కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్‌బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్

బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ తెలుగు అమ్మాయి తన చిన్నప్పుడు స్కూల్లో జరిగిన రచ్చ గురించి తాజాగా బయట పెట్టింది. లవ్ విషయంలో జరిగిన గొడవ వల్ల పేరెంట్స్, టీచర్స్ ఎలా చీవాట్లు పెట్టారో చెప్పుకొచ్చింది. మరి ఇంతకీ స్కూల్ డేస్ లో హిమజ ఏం చేసింది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

భార్యామణి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సీరియల్స్ లో మెయిన్ లీడ్ గా నటించి ఫుల్ గా పాపులర్ అయిన హిమజ ఆ తర్వాత పలు సినిమాలతో పాటు బిగ్ బాస్ లో కూడా మెరిసింది. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ విజయవాడ అమ్మాయి హీరోయిన్ గా కూడా నటించింది.

Bigg Boss Telugu Contestant Himaja Reveals her Intresting love story in school days

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన స్కూల్ డేస్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. ఒకానొక సందర్భంలో హిమజ ఫేస్ బుక్ లో కట్టె పుల్లకు చీర కట్టినా సరే హాయ్, బాయ్ అని చెప్తారని కామెంట్స్ చేసింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆమె కామెంట్స్ ను రిపీట్ చేస్తూ మీకు ఇంత వరకు ఎంత మంది ప్రపోజ్ చేశారు? అని ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు హిమజ స్పందిస్తూ తను చేసిన ఆ కామెంట్ కి కొంత మంది మగవాళ్ళు మేము అసలు మీకు ఎలా కనిపిస్తున్నాం అని కామెంట్ చేశారని, తానేదో క్యాజువల్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను ఉద్దేశించి చెప్పానని, దానికే ఇలా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా రియాక్ట్ అయ్యారని గుర్తు చేసుకుంది హిమజ.

సోషల్ వెబ్సైట్లలో దాదాపుగా 80% ఫేక్ ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయనేది తన ఉద్దేశమని చెప్తూనే తనకు ప్రపోజ్ చెయ్యాలంటే భయపడతారని వెల్లడించింది. తన గురించి బాగా తప్ప ఇంకెవరూ మాట్లాడే ధైర్యం చేయరని ప్రపోజల్స్ ఎందుకు రాలేదో వెల్లడించింది. ఈ సందర్భంగా తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంది.

Bigg Boss Telugu Contestant Himaja Reveals her Intresting love story in school days

కాలేజ్ డేస్ లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డారు, ఆ తర్వాత వన్ సైడ్ లవ్ ను లైట్ తీసుకున్నారనే హిమజ స్టోరీ గురించి ఆ ఇంటర్వ్యూలో మరో ప్రశ్న ఎదురైంది. హిమజ స్పందిస్తూ అది కాలేజీలో కాదని స్కూల్లో జరిగిందని క్లారిటీ ఇచ్చింది. స్కూల్ పేరుని చెప్పలేదు గానీ తన స్కూల్లో చదువుకునే సమయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే వారని చెప్పుకొచ్చింది.

అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరితో ఒకరు మాట్లాడుకుడదు అనే రూల్ పెట్టడం వల్ల క్యూరియాసిటీ పెరిగిపోయి జస్ట్ అలా చూసుకునే వాళ్ళం మాత్రమేనని చెప్పుకొచ్చింది హిమజ. కానీ దాన్నే అపార్థం చేసుకుని పెద్ద ఇష్యూ చేశారని అన్నది హిమజ. అంతేగాని అక్కడ లవ్ లాంటిది ఏమీ జరగకపోయినా ఆ తర్వాత పేరెంట్స్ ని పిలిపించి టీచర్స్ చివాట్లు పెట్టారని గుర్తు చేసుకుంది. అయితే ఈ చిన్న విషయమే తనకు ఒక మంచి మెమొరీగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చిందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X