Gangavva బుర్జ్ ఖలీఫాపై గంగవ్వ..హ్యాట్సాఫ్ అవ్వ అంటూ నెటిజన్ల కామెంట్లు.. ఫోటోలు వైరల్!

సోషల్ మీడియా ప్రభావంతో సాధారణ ప్రజలకు కూడా సెలబ్రీటీలుగా మారుతున్నారు. ప్రతిభ ఉంటే చాలూ ప్రజలు వారిపై భారీగా ఆదరణ కురిపించడమే కాకుండా విశేషంగా ఫాలో కూడా అవుతున్నారు. యూట్యూబ్, ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ సహాయంతో ఎందరో కంటెంట్ క్రియేటర్లు సెలబ్రీటీలుగా మారారు. అలా సెలబ్రీటీగా మారిన వారిలో గంగవ్వను ప్రముఖంగా పేర్కొనవచ్చు. అయితే సాధారణ గ్రామీణ గృహిణి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గంగమ్మ గురించి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ యాస, వేషధారణతో కరీంనగర్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉండే గంగవ్వ సోషల్ మీడియా ద్వారా విశేషంగా పేరు సంపాదించుకొన్నది. ఆమె, తన కుటుంబ సభ్యులు నిర్వహించే మై విలేజ్ షో యూట్యూబ్ ద్వారా ఆమె అందరికీ చేరువైంది. దాంతో గంగవ్వ పేరు మీడియాలో మార్మోగింది.

Bigg Boss Telugu Contestant Gangavvas Dubai photos goes viral

ఇక మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ ద్వారా సినీ తారల ఇంటర్వ్యూలు చేస్తూ తనదైన శైలిలో మరింత గుర్తింపు తెచ్చుకొన్నారు. గ్రామీణ గృహిణిగా 60 ఏళ్ల వయసులో అమాయకంగా, భోళాతనంతో కల్మషం లేని మాటలతో అందర్నీ ఆకట్టుకొన్నది. మహేష్ బాబు, ఇతర హీరోలతో తనదైన శైలిలో మాట్లాడుతూ.. సెలబ్రిటీగా మారింది.

ఇలా లేటు వయసులో సెలబ్రిటీగా మారిన గంగవ్వకు బిగ్‌బాస్ రియాలిటీ షో రూపంలో మరో అవకాశం లభించింది. సుమారు 60 ఏళ్ల వయసులో బిగ్‌బాస్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. బిగ్‌బాస్‌లో కూడా ఆమె తనకంటే ప్రేక్షకాదరణను, గుర్తింపును తెచ్చుకొన్నారు. అలా సెలబ్రిటీగా మారిన గంగవ్వ ప్రస్తుతం దుబాయ్‌లో పర్యటిస్తున్నారు.

Bigg Boss Telugu Contestant Gangavvas Dubai photos goes viral

దుబాయ్ పర్యటనలో తన కుటుంబ సభ్యులు, టీమ్ మెంబర్స్‌తో గంగవ్వ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. బూర్జ్ ఖలీఫా వద్ద సందడి చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనంపై చేయివేసినట్టు ఫోటో దిగి తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా అనూహ్యమైన స్పందన లభించింది. ప్రస్తుతం గంగవ్వ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక గంగవ్వ ఫోటోలపై నెటిజన్లు భారీగా కామెంట్స్ పెడుతున్నారు. ఎక్కడి గంగవ్వ..ఎక్కడ లంబాడి పల్లి.. ఎక్కడ దుబాయ్ అంటూ కామెంట్ చేశారు. శ్రీకాంత్ అన్న మీ అందరి జీవితాలను మార్చాడు. మీ అందరిని చూస్తే గర్వంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హ్యాట్యాఫ్ గంగవ్వ.. మనిషి తలుచుకొంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించావు గంగవ్వ. మీరు మాకు ఎంతో స్పూర్తి అని కామెంట్ చేశారు. ఎక్కడికి వెళ్లినా మన సంస్కృతి, సంప్రదాయలు మరవడం లేదు. తల్లీ నీకు దండాలు అంటూ కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X