Bigg Boss Telugu: బిగ్‌బాస్‌లోకి చిరంజీవి,పవన్ కళ్యాణ్,మహేశ్ బాబు.. హౌస్ లో సెలబ్రెటీల హంగామా..

Bigg Boss Telugu: బుల్లితెర ప్రపంచంలో అత్యధిక గుర్తింపు పొందిన రియాలిటీ షో ఏది? అని అడిగితే, వెంటనే టక్కుమని గుర్తుకు వచ్చే పేరు బిగ్ బాస్ తెలుగు. గత తొమ్మిదేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ గేమ్ షో ప్రస్తుతం సీజన్ 9తో ముగింపు దశకు చేరుకుంది. ఈ షోకు రోజురోజుకు అత్యంత ఆదరణ పెరుగుతోంది. ఇక సీజన్ 9 కు మరో వారంపది రోజుల్లో ఎండ్ కార్డ్ పడబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మీమ్స్, స్పూఫ్స్, AI వీడియోలు సోషల్ మీడియాలో వరుసగా ట్రెండ్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఏఐ( AI)క్రియేషన్ వీడియో మాత్రం బిగ్ బాస్ అభిమానులను, సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?

ఈ వైరల్ వీడియోలో బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లుగా ఎవరు ఎంట్రీ ఇస్తున్నారంటే ? మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వికర్టీ వెంకటేష్ వంటి టాలీవుడ్ టాప్ స్టార్‌లు అందరూ ఈ గేమ్ షోలో కలిసి ఉంటున్నట్లు చూపించారు. హౌస్‌లో వారి రియాక్షన్లు, టాస్కుల సమయంలో చేసే వినోదం, ఫన్నీ ఎక్స్ప్రెషన్లు అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారు. ఈ వీడియో ఎంతో రియలిస్టిక్‌గా కనిపిస్తున్నాయి.

Bigg Boss Telugu AI Video Featuring Chiranjeevi Pawan Kalyan Mahesh Goes Viral

అంతేకాదు.. హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, త్రిష కూడా పాల్గొన్నారు. మరోహైలెట్ ఎంటీ అంటే.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా బ్రహ్మానందం ప్రవేశించడం ఈ వీడియోలో అసలు హైలైట్‌గా నిలిచింది. ఆ వీడియో చూపించడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. మరోక హైలెట్ ఏంటంటే? హోస్ట్‌గా రామ్ గోపాల్ వర్మ (RGV) వ్యవహరించడం. వర్మ తన స్టైల్‌కు తగ్గట్టుగా బిగ్ బాస్ హోస్టింగ్ చేసుంటే ఎలా ఉండేది? అనే ఊహకు ఈ వీడియో ద్వారా కొత్త రూపం ఇచ్చారు. ఆయన డైలాగులు, పోజులు అన్నీ వీడియోను మరింత వైరల్ నిలిచాయి.

బిగ్ బాస్ అభిమానులు,నెటిజన్లు ఈ ఏఐ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు. "ఇలాంటి సీజన్ నిజంగా వస్తే రికార్డులు తిరగరాస్తుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ వీడియో ఒక వైపు వైరల్ అవుతుండగా, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో పరిస్థితి రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతుంది. ఈ సీజన్ 14వ వారంలోకి అడుగుపెట్టంది.

దీంతో కంటెస్టెంట్స్ కే కాదు.. బిగ్ బాస్ అభిమానులకు కూడా టెన్షన్ గా మారింది. ఈ వారం ఎవరూ ఊహించిన విధంగా నామినేషన్స్ రద్దు చేసి, ప్రత్యక్ష యుద్ధం టాస్క్ తీసుకొచ్చాడు. ఈ టాస్క్‌లో ఎవరైతే టాప్ స్కోర్ సాధిస్తారో వారు టాప్ 5లో సేఫ్ అవుతారు. మిగతా కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ప్రమాదంలో ఉంటారని బిగ్ బాస్ ప్రకటించడంతో హౌస్‌లో హై టెన్షన్ మొదలైంది. ఈ పరిస్థితి చూస్తే.. బీబీ హౌస్ లో మూడవ యుద్ధం కొనసాగుతుందా? అన్నట్లుగా ఉంది.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు కేవలం రోజులు మాత్రమే ఉండటంతో బిగ్ బాస్ విన్నర్ ఎవరు? టాప్ 5లో ఎవరికి చోటు దక్కుతుంది? అన్నదానిపై చర్చలు సోషల్ మీడియాలో వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య పోటీ, సోషల్ మీడియాలో ఏఐ క్రియేషన్లు రెండు కలిసి బిగ్ బాస్‌ను మరింత ఎంటర్టైనింగ్‌గా మార్చేశాయి. ఫైనల్ క్లైమాక్స్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రతి కంటెస్టెంట్ తన స్థానం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్న వేళ.. ఈ వారం చివరికల్లా ఎవరు టాప్‌లోకి చేరతారు? ఎవరు వెనుకబడతారు? అన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X