అదొక వ్యసనంగా మారింది.. నాగార్జున కామెంట్స్ వైరల్

Bigg Boss Telugu: బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ నోచుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. రియాలిటీ షోల్లో ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న గేమ్ షో ఇది. ఒకప్పుడు హిందీలో మాత్రమే ప్రసారమైన ఈ కార్యక్రమం.. తర్వాత తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో ప్రవేశించి, అపారమైన అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశలో ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు? రన్నరప్ ఎవరు? అనే విషయంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా షో హోస్టుగా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

కింగ్ నాగార్జున ఒక కార్యక్రమంలో పాల్గొని బిగ్ బాస్ హోస్టింగ్ గురించి తన అనుభవాన్ని వెల్లడించారు. నాగార్జున మాట్లాడుతూ.. 'నిజానికి తొలుత ఈ షోకు హోస్టుగా చేయడానికి అస్సలు ఇష్టపడలేదు'అంటూ అన్నారు. కానీ,'సీజన్ 3 చేసిన తర్వాత, బిగ్ బాస్ ఒక వ్యసనంలా మారిపోయింది. ఒకసారి ఇందులోకి అడుగు పెట్టాక బయటకు రావాలని అనిపించదు.'అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆయన మాటల్లో ఆ గేమ్ షోపై ఆయనకు ఉన్న ఇష్టం, బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఏర్పడిన అనుబంధం తెలుస్తోంది.

Bigg Boss Telugu Became an Addiction Nagarjuna s Latest Comments Go Viral

తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ నిర్వహించగా, రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు.కానీ, సీజన్ 3 నుండి ఇప్పటివరకు వరుసగా నాగార్జునే హోస్ట్‌చేస్తున్నారు. ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు కొత్త హీరోల పేర్లు వినిపించినా, చివరికి ఈ బాధ్యతలను నాగార్జుననే స్వీకరిస్తున్నారు. ఆయన మంచి కమ్యూనికేషన్ స్కిల్, ఎమోషన్స్‌ ను హ్యాండిల్ చేసే తీరు, ఎంటర్టైన్మెంట్ అడ్డంగా ఈ షో మరోస్థాయికి తీసుకెళ్లాయి. దీనికి నాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తోడు కావడంతో గేమ్ షోకు ఫాలోయింగ్ మరింత పెరిగింది.

అయితే, బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరించడానికి ముందు నాగార్జున చేసిన వ్యాఖ్యల వల్ల కొంతకాలం సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. అప్పట్లో "బిగ్ బాస్ నేను చేయను" అని చెప్పిన నాగార్జున, ఇప్పుడు అదే షో గురించి "ఇది నాకు వ్యసనం అయిపోయింది" అని చెప్పడంతో ఆ పాత వివాదానికి తెరపడినట్టు అయిందనే చెప్పాలి. తాజాగా హాట్‌స్టార్ ఈవెంట్‌లో ఆయన ఈ విషయంపై స్పష్టత ఇవ్వడంతో అభిమానులు కొత్త జోష్ వచ్చింది.

ఇక మరో వైపు నాగార్జున సినిమాల పరంగా కూడా దూసుకుపోతున్నారు. ఇటీవల ధనుష్ నటించిన కుబేర సినిమాలో నటించగా, రజనీకాంత్ -లోకేష్ కనగరాజ్ రూపొందించిన కూలీ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు. ఒకవైపు సినిమాల్లో కెరీర్‌ను కొనసాగిస్తూనే మరోవైపు బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తూ బిజీబిజీగా మారింది. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా పనులలో బిజీ అవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ఇది ఆయన కెరీర్‌లో అత్యంత కీలక ప్రాజెక్ట్‌ కావడంతో మొత్తం ఇండస్ట్రీ చూపులు ఈ సినిమా మీదే ఉన్నాయి. మొత్తం మీద బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున కొనసాగడం, సోషల్ మీడియాలో ట్రెండింగ్ విషయంగా మారింది. ఒకప్పుడు చేయనని చెప్పినా, ఇప్పుడు షో పట్ల ప్రేమను వ్యక్తం చేయడం అభిమానులకు సంతోషాన్ని తెచ్చింది. ఇక సీజన్ 10 లో కూడా నాగార్జునే హోస్టుగా కొనసాగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X