Bigg Boss Elimination: మెహబూబ్ దిల్ సే అవుట్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ 4లో 10వ వారం ఎన్నో ఎమోషన్ల మధ్య ఎలిమినేషన్ జరిగింది. ఇంటి నుంచి ఎవరు వెళ్తారు అనే విషయంపై రకరకాల ఊహాగానాలు మీడియాలో కనిపించాయి. అయితే ఎక్కువ శాతం మంది ఊహించినట్టే ఇంటి నుంచి మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ తర్వాత మెహబూబ్‌కు సంబంధించిన ఫొటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మెహబూబ్ ఎలిమినేషన్ గురించి మరిన్ని వివరాలు

ఎలిమినేషన్‌లో హైడ్రామా
ఆదివారం ఎపిసోడ్‌ను నాగార్జున మరింత ఫన్‌గా మార్చారు. ఆటపాటల మధ్య ఇంటిలో ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించారు. శనివారం ఎపిసోడ్‌లో అభిజిత్‌ను సేవ్ చేసిన నాగార్జున.. ఆదివారం ఎపిసోడ్‌లో మిగితా వారిని సేవ్ చేసి ఆటను కొనసాగించారు. ఇక చివరికి మెహబూబ్, మరో కంటెస్టెంట్ మిగలడంతో ఎలిమినేషన్ ఆసక్తిగా మారింది. ఎవరు వెళ్తారనే విషయం ఇంటి సభ్యుల్లో కంగారు పెట్టింది.

తక్కువ ఓట్లు పడటంతో మెహబూబ్ అవుట్
ఇక పదోవారంలో ఇంటిలోని యాక్టివ్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సేను ఎలిమినేట్ చేస్తూ బిగ్‌బాస్ నిర్ణయం తీసుకొన్నారు. అత్యల్పంగా ఓటింగ్ రావడంతో మెహబూబ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం జరిగింది. అయితే మెహబూబ్ బయటకు వెళ్తుండగా ఇంటిలో గంభీరమైన వాతావరణం కనిపించినట్టు తెలిసింది.

సోహైల్ భోరున ఏడుస్తూ
ఇంటిలో అందరికంటే చిన్నవాడైన మెహబూబ్ అంటే అందరికీ ఇష్టమే. కొన్నిసార్లు చిన్నపిల్లాడిలా మాట్లాడి ఇబ్బంది పడినప్పటికీ.. లాస్య, మోనాల్, అరియానాకు మెహబూబ్ అంటే చెప్పలేనంత ఇష్టం. అయితే మెహబూబ్ ఎలిమినేట్ కావడంతో సోహైల్ తీవ్రంగా కంటతడి పెట్టినట్టు సమాచారం. శనివారం అఖిల్ విషయంలో భోరున విలపించిన సోహైల్ ఆదివారం ఎపిసోడ్‌లో కూడా మరింత ఎమోషనల్ అయ్యాడనేది తెలిసిందే.
Recommended Video

రాహుల్ సిప్లిగంజ్‌తో ఇంటర్వ్యూలో
ఇక ఎలిమినేషన్ తర్వాత స్టార్ మా నిర్వహించే బిగ్‌బాస్ బజ్‌లో మెహబూబ్ పాల్గొన్నాడు. రాహుల్ సిప్లిగంజ్ చేసే ఇంటర్వ్యూలో తన భావాలను పంచుకొన్నారు. రాహుల్ సిప్లిగంజ్‌తో జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించిన ఫోటో లీక్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ట్రెండ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











