గురి చూసి కొట్టిన దివి.. మోనాల్‌ను చిత్తు చేసిన హారిక.. ఆయనను బుట్టలో పడేసిన లాస్య

బిగ్ బాస్ ఇంటిలో ఆదివారం రోజు సరదాగా, సందడిగా సాగిపోయింది. సండే ఫన్‌ డే కావడంతో ఇంటి సభ్యులు అందంగా ముస్తాబయ్యారు. హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు ఉత్సాహాన్ని కలిగిస్తూ జోష్‌ను పెంచారు. ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడదీసి ఆటలు ఆడించారు. ఇంకా 41 రోజు ఇంటిలో ఏం జరిగిందంటే...

దివి వర్సెస్ అభిజిత్

దివి వర్సెస్ అభిజిత్

ఆటపాటల్లో భాగంగా తొలి ఆట‌గా డాట్స్‌ను దివి, అభిజిత్ ఆడారు. ఎదురుగా ఉన్న బెలూన్స్‌ను బాణంతో గురిచూసి కొట్టాలి. దివి మూడు బెలూన్లు పగలగొట్టగా, అభిజిత్ మూడు పగలగొట్టడంతో గేమ్ టై అయింది. దాంతో మరో ఛాన్స్ ఇవ్వడంతో దివి మరో బెలూన్ పగుల కొట్టడంతో దివి విజయం సాధించింది.

ఆర్మ్ రెజ్లింగ్‌లో హారిక సత్తా

ఆర్మ్ రెజ్లింగ్‌లో హారిక సత్తా

ఆ తర్వాత ఆర్మ్ రెజ్లింగ్ గేమ్‌ను హోస్ట్ ఆడించారు. హారిక, మోనాల్ గజ్జర్‌ను ప్రత్యర్థులుగా నియమించారు. ఈ గేమ్‌లో హారిక ఓ సారి గెలిస్తే.. శరీర బరువుతో గెలిచిందని చెప్పడంతో మరోసారి వారిద్దరికి పోటీ పెట్టారు. దాంతో రెండోసారి నిర్వహించిన పోటీలో హారిక గెలిచింది.

బుట్టలో పడేసిన లాస్య

బుట్టలో పడేసిన లాస్య

బిగ్‌బాస్‌లో మరో గేమ్‌ను అఖిల్, లాస్య మధ్య గేమ్ నిర్వహించారు. రెండు బుట్టల్లో ప్లాస్టిక్ బంతులను వాటిలోకి విసిరాలి. లాస్య, అఖిల్ దూరంగా నిలబడి బాల్స్‌ను విసిరారు. లాస్య 15 బంతులను విసరగా, అఖిల్ 12 బంతులను విసిరినట్టు సంచాలకుడు తెలిపారు. ఈ గేమ్‌లో లాస్య విజేతగా నిలిచింది. లాస్యను ఉద్దేశించి బుట్టలో వేయడం నీకు బాగా తెలుసనుకొంటాను అంటే.. అవును మా ఆయనను బుట్టలో పడేశాను కదా అంటూ లాస్య జవాబు ఇచ్చింది.

Recommended Video

Bigg Boss Telugu 4: Amma Rajashekar Daring Step
అఖిల్ టీమ్‌కు విజయం

అఖిల్ టీమ్‌కు విజయం

మరో గేమ్‌గా బంతి ఆటను నాగార్జున ఆటించారు. బంతిని చేతితో కొడుతూ కొంత దూరం వెళ్లి తిరిగా రావాలి. ట్రాక్‌లో బంతిని కొడుతూ వెళ్లి వచ్చే క్రమంలో అవినాష్ లైన్ క్రాస్ కావడంతో కుమార్ సాయిని విజేతగా నిలిచారు. దాంతో అందరూ చెప్పట్లు కొడుతూ అభినందించారు. ఆ తర్వాత టాగ్ ఆఫ్ వార్ గేమ్‌ను నిర్వహించగా.. అఖిల్ టీమ్ గెలిచింది. ఓవరాల్‌గా అఖిల్ టీమ్ చాంఫియన్ షిప్‌ సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X