Siri Hanmanth : బ్లాక్ డ్రెస్‌లో సిరి హనుమంత్ ఘాటు ఫోజులు .. అందాల కర్టెన్ ఎత్తేసిందిగా!
సమాచారం పంచుకోవడానికి, నలుగురితో టచ్‌లో ఉండటానికి అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమాలు ఎంతో మందిని స్టార్స్‌గా మార్చాయి. టాలెంట్ ఉండి దానిని బయటకు ఎలా చూపించాలో తెలియని ఎంతో మందికి సోషల్ మీడియా ఓ ఫ్లాట్‌ఫాంలా మారింది. ఓ చిన్న పోస్ట్, రీల్‌తో రాత్రికి రాత్రి స్టార్లు మారిన వారు ఎందరో ఉన్నారు. అలాగే ఈ మాధ్యమాల ద్వారా కోట్లకు పడగలెత్తిన వారు కూడా ఉన్నారు.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల రాకతో సెలబ్రెటీలుగా మారిపోయిన వారిలో సిరి హనుమంత్ కూడా ఒకరు. అందమైన రూపం, క్యూట్ లుక్స్‌తో ఆమె సోషల్ మీడియాలో సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్ వీడియోలు, షార్ట్‌ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన సిరి హనుమంత్ టిక్‌టాక్ రాకతో మరింత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తనకొచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లోనూ ఛాన్స్ కొట్టేసింది.

తన గ్లామర్‌తో బిగ్‌బాస్ హౌస్‌కి సొగసులు అద్దిన ఈ భామ.. అక్కడ మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యింది. పైకి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే అంతకుమించి అనేలా వీరి ప్రవర్తన ఉండటంతో ఇద్దరిపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. కారణం.. వీరిద్దరూ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టడానికి ముందే బయట మరొకరితో పీకల్లోతు ప్రేమలో ఉండటమే . షణ్ముఖ్ జస్వంత్ తన తోటి యూట్యూబర్ దీప్తి సునైనతో లవ్‌లో ఉండగా.. సిరికి శ్రీహాన్ అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు.
ఆడియన్స్ భయపడినట్లుగానే హౌస్‌ను వీడిన తక్షణం షణ్ముఖ్‌కు దీప్తి సునైన బ్రేకప్ చెప్పగా.. సిరి మాత్రం ఇప్పటికీ శ్రీహాన్‌తో రిలేషన్ కంటిన్యూ చేస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కాలని కలలు కంటున్నారు. పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేని సిరి హనుమంత్.. కెరీర్‌లో మాత్రం సత్తా చాటాలని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ వీడియోలతో బిజీగా ఉంటూనే హిందీ ఓ సినిమా చేసింది.
సినిమాల్లో వరుస ఆఫర్లు రావడంతో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్దస్త్‌ను వీడారు. దీంతో ఆమె స్థానంలో ఈ మెగా షోకు యాంకరింగ్ చేసే అవకాశం సిరికి దక్కింది. అక్కడి వాతావరణానికి త్వరగానే అలవాటు పడిన సిరి .. తన స్టైల్‌లో పంచ్‌లు విసురుతుున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సిరి హనుమంత్ .. నిత్యం తన సినిమాలు, షోలు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ స్లిట్ డ్రెస్ ధరించిన ఆమె తన థిక్ థైస్ చూపిస్తూ , మత్తెక్కించే లుక్స్‌తో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ ఈ అందాలపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











