twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ సెలబ్రిటీలకు పట్టదా? అమర సైనికుల శ్రద్ధాంజలి కార్యక్రమానికి డుమ్మా!

    |

    జమ్ము, కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఘటనతో దేశవ్యాప్తంగా ప్రజలు విషాదంలోకి కూరుకుపోయారు. ఆత్మాహుతి దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు తమదైన రితీలో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇదే క్రమంలో ఆదివారం అమర వీరులకు నివాళులర్పించేందుకు బిగ్‌బాస్ తెలుగు సెలబ్రిటీలు ఓ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. అయితే ఎంతో భావోద్వేగంతో కూడిన కార్యక్రమాన్ని కవర్ చేయడానికి మీడియా పెద్ద ఎత్తునే చేరుకొన్నది. కానీ ఇద్దరు ముగ్గురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు తప్ప అందరూ ముఖం చాటేయడం మీడియా అసంతృప్తిని వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే..

     అమరులకు బిగ్‌బాసుల శ్రద్ధాంజలి

    అమరులకు బిగ్‌బాసుల శ్రద్ధాంజలి

    జూబ్లిహిల్స్‌లోని ఓ భవనంలో అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. బిగ్‌బాస్ 1, 2 సభ్యులు పాల్గొంటారు. మీడియా కవరేజ్ రావాలని సందేశాన్ని పంపారు. అయితే తీరా అక్కడికి వెళ్లి చూస్తే ముగ్గురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. వారి మధ్య విభేదాలు, ఆధిపత్య ధోరణి కారణం వల్లే ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారని మాట వినిపించింది.

    ముగ్గురు మాత్రమే హాజరు కావడం

    ముగ్గురు మాత్రమే హాజరు కావడం

    ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన అమరుల శ్రద్ధాంజలి కార్యక్రమంలో మహేష్ కత్తి, సంజన, నందిని మాత్రమే హాజరయ్యారు. పుల్వామాలో దాడిలో మరణించిన అమరులు ఫొటోలకు కొవ్వొత్తులు వెలిగించి, పూలతో శ్రద్దాంజలి ఘటించారు. అమరుల కుటుంబాలకు నైతికంగా మద్దతు నిలుస్తామని మీడియాతో తమ భావోద్వేగాన్ని పంచుకొన్నారు.

    సెలబ్రిటీలపై మీడియా అసంతృప్తి

    సెలబ్రిటీలపై మీడియా అసంతృప్తి

    సెలబ్రిటీల మాట్లాడిన అనంతరం మీడియా ప్రతినిధులు కూడా అమర వీరులకు శ్రద్దాంజలి ఘటించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు వస్తారని ఆశించడంతో వారు రాకపోవడంతో అసంతృప్తితో మీడియా వెనుతిరిగింది.

    గతంలో వీకెండ్ పార్టీలకు హౌస్‌పుల్

    గతంలో వీకెండ్ పార్టీలకు హౌస్‌పుల్

    గతంలో వీకెండ్ పార్టీలు నిర్వహిస్తే దాదాపు రెండు సీజన్లకు సంబంధించిన సెలబ్రిటీలు హాజరయ్యారట. తెల్లవారు జాము వరకు పార్టీలో మునిగి తేలారట. అలాంటి సెలబ్రిటీలు అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమానికి హాజరుకాకపోవడం సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. వచ్చేది, రానిది చెబితే ఇలాంటి కార్యక్రమాలను నీరుకార్చకుండా జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉండేదనే వాదన స్పష్టంగా వినిపించింది.

    English summary
    Bigg Boss Telugu celebraties organised tribute to Pulwama terror victims. But Most of the celebraties are not turned out to the program. Only Mahesh Kathi, Sanjana, Nandini were attended there. This thing becomes debate in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X