Bigg Boss Telugu 7 అర్జున్‌కు అన్యాయం.. అమర్‌కు ఫేవర్.. శోభ, ప్రియాంక జిమ్మిక్కు.. బిగ్‌బాస్‌పై కంటెస్టెంట్

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ముగింపు దశకు చేరుకొంటున్నది. ఈ రియాలిటీ షో అత్యంత వివాదాలు, గందరగోళాల మధ్య ముగించే ప్రయత్నం చేస్తున్నది. అయితే ఈ సీజన్‌లో సీరియల్ గ్యాంగ్ చేస్తున్న వ్యవహారాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఫినాలే టికెట్ టాస్క్‌లో అమర్ దీప్‌కు లాభం చేకూరేలా శోభశెట్టి, ప్రియాంక జైన్ ఇద్దరు చేసిన స్వార్ధపూరితమైన పనిపై బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు సమీర్ మండిపడ్డారు. ఆయన ట్విట్టర్‌లో వీడియో చేసి బిగ్‌బాస్‌ను కూడా ఏకిపారేస్తూ..

నేను ఫస్ట్ బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్‌ను. అప్పటి నుంచి నేను ప్రతీ సీజన్ చూస్తుంటాను. నాకు అన్నీ సీజన్లు ఇష్టమే. ప్రస్తుతం అనంతపురంలో అర్ధరాత్రి వరకు షూటింగ్ చేస్తున్నాను. నైట్ షూట్‌లో కాస్త సమయం చిక్కగానే బిగ్‌బాస్ తెలుగు 7 లైవ్ చూశాను. అందుకే ఈ లైవ్ వీడియో చేశాను అని యాక్టర్ సమీర్ తన వీడియోలో చెప్పారు.

Bigg Boss Telugu Contestant actor Sameer finds fault of Shobha Shetty, Priyanka Jain over favor to Amardeep

బిగ్‌బాస్ లైవ్ చూస్తుంటే.. ఒక విషయం గమనించాను. అందుకే నేను ఆ విషయాన్ని షేర్ చేయాలని అనుకొన్నాను. టికెట్ టూ ఫినాలే టాస్క్‌కు సంబంధించి లైవ్ జరుగుతున్నది. ఆ లైవ్ చూస్తుంటే.. సీరియల్ గ్యాంగ్ అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టికి సంబంధించిన ఓ సీన్ నన్ను డిస్ట్రబ్ చేసింది అని సమీర్ చెప్పారు.

ఫినాలే కోసం జరిగే టాస్క్‌లో క్రికెట్ స్టంప్స్ పెట్టి రింగ్స్ వేసే టాస్క్ పెట్టారు. ఈ టాస్క్‌లో శోభా శెట్టి, ప్రియాంక జైన్ సంచాలకులుగా ఉన్నారు. వారిద్దరూ కూడా అమర్‌దీప్ ఫేవర్ చేస్తారని అందరికి తెలుసు. అయితే ఈ టాస్క్‌లో అంబటి అర్జున్‌కు వారు అన్యాయం చేసి అమర్‌కు ఫేవర్ చేశారు అని సమీర్ చెప్పారు.

Bigg Boss Telugu Contestant actor Sameer finds fault of Shobha Shetty, Priyanka Jain over favor to Amardeep

టాస్క్‌లో అర్జున్‌కు అన్యాయం జరిగిందనే విషయం తెలిసిన తర్వాత నేను ఈ వీడియోను చేసి అందరి దృష్టికి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. నేను అర్ధరాత్రి చూసిన వీడియో గురువారం 9.30 గంటలకు ప్రసారం అవుతుంది. మీకు కూడా ఆ అన్యాయం ఏమిటో అర్ధం అవుతుంది అని సమీర్ తన వీడియోలో వెల్లడించారు.

ఫినాలే టాస్కులో క్రికెట్ ఆడే సమయంలో బజర్ మోగిన తర్వాత అమర్‌దీప్ ఓ రింగ్ వేశాడు. వాస్తవానికి బజర్ మోగిన తర్వాత రింగ్ వేయడం ఆపాలి. అలా కాకుండా అతడు వేశాడు. ఆ విషయాన్ని శోభ, ప్రియాంక చూసి ,చూడనట్టు వదిలేశారు. దానిని బిగ్‌బాస్ కూడా ఓవర్ లుక్ చేయడం నాకు బాధ కలిగింది అని సమీర్ చెప్పారు.

Bigg Boss Telugu Contestant actor Sameer finds fault of Shobha Shetty, Priyanka Jain over favor to Amardeep

అయితే ఈ అన్యాయం అంబటి అర్జున్‌కు ఎలా జరిగిందంటే.. బజర్ మోగే సమయానికి అర్జున్ 107 రింగులు వేశాడు. రింగ్ మోగిన తర్వాత అమర్ దీప్‌ ఓ రింగ్ వేయగా.. అతడికి 108 రన్స్ లభించాయి. దాంతో అమర్ దీప్ 1 ప్లేస్‌కు వచ్చాడు. అర్జున్ 2వ స్థానానికి వెళ్లాడు. దాంతో ఆయనకు 10 పాయింట్లు తక్కువగా వచ్చాయి. ఈ విషయం అందరి దృష్టికి, బిగ్‌బాస్ దృష్టికి తీసుకు వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాను అని సమీర్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X