నోయల్ సీన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బిగ్‌బాస్.. కెప్టెన్సీ లభించినా తప్పని వేటు!
అమీ తుమీ టాస్క్‌లో విజేతలుగా నిలిచిన టీమ్ ప్రస్తుత వారానికి కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. కెప్టెన్సీ టాస్క్‌లో తలతో ప్లాస్టిక్ బాల్స్‌తో ఫుట్‌బాల్ ఆడి ఎక్కువ గోల్స్ సాధించాలనే నిబంధనకు తగినట్టుగా తమ శక్తి సామర్థ్యాలకు మేరకు ఆడారు. అఖిల్, నోయల్ సీన్, దివి, అమ్మా రాజశేఖర్, హారిక కెప్టెన్సీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అందరిలో చురుకుగా ఆడిన నోయల్ సీన్ టాప్ గోల్స్ సాధించడంతో మరోసారి కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అయితే కెప్టెన్‌గా ఎంపికైన నోయల్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన షాక్ ఏమిటంటే..

స్వయంగా నామినేట్ అయిన నోయల్ సీన్
అమీ తుమీ టాస్క్ సందర్భంగా వచ్చే వారం నామినేట్ అయ్యేలా బిగ్‌బాస్ విధించిన షరతును నోయల్ సీన్ అంగీకరించాడు. ఆ కారణంగా అఖిల్ సార్థక్ టీమ్ మంచి పాయింట్లు సాధించింది. ఆ కారణంగా నోయల్ సీన్ చిక్కుల్లో పడిపోయాడు. సాధారణంగా కెప్టెన్‌కు నామినేషన్ నుంచి ఇమ్యునిటీ ఉంటుంది. ఈ కారణంగా నోయల్ సీన్ ఆ మంచి అవకాశాన్ని కోల్పోయాడు.

ఇంటి కెప్టెన్‌గా నోయల్ సీన్
తలతో ఫుట్‌బాల్ ఆడిన టాస్క్‌లో 16 గోల్స్ సాధించిన నోయల్ సీన్ కెప్టెన్‌గా ఎన్నికైనట్టు ఇంటి సభ్యులు ప్రకటించారు. కెప్టెన్‌గా ఎంపికైన నోయల్‌ను ఈ సందర్బంగా బిగ్‌బాస్ అభినందించారు. ఈ సందర్బంగా నోయల్‌కు ఓ విషయాన్ని వెల్లడిస్తూ షాకిచ్చారు.

7వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో
అమీ తుమీ టాస్క్‌లో నామినేట్ అయినందున కెప్టెన్స్‌కి లభించే ఇమ్యునిటి లభించదు. కాబట్టి కెప్టెన్‌గా ఉంటూనే ఏడోవారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో నామినేట్ అయి ఉంటారు. ఈ విషయాన్ని గమనించాలని అన్నాడు. బిగ్‌బాస్ తెలిపిన వెంటనే నామినేషన్‌లో ఉంటే ఓ కిక్కు అంటూ నోయల్ కామెంట్ చేశాడు.
Recommended Video

నాన్న తొడ గొట్టు అంటూ నోయల్ కేక
ఇక కెప్టెన్సీ బాధ్యతలను సోహైల్ నుంచి స్వీకరిస్తూ ఆనందంలో మునిగిపోయాడు. నోయల్ చేతికి కెప్టెన్సీ బ్యాండ్‌ను సోహైల్ కట్టిన వెంటనే గట్టిగా అరిచాడు. నాన్న నీ కొడుకు కెప్టెన్ అయ్యాడు. తొడ కొట్టు నాన్న అంటూ పెద్ద పెట్టున కేక పెట్టారు. అలా కెప్టెన్సీ సాధించిన ఆనందాన్ని అందరితో పంచుకొన్నాడు.


Click it and Unblock the Notifications











