twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గంగవ్వ, సుజాత, ఇతరులకు రెమ్యునరేషన్స్ అందలేదా? బిగ్‌బాస్ రూల్స్‌ ఎలా ఉన్నాయంటే!

    |

    బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొనే సెలబ్రిటీలకు భారీగా పారితోషికం చెల్లిస్తారనే విషయం కొత్తేమీ కాదు. అయితే ఎవరెవరికి ఎంత చెల్లిస్తారనే విషయంపై నిర్వాహకులు చాలా సీక్రెట్‌గా వ్యవహరిస్తారనే విషయం అందరికి తెలిసిందే. బిగ్‌బాస్ అంటే సీక్రెట్.. సీక్రెట్ అంటే బిగ్‌బాస్ అనే విధంగా రూల్స్ పెట్టినప్పటికీ.. ఎక్కడి నుంచో సమాచారం లీక్‌ అవుతూనే ఉంది. ఇంతకు సెలబ్రిటీలకు బిగ్‌బాస్ చెల్లించే విధానం ఇలా ఉంటుందనే విషయం కొందరు సెలబ్రిటీలు ఇలా పంచుకొన్నారు.. ఆ వివరాల్లోకి వెళితే..

    సెలబ్రిటీలతో పక్కాగా కాంట్రాక్టులు

    సెలబ్రిటీలతో పక్కాగా కాంట్రాక్టులు

    ఇక సెలబ్రిటీలతో కాంట్రాక్టులు కుదుర్చుకోవడంలో నిర్వాహకులు పక్కాగా ఉంటారు. ముందే నిబంధనలు, నియమాలను పక్కాగా చెప్పి వాటికి అనుగుణంగా వారితో అగ్రిమెంట్లు రాయించుకొంటారనే విషయం పలువురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు చెప్పడం తెలిసిందే. అయితే సెలబ్రిటీల హోదాను బట్టి, వారికి ఉండే క్రేజ్‌ను బట్టి బిగ్‌బాస్‌ నిర్వాహకులు వారి పారితోషికాన్ని నిర్ణయిస్తారు.

    టాప్ సెలబ్రిటీలకు రోజువారి చొప్పున రెమ్యునరేషన్

    టాప్ సెలబ్రిటీలకు రోజువారి చొప్పున రెమ్యునరేషన్

    సెలబ్రిటీల పారితోషికం విషయానికి వస్తే.. టాప్ గ్రేడ్ సెలబ్రిటీలకు రోజువారి చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తారు. అంతేకాకుండా వారికి కొన్ని వారాలపాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండేలా గ్యారెంటీ ఇస్తారు. ఎందుకంటే టాప్ సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాగు ఉంటుంది. కాబట్టి వారి ఎలిమినేషన్‌కు ఎలాంటి ముప్పు ఉండదనే భరోసాతో అలాంటి ఒప్పందాలు జరుగుతాయని చెప్పుకొంటారు. ఆ కారణంగానే ప్రస్తుతం మోనాల్ గజ్జర్ కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    మిడిల్ రేంజ్ సెలబ్రిటీలకు వారం రోజుల చొప్పున

    మిడిల్ రేంజ్ సెలబ్రిటీలకు వారం రోజుల చొప్పున

    ఇక మిడిల్ రేంజ్, వర్థమాన తారలకు వారానికి చొప్పున రెమ్యునరేషన్ నిర్ణయిస్తారు. తాజా ఇంటర్వూలో వెల్లడైన ప్రకారం సుజాత, అరియానా, దేవీ నాగవల్లి లాంటి వాళ్లకు వారం ప్రాతిపాదికన రెమ్యునరేషన్ చెల్లించినట్టు స్పష్టమైంది. ఇక కొత్తగా వచ్చే వారికి, వర్థమాన తారలకు పారితోషికం లేకుండా బిగ్‌బాస్‌లో అవకాశం కల్పిస్తారనే విషయం ప్రచారంలో ఉంది. బిగ్‌బాస్ తెలుగు 2లో గణేష్ అలా వచ్చినట్టు వార్తలు బయటకు వచ్చాయి.

    ఎలిమినేషన్ తర్వాత 15 రోజులకు

    ఎలిమినేషన్ తర్వాత 15 రోజులకు

    బిగ్‌బాస్ నుంచి ఎలిమినేషన్ తర్వాతే సెలబ్రిటీలకు పారితోషికం చెల్లిస్తారట. షో కొనసాగుతున్న సమయంలో ఎలాంటి చెల్లింపులు ఉండవనేది బిగ్‌బాస్ రూల్. ఎలిమినేషన్ తర్వాత కనీసం రెండు వారాల తర్వాత సెలెబ్రిటీలకు పారితోషికం అందించే విధానం బిగ్‌బాస్‌లో కొనసాగుతున్నది. ఇంటి నుంచి వెళ్లిన తర్వాత వారికి రెండు వారాల గడువు విధించి చెక్కుల రూపంలో అందజేస్తారనేది సమాచారం.

    దసరా పండుగ సెలవుల కారణంగా జాప్యం

    దసరా పండుగ సెలవుల కారణంగా జాప్యం

    బిగ్‌బాస్ నిబంధనలకు అనుగుణంగానే గంగవ్వ, సుజాత, కుమార్ సాయికి రెమ్యునరేషన్లు అందడంలో కాస్తా ఆలస్యం అయిందనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది. 15 రోజుల గడువులో దసరా పండుగ సెలవులు రావడంతో వారికి అందాల్సిన పారితోషికం అందలేదనే విషయం స్పష్టమైంది. అయితే గంగవ్వకు వచ్చే రెమ్యునరేషన్‌కు అదనంగా కొంత మొతాన్ని అందించి ఇళ్ల కట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

    English summary
    Bigg Boss Telugu celebrities Remuneration and Rules of Payments by organisers. There are certain rules for the payment. Organisers pays remunerations for Eliminated contestants after 15 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X