Bigg Boss Telugu : చిచ్చుబుడ్డి దెబ్బకు పరుగులు తీసిన బిగ్‌బాస్ బ్యూటీ .. నవ్వు ఆపుకోవడం కష్టమే
దివ్వెల పండుగ దీపావళిని భారతీయులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సామాన్యులతో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా దివాళీ జోష్‌లో మునిగిపోయారు. ప్రముఖులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ అషు రెడ్డి దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియా రాకతో ఎంతో మంది ప్రతిభావంతుల టాలెంట్ బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ క్రమంలోనే అషు రెడ్డి కూడా సోషల్ మీడియా స్టార్ అయ్యారు. చూడడానికి అచ్చుగుద్దినట్లు స్టార్ హీరోయిన్ సమంతలా కనిపించే అషు రెడ్డి డబ్‌స్మాష్ వీడియోలతో యువతలో క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఆమెను అంతా జూనియర్ సమంత అని పిలుచుకుంటున్నారు. ఈ ఫేమ్‌తో చాలా కాలం పాటు బుల్లితెరపై పలు రకాల షోలతో పాటు కొన్ని సినిమాల్లోనూ నటించింది.

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో దుమ్మురేపిన అషు రెడ్డి.. రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి సెన్సేషన్‌గా మారిపోయింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లోనూ అవకాశం దక్కించుకుంది. తన హాట్ డ్యాన్స్‌లతో బిగ్‌బాస్ హౌస్‌కి గ్లామర్ డోస్ అందించిన అషు రెడ్డి ఐదు వారాల పాటు కొనసాగి ఎలిమినేట్ అయ్యింది. తర్వాత బిగ్‌బాస్ ఓటీటీలోనూ అషురెడ్డి ఛాన్స్ దక్కించుకుని పది వారాల పాటు హౌస్‌లో నిలిచింది.
తన అంద చందాలు, చలాకీతనంతో అషు రెడ్డి సినీ ప్రముఖుల దృష్టిలోనూ పడ్డారు. తొలుత 'ఛల్ మోహనరంగ' అనే సినిమాతో నటిగా టాలీవుడ్‌లో ఎంటరైంది. కానీ, తర్వాత ఎందుకో గ్యాప్ తీసుకుంది. ఇటీవలే అషు రెడ్డి 'ఏవమ్' సహా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. మహిళా సాధికారిత, హక్కులు చుట్టూ తిరిగే ఈ సినిమాలో అషు అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బోల్డు బ్యూటీ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్నారు. ఈ మధ్య డోస్ పెంచేసి ప్రైవేట్ భాగాలు చూపిస్తూ కాక రేపుతోంది. మొన్నామధ్య లోపల ఏమీ వేసుకోకుండా క్లీవేజ్ షో చేసి కుర్రకారును రెచ్చగొట్టింది అషు రెడ్డి. ఎవరు ఏమనుకున్నా సరే, ఎలాంటి అంశంపై అయినా కుండ బద్ధలు కొట్టినట్లుగా మాట్లాడతారు అషురెడ్డి. గ్లామర్‌తో పాటు ఆమెలోని దూకుడును కూడా చాలా మంది ఇష్టపడతారు.
ఇక రీసెంట్‌గా దీపావళి వేడుకల్లో పాల్గొన్న అషు రెడ్డి చిచ్చుబుడ్డి వెలిగించడానికి అపసోపాలు పడ్డారు. పెద్ద కాకరువత్తితో దానిని భయపడుతూ వెలిగించిన అషు.. నిప్పు రవ్వలు పైగా లేవగానే పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఓరేజ్ ఆజామ్ లగెత్తరో అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.


Click it and Unblock the Notifications











