Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అరియానాను ఇరుకున పెట్టి మోనాల్ గజ్జర్‌కు షాకిచ్చిన బిగ్‌బాస్.. మరో వైల్డ్ కార్డు ఎంట్రీ అవుట్
బిగ్‌బాస్ ఇంటిలో ఎలిమినేషన్ ప్రక్రియ రెగ్యులర్‌గా కాకుండా స్పెషల్‌గా సాగింది. ప్రతీ సారి జరిగే విధంగా కాకుండా ఈ సారి కుమార్ సాయి, మోనాల్ గజ్జర్‌ను ఇంటి సభ్యులను నుంచి దూరంగా చేసి కన్ఫెషన్ రూమ్‌లోకి రప్పించారు. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇంటి సభ్యులతో బిగ్‌బాస్ ఆడిన ఎలిమినేషన్ ప్రక్రియ ఏ విధంగా సాగింది. ఎలిమినేషన్ ప్రక్రియలో ఏం జరిగిందంటే..
Recommended Video
అరియానాను ఇరుకున పెట్టిన బిగ్‌బాస్
ఇంటి సభ్యులతో జోష్‌గా ఆటలను ఆడిస్తూ మధ్య మధ్యలో ఇంటి సభ్యులను ఎలిమినేషన్ సేవ్ చేశారు. ముందుగా అఖిల్, దివి వద్యా, అభిజిత్, అరియానాను సేఫ్ చేశారు. చివరి ముగ్గురిలో అరియానాను సేవ్ చేస్తూ చిన్న ట్విస్టు ఇచ్చారు. మిగిలిన మోనాల్, కుమార్ సాయిలో ఇద్దరిని ఎవరిని సేవ్ చేస్తావంటే.. గేమ్, టాస్కుల పరంగా కుమార్ సాయిని సేవ్ చేస్తానని చెప్పారు. అయితే మోనాల్, కుమార్‌ను ఇద్దరిని బ్యాగ్‌లు సర్దుకోమని.. వారిని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మన్నారు.
కన్ఫెషన్ రూమ్‌లోకి కుమార్ సాయి, మోనాల్ గజ్జర్
బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టుతో ఇంటి సభ్యులందరూ షాక్ తిన్నారు. మోనాల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మనగానే అఖిల్ షాక్ తిన్నాడు. మిగితా ఇంటి సభ్యులందరూ ఊహించని విధంగా నిర్ణయం రావడంతో ఇద్దరిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అలా ఇంటిలోని కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చిన మోనాల్, కుమార్ సాయిలో ఒకరు సేఫ్ అవుతారు. మరొకరు కన్ఫెషన్ రూమ్‌లో ఉంటారని చెప్పారు.
మోనాల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి.. కుమార్ సాయి అవుట్
ఇంటిలోకి వచ్చిన కుమార్ సాయి, మోనాల్ గజ్జర్‌కు బిగ్‌బాస్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. మోనాల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోనే ఉండాలని, కుమార్ సాయిని వేదికపైకి రమ్మని నాగ్ సూచించారు. ఆ తర్వాత కుమార్ సాయిని ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. దాంతో కుమార్ సాయి బిగ్‌బాస్ ప్రయాణం ముగిసింది.
కుమార్ సాయి బిగ్ బాస్ జర్నీ అలా..
ఎలిమినేట్ కావడంతో మోనాల్‌కు కంగ్రాట్స్ చెబుతూ కుమార్ సాయి వేదిక మీదకు రాగా ఆయనను నాగార్జున స్వాగతించారు. ఆ తర్వాత కుమార్ సాయి బిగ్‌బాస్ ప్రయాణానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించగా ఎన్నో ఎమోషన్స్, ఫన్ యాక్టివిటీస్ కనిపించాయి. ఆ తర్వాత ఇంటి సభ్యులతో కుమార్ సాయి ముచ్చటించారు. చిన్న గేమ్ కూడా ఆడారు. ఆ తర్వాత మోనాల్ ఇంట్లోకి ప్రవేశించడంతో ఇంటి సభ్యులందరూ హ్యాపీగా ఫీలయ్యారు. ముఖ్యంగా అఖిల్ ముఖంలో నవ్వు విరిసింది. ఆ తర్వాత కౌగిలింత ఇచ్చి హత్తుకొన్నాడు.
అమ్మా రాజశేఖర్‌పై బిగ్‌బాంబు
ఇక కుమార్ సాయి బిగ్‌బాంబు వేసే సమయం రాగానే.. ఇంటిలో బాత్రూంలు క్లీన్‌గా లేవని కంప్లయింట్ వస్తున్నదని నాగార్జున చెప్పారు. బిగ్‌బాంబ్ ప్రకారం.. ఒక వారం పాటు బాత్రూంలు కడగాలి అంటూ నాగార్జున రూల్ చెప్పారు. దాంతో బిగ్‌బాంబును అమ్మా రాజశేఖర్‌పై వేసి.. ఇంటికి పెద్దగా మీరు ఆ పని చేయండి అంటూ చెప్పారు. ఆ పనిని అమ్మా రాజశేఖర్ అంగీకరించారు.