Bigg Boss Telugu : జర్రుంటే సచ్చిపోయేదానివి .. బిగ్‌బాస్ బ్యూటీని ఏకీపారేస్తోన్న నెటిజన్లు

రీల్స్, సెల్ఫీల మోజులో ఎంతో మంది విలువైన ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. నలుగురిలో తమ రీల్ ప్రత్యేకంగా ఉండాలనే పిచ్చితో సాహసాలు చేస్తున్నారు. రైలుకు ఎదురెళ్లడం, జలపాతం నుంచి దూకేయడం, పులినోట్లో తల పెట్టడం, నిప్పుతో చెలగాటాలు ఆడటం వంటి పనులతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతున్నా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు మారడం లేదు. ఇంకొందరు ఏమరపాటుతో ప్రమాదాల బారినపడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ సిరి హనుమంతు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ వివరాల్లోకి వెళితే.

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల రాకతో సెలబ్రెటీలుగా మారిపోయిన వారిలో సిరి హనుమంత్ కూడా ఒకరు. ఆకట్టుకునే రూపం, క్యూట్ లుక్స్‌తో ఆమె సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను పొందింది. కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్ వీడియోలు, షార్ట్‌ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన సిరి హనుమంత్ టిక్‌టాక్‌తో మరింత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తనకొచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లోనూ అవకాశం పొందింది. అక్కడ మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి ఆడింది. పైకి స్నేహితులమని చెప్పుకుంటూనే అంతకుమించి అనేలా క్లోజ్‌గా ఉండటంతో ఇద్దరిపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. కారణం.. వీరిద్దరూ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టడానికి ముందే బయట ఆల్రెడీ మరొకరితో ప్రేమలో ఉండటమే .

bigg boss telugu contestant siri hanmanth escaped from fire accident during Diwali celebrations

ఆడియన్స్ భయపడినట్లుగానే హౌస్‌ను వీడిన తక్షణం షణ్ముఖ్‌కు అతడి లవర్ దీప్తి సునైన బ్రేకప్ చెప్పగా.. సిరి హనుమంత్ మాత్రం తన బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌తో రిలేషన్‌లో ఉంది. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధం ద్వారా ఒక్కటి కావాలని కలలు కంటున్నారు. పర్సనల్ లైఫ్‌లో దూసుకెళ్తున్న సిరి హనుమంత్.. కెరీర్‌లోనూ సక్సెస్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ వీడియోలతో బిజీగా ఉంటూనే హిందవీలో ఓ సినిమా చేసింది.

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్దస్త్‌ను వీడటంతో ఈ మెగా షోకు యాంకరింగ్ చేసే అవకాశం సిరికి దక్కింది. జబర్దస్త్ షోకి ఎవరు యాంకర్‌గా వచ్చినా కమెడియన్స్‌తో కలిసి కామెడీ పండించాలి. అలాగే వాళ్లు ఎలాంటి జోకులు , పంచ్‌లు విసిరినా భరించాలి. దీంతో సిరి హనుమంత్ అదే ఫార్ములా ఫాలో అవుతోంది. సిరిపై కమెడియన్లు సరదాగా పంచ్‌లు వేస్తుండటంతో పాటు అప్పుడప్పుడూ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ కూడా ఆమెపై విసురుతున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సిరి హనుమంత్ .. నిత్యం తన సినిమాలు, షోలు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా దీపావళి పర్వదినం సందర్భంగా ఆమె షేర్ చేసిన వీడియో వెన్నులో వణుకు తెప్పించింది. వైట్ కలర్ శారీలో మెరిసిపోతున్న సిరి .. ఆరు బయట అంతా టపాసులు కాలుస్తుండగా ఫోటో షూట్ నిర్వహించింది. సరిగ్గా ఈ సమయంలో ఆమె పక్క నుంచి ఓ పటాకు దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన సిరి హనుమంత్ రెప్పపాటులో పక్కకు తప్పుకుంది. లేనిపక్షంలో ఆమె చీరకు నిప్పు అంటుకుని పెద్ద ప్రమాదమే జరిగేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అసలు టపాసుల మధ్యలో ఫోటో షూట్లు అవసరమా, జర్రుంటే సచ్చిపోయేదానివి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X