Sonia Akula Net Worth: బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

బిగ్‌బాస్ ‌తెలుగు 8లో రీసెంట్‌గా లాంచ్ అయి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఏడుగురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు హౌస్‌లోకి ఎంటరయ్యారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వీరంతా మూడు నెలల పాటు ఎలా ఉంటారన్నదే బిగ్‌బాస్. ఇంటి సభ్యుల్లో అప్పుడే కొందరు బలమైన కంటెస్టెంట్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో సోనియా ఆకుల కూడా ఒకరు. అన్ని విషయాల్లోనూ ఇంటర్‌ఫియర్ అవుతూ గేమ్‌పై ఓ క్లారిటీతో ముందుకెళ్తున్నారు సోనియా. ఈ నేపథ్యంలో సోనియా ఎవరు, ఆమె రెమ్యునరేషన్, ఆస్తిపాస్తుల వివరాలు ఒకసారి పరిశీలిస్తే :

బిగ్‌బాస్ తెలుగు 8లో మొదలైన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది సోనియా ఆకుల. అప్పుడే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంట్లో రూల్స్, తప్పు చేస్తే కడిగిపారేయడం తన స్టైల్ అంటూ అప్పుడే సంకేతాలిచ్చారు. తనతో జాగ్రత్తగా ఉండాలని, తాను ఆడపులినని అంత ఈజీ కాదని సోనియా చెప్పేసింది. ఈవిడతో పెట్టుకుంటే గెలవలేమని అప్పుడే కంటెస్టెంట్స్‌కి అర్ధమైపోయింది. బుల్లితెర సెలబ్రెటీలు నిఖిల్, యాష్మీ గౌడ, ప్రేరణలతో సోనియా ఢీ అంటే ఢీ అంటోంది.

BIGG BOSS TELUGU 8 contestant actress sonia akula movies remuneration family networth assets and personal details

బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లో ఫస్ట్ నామినేషన్ చేసే అవకాశం సోనియా ఆకులకు ఇచ్చాడు బిగ్‌బాస్. ఈమే బేబక్క, ప్రేరణను నామినేట్ చేసింది. అయితే నామినేషన్స్ సందర్భంగా ప్రేరణతో సోనియా పెట్టుకున్న గొడవ హైలెట్‌గా నిలిచింది. ప్రేరణ ఏం చెప్పినా దానిని పాయింట్ ఔట్ చేస్తూ నిలదీసింది. నోరు మూయమంటే .. నువ్వే మూసేయ్ అంటూ ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. నిఖిల్, యాష్మీ కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

ఇలా తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న సోనియాకు ఆన్‌లైన్‌లో నెటిజన్లు మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే టాప్ -5లో ఆమె ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సోనియా బీటెక్ గ్రాడ్యుయేట్. ఈమెకు ఇద్దరు సోదరులు. జార్జ్ రెడ్డితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసిన కరోనా వైరస్‌లో కనిపించింది. బిగ్‌బాస్ లాంచింగ్ డే నాడు స్వయంగా ఆర్జీవీ ఆమెను విష్ చేస్తూ టైటిల్ విన్నర్ కావాలని ఆకాంక్షించారు. ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో ఖుషి అయిన సోనియా నాగార్జున వద్ద బ్లెస్సింగ్స్ తీసుకుని ఆదిత్య ఓంతో కలిసి హౌస్‌లో అడుగుపెట్టారు.

BIGG BOSS TELUGU 8 contestant actress sonia akula movies remuneration family networth assets and personal details

ఇకపోతే బిగ్‌బాస్ తెలుగు 8లో పార్టిసిపేట్ చేసినందుకు గాను సోనియాకు వారానికి రూ.1.50 నుంచి రూ.2 లక్షల మధ్య రెమ్యునరేషన్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం, సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బుతో సోనియా చిన్న ఇల్లు కట్టుకున్నారు. మొత్తంగా ఆమె ఆస్తి రూ.కోటి లోపే ఉంటుందని అంటున్నారు. బిగ్‌బాస్‌లో తనేంటో ప్రూవ్ చేసుకుని గర్వంగా బయట అడుగుపెట్టాలని సోనియా ఆకుల భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X