మోనాల్ నీకు ఫ్రెండా? అంతకంటే ఎక్కువనా? నాగార్జున పంచ్‌కు ముఖం తిప్పేసుకొన్న అఖిల్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4కు సంబంధించిన 9వ వారాంతం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యుల ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలిమినేషన్ వీక్ కావడంతో వారం రోజులపాటు ఇంట్లో జరిగిన విషయాలపై, వారు అనుసరించిన విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్‌పై ఇంటి సభ్యుల దుమ్మ దులిపేశాడు. వేదిక మీద నుంచి నాగార్జున మాట్లాడుతూ..

నీకు ఒక్కడికే ఆత్మ గౌరవమా?
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఆడిన టీ టేబుల్ గేమ్‌లో ఇంటి సభ్యులు ప్రవర్తించిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆత్మ గౌరవం అనే పదం ఉపయోగించి టాస్క్ నుంచి వెళ్లిపోయావు. మిగితా వాళ్లకు లేదా అంటూ అభిజిత్‌ను నిలదీశాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఆట నుంచి బయటకు రావడం సరైనదా అని అడిగి చేతులు ఎత్తమని ఇంటి సభ్యులను అడిగితే.... ఎవరు కూడా చేతులు ఎత్తకపోవడంతో మరింత కోపాన్ని ప్రదర్శించాడు.

అఖిల్ నామినేట్ చేస్తాడని ఊహించలేదు
వారాంతం ఎపిసోడ్‌లో భాగంగా మోనాల్ గజ్జర్ మాట్లాడుతూ.. ఇంటిలో అఖిల్ నాకు ఫ్యామిలీ మెంబర్ అని భావించాను. కానీ ఆయన నన్ను నామినేట్ చేస్తాడని ఊహించలేదు అంటూ కంటతడి పెట్టుకొన్నారు. దాంతో అఖిల్ నిన్ను సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నాను.. మోనాల్ నీకు ఫ్రెండా? అంతకంటే ఎక్కువనా? అంటూ నాగ్ ప్రశ్నించగా.. ఆయన ముఖం తిప్పేసుకొన్నాడు.

బిగ్‌బాస్ ఆదేశాల మేరకే
ఇక టీ స్టాండ్ టాస్క్‌లో కెప్టెన్సీ పోటీ దారులకు డిస్ట్రబ్ చేయడానికి మట్టి, నీళ్లు, ఐస్, చెత్త, గడ్డి ఉంది అంటూ అరియానాపై సోహైల్ ఫిర్యాదు చేసినట్టు కనిపించింది. అయితే అందుకు సమాధానంగా అరియానా నేను ఐస్ తీసుకురాలేదు. బిగ్‌బాస్ పంపించాడు. ఆయన పెట్టిన గేమ్ ప్రకారమే నేను ఆడాను అని స్పష్టం చేసింది.

మానవత్వం మరిచిందంటూ మోనాల్
టీ స్టాండ్ గేమ్‌లో మానవత్వం లేకుండా ఆడిందని అరియానాపై మోనాల్ కంప్లయింట్ చేసింది. టాస్క్ టాస్క్‌లానే ఆడాలని నమ్ముతాను. కానీ టాస్క్‌లో అరియానా మానవత్వం అనే కోణాన్ని మరిచిపోయింది అని నమ్ముతున్నాను అంటూ మోనాల్ ఆవేదన వ్యక్తం చేసింది. మోనాల్ కౌంటర్ ఇస్తూ.. బిగ్‌బాస్ నాకు టాస్క్ ఇచ్చాడ... నేను కంప్లీట్ చేశాను అంటూ అరియానా తన వెర్షన్‌ను చెప్పింది.


Click it and Unblock the Notifications











