బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్.. ఆ పవర్ కోసం ఇంటి సభ్యుల రచ్చ.. కుమ్ములాట

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 52వ రోజు కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల్లో భావోద్వేగాలు, అవేశాలు ఇంటి సభ్యుల ముఖంలో కనిపించాయి. కెప్టెన్సీగా మారితే ఒకవారంపాటు ప్రత్యేక సదుపాయాలతోపాటు ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకొనే అవకాశం ఉండటంతో ఇంటి సభ్యులు ఆ హోదా కోసం పోటీ పడ్డారు. అయితే ఈ పోటీలో అరియానా, హారిక, యాంకర్ లాస్యతోపాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా రంగంలోకి దూకారు.

కెప్టెన్సీ టాస్క్‌ కోసం ఓ తాళం చేవి ఆటను ఇంటి సభ్యులతో ఆడించారు. ఆ తాళం కోసం మగ సెలబ్రిటీలు పోటీ పడ్డారు. ఆ తర్వాత జరిగిన ప్రక్రియలో యాంకర్ లాస్య ఆ కీ నా వద్ద ఉంటే బాగుండు అంటూ తన అభిప్రాయన్ని వ్యక్తం చేసింది. హారిక మాట్లాడుతూ.. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు అంటూ కామెంట్ చేసింది.

Bigg Boss Telugu Captaincy Task: Serious fight for the Game

గతవారం కెప్టెన్సీ హోదాను జస్ట్‌లో మిస్ అయిన అరియానా మాట్లాడుతూ.. ఆ పవర్‌ను అనుభవించాలని ఉంది అంటూ తన వాదనను వినిపించారు. ఇలాంటి సన్నివేశాలతో కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించిన ప్రోమో మరింత ఆసక్తిని రేపింది.

ఫిల్మీబీట్‌ తెలుగుకు అందిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం.. అరియానా ఈ వారం కెప్టెన్సీగా ఎంపికైనట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X