడుతారో వారే విజేతగా నిలుస్తారని చెప్పారు. ఈ పోటీలో అలీ విజేతగా నిలిచారు.

 రాహుల్ వర్సెస్ వరుణ్

రాహుల్ వర్సెస్ వరుణ్

ఇక టాస్క్ పోటీలో వరుణ్, రాహుల్ మధ్య జరిగిన పోటీనే కొంత హింసాత్మకంగా మారింది. ఒక్కొక్కరికి ఓ బస్తా భుజాన వేసి వాటిలోని సరుకును ఖాళీ చేయాలి. ఎవరైతే ప్రత్యర్థి బస్తాను ఖాళీ చేస్తారో వారు విజేతగా నిలుస్తారు. టికెట్ ఫినాలే గెలుచుకోవడానికి మార్గం సుగమవుతుంది. ఈ పోటీలో రాహుల్, వరుణ్ ఫిజికల్‌గా తమ బలాన్ని చూపించుకొనే ప్రయత్నంలో కాస్త హింసాత్మకంగా మారింది.

 బాబాతో శ్రీముఖి పోటి

బాబాతో శ్రీముఖి పోటి

ఇక బాబా భాస్కర్, శ్రీముఖి మధ్య జరిగిన పోటీ వినోదాత్మకంగా సాగింది. ఓ బాక్సులో ఇంగ్లీష్ అక్షరాలను నోటితో తీసే కార్యక్రమాన్ని ఇచ్చారు. పిండిలో ఉన్న ఆల్ఫాబెట్స్‌ను తీయడంలో బాబా భాస్కర్‌ సక్సెస్ కావడంతో ఈ పోటీలో ఆయన గెలుపొందారు. ఇక గెలిచిన వారికి రీఛార్జ్ చేసుకొంటూ ఎక్కువ పాయింట్లు సాధించారు.

టికెట్ ఫైనల్ కోసం వ్యూహాలు

టికెట్ ఫైనల్ కోసం వ్యూహాలు

టికెట్ ఫినాలే టాస్క్‌లో సుమారు 70 శాతం పాయింట్లతో అలీ రెజా ముందుంటే.. ఆ తర్వాత 50 శాతం పాయింట్లతో రాహుల్ రెండోస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో బాబా భాస్కర్, శ్రీముఖి తదితరులు నిలిచారు. ఇక టికెట్ ఫైనల్ సాధించడానికి సెకండ్ రౌండ్‌లో పోటీ పడనున్నారు. ఇక రెండో రౌండ్‌లో మరింత బలప్రయోగం కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎక్కువ పాయింట్లు సాధించేందుకు ఎవరికి వారు వ్యూహాలు పన్నుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X