twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ ‘డబుల్’ షాక్.. ఆ ఇద్దరు ఎలిమినేషన్ అంటూ జోరుగా..

    By Rajababu
    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Double Elimination Was Planned In The Show

    తెలుగు బిగ్‌బాస్‌లో గతవారం ఎలాంటి ఎలిమినేషన్ ప్రక్రియ లేకపోవడంతో సభ్యులు, ప్రేక్షకులు ఊపిరి పీల్చుకొన్నారు. కానీ ఈ సారి డబుల్ రీంఎంట్రీతోపాటు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుందనే సంకేతాలు వచ్చాయి. డబుల్ ఎలిమినేషన్‌కు బలం కలిగించేలా ఈ వారం కూడా ఆరుగురు సెలబ్రిటీలు నామినేట్ కావడం కూడా ఈ ఊహాగానానికి బలం చేకూర్చింది.

    బిగ్‌బాస్ డబుల్ షాక్

    బిగ్‌బాస్ డబుల్ షాక్

    బిగ్‌బాస్ వీకెండ్ షోలో నాని ముందే హింట్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌లోకి ఒక్కరు వస్తారనుకుంటే ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. దీనిని బట్టి బిగ్‌బాస్‌లో ఏదైనా జరుగవచ్చు అని మరోసారి నాని వెల్లడించారు. కాబట్టి ఈసారి మలయాళం బిగ్‌బాస్‌లో మాదిరిగా డబుల్ నామినేసన్ ఉండే అవకాశం లేకపోలేదు.

    మలయాళంలో టాప్ కంటెస్టెంట్

    మలయాళంలో టాప్ కంటెస్టెంట్

    మలయాళం బిగ్‌బాస్‌లో కూడా ఎలాంటి షాకులు గతవారం కనిపించాయి. టైటిల్ గెలుస్తుందనుకొన్న శ్వేతమీనన్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. అలాగే మరో సెలబ్రిటీ రజనీ కూడా ఇంటి నుంచి నిష్క్రమించింది. వీరి స్థానంలో తొలి ట్రాన్స్‌జెండర్ (లింగమార్పిడి) నటి అంజలి అమీర్ ఇంట్లోకి ప్రవేశించింది.

    నామినేషన్‌లో ఆరుగురు

    నామినేషన్‌లో ఆరుగురు

    ఇక తెలుగు బిగ్‌బాస్‌లో నామినేట్ అయిన ఆరుగురిలో దీప్తి నల్లమోతు, కౌశల్, బాబు గోగినేని, దీప్తి సునైనా, నందినీరాయ్, గణేష్ ఉన్నారు. వీరిలో ఈ వారం ఇంటి నుంచి వెళ్లే వారిలో బాబు గోగినేని పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆ తర్వాత దీప్తి నల్లమోతు కూడా ఎలిమినేషన్ జాబితాలో ఉండే అవకాశం లేకపోలేదు.

    నామినేషన్‌ ఉచ్చులో కౌశల్

    నామినేషన్‌ ఉచ్చులో కౌశల్

    ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న కౌశల్ అనూహ్య పరిస్థితుల్లో నామినేట్ అయ్యారు. ర్యాంకింగ్ టాస్క్‌లో దీప్తి నల్లమోతు కారణంగా నామినేషన్ ఉచ్చులో ఇరుక్కుపోయారు. ఈ వారం ఎలిమినేషన్ కౌశల్ ఎలా తప్పించుకొంటాడో వేచి చూడాల్సిందే.

    ఆ ఇద్దరు ఎక్కడనున్నారు?

    ఆ ఇద్దరు ఎక్కడనున్నారు?

    ఇదిలా ఉండగా, మంగళవారం నూతన్ నాయుడు, శ్యామల ఇంట్లోకి ప్రవేశిస్తారనుకొంటే అదీ జరుగలేదు. వారి ఎంట్రీని ఇంకా బిగ్‌బాస్ సస్పెన్స్‌లోనే ఉంచాడు. వారు ఎక్కడ ఉన్నారో అనే విషయం కూడా మాట వరుసకైనా చెప్పలేదు. దాంతో వారి రాక కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.

    English summary
    Bigg Boss 2 Telugu 50 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. 45th day phone calls attended by celebraties. Babu Gogineni plans get out of Kaushal from house. Eliminated members Shayamala, Nutan Naidu entered into Bigg Boss House.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X