అమ్మా రాజశేఖర్ ఎలిమినేషన్‌లో కొత్త ట్విస్టు.. అభిజిత్ పేరు తెరపైకి.. షాకివ్వనున్న బిగ్‌బాస్!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 4వ సీజన్‌లో తొమ్మిదో వారం ఎలిమినేషన్ అత్యంత ఆసక్తిగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిదో వారానికి ప్రత్యేకత సంతరించుకొన్నది. ఈ వారంలో బిగ్‌బాస్ నిర్వాహకులు కొత్త రకం స్ట్రాటేజీని అమలు చేయబోతున్నారనే వార్తల మధ్య ఎలిమినేషన్ ప్రక్రియపై ఆసక్తి పెరిగింది. అయితే బిగ్‌బాస్ యూనిట్ అమలు చేసే ప్లాన్ గురించి ప్రచారం జరుగుతున్న ప్రకారం...

నామినేషన్లలో ఉంది వీరే..
బిగ్‌బాస్ ఇంటిలో ప్రస్తుతం వారంలో అభిజిత్, అమ్మా రాజశేఖర్, అవినాష్, హారిక, మోనాల్ గజ్జర్ నామినేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్లలో అమ్మా రాజశేఖర్ బలహీనమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. ప్రేక్షకుల అభిప్రాయపడుతున్న ప్రకారం ఎక్కువ శాతం అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ కావడం తథ్యం అనే మాట వినిపిస్తున్నది.

గేమ్‌ను మలుపు తిప్పిన బిగ్‌బాస్
అయితే ప్రేక్షకులు ఓ విధంగా ఊహిస్తుంటే అమ్మా రాజశేఖర్ విషయంలో బిగ్‌బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇంటి నుంచి వెళ్లిపోయే వ్యక్తికి ఇంటి కెప్టెన్ బాధ్యతలను అప్పగించి షోను మరో మలుపు తిప్పాడు. అయితే బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఎంపికైన వ్యక్తి ఎలిమినేట్ కాకపోవడంతో రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో ఇలా
అయితే గత బిగ్‌బాస్ సీజన్లను చూస్తే.. ఒకటో సీజన్‌లో ముమైత్ ఖాన్ కెప్టెన్‌గా కొనసాగుతున్న సమయంలో ఆమెను ఎలిమినేట్ చేసి షాకిచ్చారు. అయితే ఆమెను ఇంటి నుంచి బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్‌లో పెట్టి ఇంటి సభ్యుల వ్యవహారాన్ని చూశారు. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత తిరిగి ఇంటిలోకి వచ్చారు. ఇలా బిగ్‌బాస్ ట్విస్టు ఇచ్చారు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో ఇలా
ఇక మూడో సీజన్‌లో కూడా 58, 59 సీజన్లలో కూడా ఇలాంటి ట్విస్టునే కొనసాగించారు. కెప్టెన్‌ా కొనసాగుతున్న రాహుల్ సిప్లిగంజ్‌ను ఎలిమినేట్ చేసి ప్రేక్షకులను, ఇంటి సభ్యులకు ఝలక్ ఇచ్చాడు. అయితే రాహుల్‌ను కూడా సీక్రెట్ రూమ్‌లో పెట్టి ఆ తర్వాత ఇంటిలోకి పంపించాడు. మూడో సీజన్‌లో రాహుల్ విజేతగా నిలువడం తెలిసిందే.

ఎలిమినేషన్ వరకు వెళ్లిన మాస్టర్
ఇక ప్రస్తుత సీజ్ విషయానికి వస్తే.. అమ్మా రాజశేఖర్ ఎలిమినేషన్ అనుభవాన్ని చూసి తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆయనను మళ్లీ సేవ్ చేస్తే ప్రేక్షకుల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు గత సీజన్ మాదిరిగా ఫాలోయి అమ్మా రాజశేఖర్ ఎలిమినేషన్ విషయంలో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చి సీక్రెట్ రూమ్‌కు పంపుతారా? లేక నేరుగా ఎలిమినేట్ చేస్తారా అనే విషయం ఆసక్తిగా మారింది.

ఎలిమినేషన్ ప్రక్రియలో అభిజిత్ పేరు
ఇదిలా ఉండగా, ఈ వారం అభిజిత్‌ను ఎలిమినేట్ చేసి ట్విస్టు ఇవ్వాలనే ఉద్దేశంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం. ఇంటిలో బలమైన కంటెస్టెంట్ అభిజిత్‌ను ఎలిమినేట్ చేసి ఇంటిలోని సీక్రెట్ రూమ్‌కు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే కొద్ది గంటల్లో 9వ వారం ఎలిమినేషన్‌పై ట్విస్టు బయటకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











