బిగ్‌బాస్.. నాగార్జునను ఎలిమినేట్ చేయండి.. బిగ్గర్ బాస్ బాబు గోగినేని సంచలన పోస్ట్!

అక్రమ కట్టడం ఆరోపణల నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ప్రముఖ నటుడు నాగార్జున అక్కినేని సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్, విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ కేసు కోర్టు పర్యవేక్షణలో ఉన్న కారణంగా సినీ పరిశ్రమ పెద్దలు మౌనంగా ఉంటున్నారు. అయితే నాగార్జునకు సినీ పరిశ్రమ నుంచి మద్దతుగా ముందుకొచ్చి ఎవరూ మాట్లాడకపోవడం చర్చనీయాంశమవుతున్నది. ఈ క్రమంలో సామాజిక కార్యకర్త, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

సినిమాల్లోనే కాకుండా బుల్లితెర మీద కూడా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని విశేషంగా రాణిస్తున్నారు. బిగ్‌బాస్ నుంచి మీలో ఎవరు కోటిశ్వరుడు వరకు ఆయన హోస్ట్‌గా అద్బుతంగా మెప్పించారు. గత 8 సీజన్లలో రెండు సీజన్లు మినహాయించి అన్ని సీజన్లకు ఆయనే హోస్ట్‌గా వ్యవహరించారు. ఎన్టీఆర్ తొలి సీజన్, ఆ తర్వాత నాని మరో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు.

Bigg Boss Telugu Contestant Babu Gogineni demands Eliminate Nagarjuna Akkineni from hosting of Bigg Boss Telugu 8

అయితే అత్యంత ప్రేక్షకాదరణ, రేటింగ్ ఉన్న బిగ్‌బాస్ షోలో సామాజిక కార్యకర్త, పలు రంగాల్లో టాలెంటెడ్ పర్సనాలిటీ బాబు గోగినేని కూడా ఓ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నారు. అయితే తాను టైటిల్ గెలుచుకోలేకపోయినా.. ఆ షో ద్వారా తన ఉనికిని మరింత పటిష్టం చేసుకోవడమే కాకుండా కమల్ హాసన్ లాంటి ప్రముఖుల ప్రశంసలు పొందారు.

అయితే బాబు గోగినేని ఎలాంటి బెదురు భయం లేకుండా ముక్కుసూటిగా వ్యవహరిస్తారని ఆయనకు పేరుంది. అయితే తాజాగా బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో ఆయన చేసిన తీవ్రపదజాలంతో పోస్టు వైరల్ అవుతున్నది.

బాబు గోగినేని పేరిట ఉన్న ఓ అకౌంట్ నుంచి పెట్టిన పోస్టులో నాగార్జునను హోస్ట్‌గా ఎలిమినేట్ చేయాలని కోరారు. ఆ పోస్టులో ఉన్న ప్రకారం.. ఎలిమినేట్ హిమ్. బిగ్ బాస్. అక్రమ కట్టడాల దారుణమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న తమ షో హోస్ట్ ను తెలుగు షో నిర్వహకులు తక్షణమే మార్చాలి. లేదూ హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి. ఇట్లు
బిగ్గర్ బాస్ బాబు గోగినేని అని రాశారు.

అయితే బిగ్‌బాస్ తెలుగు 8 ప్రారంభానికి కొన్ని రోజుల ముందు బాబు గోగినేని అకౌంట్ ద్వారా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. నిజానికి ఆయన అధికారిక అకౌంటేనా? లేదా ఎవరైనా అకౌంట్ సృష్టించి పోస్టు చేశారా? అనేది చర్చనీయాంశమైంది. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఆయన ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారనే విషయం చర్చనీయాంశమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X