హారికను సేవ్ చేసిన కమల్ హాసన్.. ఇంట్లో తులాభారం.. అవినాష్‌కు బంపర్ ఆఫర్

బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో వారాంతంలో వినోదంపాటు అనేక ప్రత్యేకమైన విషయాలు చోటుచేసుకొన్నాయి. నాగార్జున ఇంటి సభ్యులకు క్లాస్ పీకడంతోపాటు ఇంటి సభ్యుల ఒకరిపై మరొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకొన్నారు. ఇక కమల్ హాసన్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి సభ్యులకు పరిచయం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది, అలాగే కొన్ని కొన్ని ఆసక్తికరమైన గేమ్స్ ఆడించారు. వారాంతం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

ఇంటి సభ్యులపై ఆరోపణలు

ఇంటి సభ్యులపై ఆరోపణలు


తొమ్మిది వారాలు పూర్తయిన తర్వాత ఇంటి సభ్యులపై మంచి అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఒకరిపై ఆరోపణలు ఉంటే బయటకు చెప్పాలి. అలాగే తగిన కారణాలను కూడా వెల్లడించాలని చెప్పగా.. అభిజిత్, అఖిల్ అమ్మా రాజశేఖర్‌పై మరికొందరు అరియానాపై తమ ఫిర్యాదు చేసి తగిన కారణాలు చెప్పారు. తమపై వచ్చిన ఆరోపణలకు ఆ వ్యక్తి తగిన విధంగా డిఫెండ్ చేసుకొన్నారు.

వెలిగిపోయే.. ఆరిపోయే దీపం గేమ్

వెలిగిపోయే.. ఆరిపోయే దీపం గేమ్

దీపావళి పండుగ సందర్భంగా ఇంటిలో వెలిగిపోయే దీపం ఎవరు? ఆరిపోయే దీపం ఎవరు? అనే రెండు పాయింట్ల మీద ఇద్దరి గురించి చెప్పాలనే గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో ఎక్కువ మంది అరియానాను, అమ్మా రాజశేఖర్‌ను ఆరిపోయే దీపంగా అభివర్ణించారు. అందుకు తగిన కారణాలను కూడా చెప్పారు. వెలిగిపోయే దీపం అందరికి సమానంగా ఓట్లు లభించాయి.

ఇంటి సభ్యులకు కమల్‌తొ పరిచయం

ఇంటి సభ్యులకు కమల్‌తొ పరిచయం

ఇక ఇంటిలోకి కమల్ హాసన్ ప్రవేశించాడు. తన బర్త్ డే రోజు కావడంతో కమల్‌కు నాగార్జున జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. అలాగే ఇంటి సభ్యులందరిని కమల్ హసన్‌కు నాగార్జున పరిచయం చేశారు. కమల్ హాసన్‌కు ఇంటి సభ్యులు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే కమల్ హసన్ తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్లను పరిచయం చేశారు. అలాగే ఇంటిలో నామినేట్ అయిన సభ్యుల్లో నుంచి హారికను కమల్ సేవ్ చేశారు.

హారికను సేవ్‌ చేసిన కమల్ హాసన్

హారికను సేవ్‌ చేసిన కమల్ హాసన్

కమల్ హాసన్ చేతుల మీదుగా సేవ్ కావడంతో హారిక ఎగిరి గంతేసినంత పని చేశారు. కమల్ హాసన్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. కమల్ హాసన్ చేతుల మీదుగా సేవ్ కావడం ఆనందంగా ఉంది. నా కుటుంబంలో అమ్మ, అన్నయకు చాలా హ్యాపీగా ఉంటుంది అని అన్నారు. సేవ్ చేసింది నేను కదా అని నాగార్జున అంటే.. అవును సార్.. థ్యాంక్యూ అంటూ కామెంట్ చేసింది.

అవినాష్‌కు బంపర్ ఆఫర్

అవినాష్‌కు బంపర్ ఆఫర్


ఇక ఇంటిలో ఇమ్యునిటీ లభించే ఓ టాస్క్‌ను నాగార్జున ప్రారంభించాడు. గత వారం నామినేట్ అయిన మోనాల్, అవినాష్‌కు ఇమ్యునిటీ తెచ్చుకొనే అవకాశం లభించింది. అందుకోసం ఇంటి సభ్యులు తమ వస్తువులను దానం చేయాలి. అలా రెండు బుట్టల్లో వేయాలి. ఏ బుట్టలో బరువు ఉంటుందో వారికి ఇమ్యునిటీ లభిస్తుంది అని గేమ్ రూల్ తెలిపారు. ఈ గేమ్‌లో మోనాల్‌కు కేవలం అఖిల్ మాత్రమే సపోర్ట్ చేయగా.. అవినాష్‌కు సోహైల్, మెహబూబ్, అరియానా, లాస్య మద్దతు తెలిపారు. మోనాల్ బాక్స్ 13 కిలోలు, అవినాష్‌కు 23 కిలోల బరువు తూగాయి. దాంతో అవినాష్‌కు ఇమ్యునిటీ లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X