For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హేమకు షాకిచ్చిన హౌస్‌మేట్స్.. బాబా భాస్కర్‌కు కలిసొచ్చిన లక్

    |

    'బిగ్ బాస్'.. ఉత్తారాది నుంచి దక్షిణాదిలో ఫేమస్ అయిన రియాలిటీ షో. ఈ షో ప్రభావం మామూలుగా లేదు. అది బయట అయినా.. హౌస్‌లో అయినా సరే. ఇప్పటికే తెలుగులో రెండు సీజన్లలో వివాదాలు.. విమర్శలు.. విద్వేషాలు ఇలా ఎన్నో రకాల షేడ్స్‌ను చూశాం. ఇలాంటివి నడుస్తున్నా.. ఈ షో కోసం ఎదురు చూసే వాళ్లు చాలా మందే ఉన్నారు. మరోవైపు.. షోకు ఎంపిక చేసే విషయంలో తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు.. వారికి ఓ దర్శకుడు మద్దతు.. వీళ్లందరికీ ఓయూ విద్యార్థులు బాసటగా నిలివడం వంటి సంఘటనలతో 'బిగ్ బాస్'ను నిషేదించాలన్న డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం మూడో సీజన్ మొదలైంది.

    ముగ్గురు మొదటి కంటెస్టెంట్‌లు ఎంపిక చేయడంతో 'బిగ్ బాస్' మొదటి రోజే ఆరుగురు సభ్యులు నామినేషన్ అయిన విషయం తెలిసింది. అయితే, మానిటర్ హేమను మెప్పించే విధంగా తమ గురించి తాము చెప్పుకుని, మరొకరిని తమ బదులు మరొకరిని నామినేట్ చేయొచ్చని బాస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ అవకాశం ఐదుగురికే ఉందని చెప్పాడు. ఇందులో భాగంగానే ఐదుగురు సభ్యులు మరో ఐదుగురిని నామినేట్ చేశారు.

    'బిగ్ బాస్' హౌస్‌లో వరుణ్ - వితిక రొమాన్స్.. కెమెరాకు కనిపిస్తున్నామంటూ...

    Bigg Boss Telugu contestants gave Shock To Hema

    మొదటిగా రాహుల్ తనకి బదులుగా నామినేట్ చేయడానికి శివజ్యోతిని ఎంపిక చేసుకున్నాడు. కానీ, అతడి కారణాలు నచ్చక హేమ.. రాహుల్‌నే నామినేట్ చేశారు. తర్వాత వరుణ్ సందేశ్.. పునర్నవిని ఎంపిక చేసుకున్నాడు. దీనికి హేమ కూడా అంగీకరించింది. అనంతరం వితిక.. అషు రెడ్డిని చేసినా లాభం లేకుండా పోయింది. తర్వాత శ్రీముఖి.. హిమజను చేసింది. దీనికి హేమ ఒప్పుకుంది. అలాగే, జాఫర్.. మహేశ్‌ను చేయగా హేమ ఒప్పుకోలేదు.

    ఇక, మిగిలిన బాబా భాస్కర్‌కు 'బిగ్ బాస్' ఒక అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం మానిటర్‌గా ఉన్న హేమతో ఆయనను రీప్లేస్ చేసుకోవచ్చని చెప్పాడు. దీంతో సభ్యులందరూ ఆలోచించుకుని హేను ఎలిమినేట్‌కు నామినేట్ చేసి, డ్యాన్స్ మాస్టర్‌ను సేవ్ చేశారు. దీంతో హేమ షాక్ అయింది. మొత్తానికి ఈ నామినేషన్ ప్రక్రియలో ముగ్గురు పాత వాళ్లు మిగిలి మరో ముగ్గురు కొత్తవాళ్లు తోడయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌కు రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలను నామినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ ఖరారు చేశారు.

    English summary
    Bigg Boss Telugu 3 has been launched on Sunday and the reality show is making noise right from day one. The six contestants, who got nominated for eviction on the first day, got a chance to save themselves and Hema is supervising the task.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X