సంపూ సేఫ్, బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయ్యాడు: ఎలిమినేట్ అయ్యేది వీరే!

బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ రౌండ్ మొదలైంది. సంపూ ఇంటి కెప్టన్ కావడంతో మినహాయింపు లభించింది.

By Bojja Kumar

తెలుగు బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. షో ప్రారంభమైన రెండో రోజే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. తొలి ఎపిసోడ్ చివర్లో... అంతా కలిసి సంపూను బయటకు పంపించేందుకు ప్లాన్ చేసినట్లు కనిపించింది. అయితే అలాంటిదేమీ లేదని, సంపూ సేఫ్ అని తేలిపోయింది. పైగా సంపూకు ఇంటి కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు బిగ్ బాస్.

14 మంది పోటీదారుల్లో ముందుగా సంపూను పిలిచిన బిగ్ బాస్.... ఇంటి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కెప్టెన్‌గా మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని, బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా ఇంటి నియమాలు సక్రమంగా పాటించేలా చూడాల్సిన బాధ్యత ఇంటి కెప్టెన్‌గా మీదే అని బాస్ తెలిపారు.

మరోసారి అలా జరుగడానికి వీల్లేదు

మరోసారి అలా జరుగడానికి వీల్లేదు

ఇంటి స్మోకింగ్ జోన్‌లోకి ఒకేసారి కేవలం ఒక్కరు మాత్రమే వెళ్లాలని బాస్ సంపూకు సూచించారు. ఈ రోజు చాలా మంది ఒకేసారి స్మోకింగ్ జోన్లోకి వెళ్లారని, ఇంకోసారి అలా జరుగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని తెలిపారు. మరో సారి అలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బిగ్ బాస్ హెచ్చరించారు.

Recommended Video

Bigg Boss Telugu : Sampoornesh Babu Have Elimination Threat From Big Boss Show
సంపూను నామినేషన్ నుండి తప్పించారు

సంపూను నామినేషన్ నుండి తప్పించారు

అనంతరం అందరినీ ఒకే చోటుకు పిలిచిన బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు పంపాల్సిన(ఎలిమినేషన్) ఇంటి సభ్యులు ఎవరు అనే విషయమై ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయినందు వల్ల ఈ ఎలిమినేషన్ ప్రక్రియ నుండి సంపూ సురక్షితులయ్యారని, ఇంటి సభ్యులెవ్వరూ సంపూ పేరు చెప్పకూడదని బిగ్ బాస్ తెలిపారు.

కల్పన

కల్పన

తొలుత కల్పన కన్ఫెషన్ రూమ్‌కు వచ్చి మధు ప్రియ, జ్యోతిలను ఎలిమినేట్ చేయాల్సిందిగా సూచించింది. మధుప్రియ ఏజ్ పరంగా, ఎక్స్‌పీరియన్స్ పరంగా చిన్న పాప కావడం వల్లనే ఆమె పేరు చెప్పానని, జ్యోతి యాటిట్యూడ్ నచ్చక పోవడం వల్ల ఆమె పేరు చెప్పినట్లు తెలిపారు.

ప్రిన్స్

ప్రిన్స్

ప్రిన్స్ మాట్లాడుతూ....తొలుత కల్పన పేరును నామినేట్ చేశాడు. ఆమె కాస్త ఓవర్ చేస్తోందని ప్రిన్స్ తెలిపారు. సెకండ్ నామినేషన్ గా జ్యోతి పేరు చెప్పాడు. జ్యోతి అనవసర విషయాల్లో తలదూరుస్తోందని ప్రిన్స్ అభిప్రాయ పడ్డారు.

అర్చన

అర్చన

నటి అర్చన... తొలుత హరితేజ పేరును నామినేట్ చేశారు, చిన్న విషయాలకే అప్ సెట్ అవుతోందని, రూడ్‌గా మాట్లాడుతోందని అన్నారు. సెకండ్ పేరుగా కార్తీక పేరు చెప్పింది. ఆమె అందరితో కలిసి ఉండలేక పోతోందని అర్చన తెలిపారు.

ఆదర్శ్ బాలకృష్ణ

ఆదర్శ్ బాలకృష్ణ

ఆదర్శ్ మాట్లాడుతూ... మహేష్ కత్తి, జ్యోతి పేర్లను నామినేట్ చేశాడు. మహేష్ కత్తి ఇంటి విషయాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం లేదన్నారు. జ్యోతి బిహేవియర్ కొంచెం ఫేక్ అనిపిస్తోందని తెలిపారు.

మధు ప్రియ

మధు ప్రియ

మధు ప్రియ మాట్లాడుతూ... మహేష్ కత్తి, జ్యోతి పేర్లను నామినేట్ చేసింది. వారి యాక్టివిటీస్ తనకు నచ్చలేదని మధు ప్రియ తెలిపారు.

శివ బాలాజీ

శివ బాలాజీ

శివ బాలాజీ మాట్లాడుతూ... జ్యోతి పేరు మొదట చెప్పారు. ఆమె అందరితో కంఫర్టబుల్ గా ఉండటం లేదన్నారు. హరితేజ ప్రవర్త కూడా అలానే ఉందని, ఆమెను ఎలిమినేషన్ కు నామినేట్ చేస్తున్నట్లు శివ బాలాజీ తెలిపారు.

కత్తి కార్తీక

కత్తి కార్తీక

కత్తి కార్తీక మాట్లాడుతూ... తొలుత హరితేజ పేరు చెప్పింది. ఆమె అందరినీ వెక్కిరిస్తుంటుందని, తన యాటిట్యూడ్ నచ్చలేదని కార్తీక తెలిపారు. రెండో పేరుగా ఆమె జ్యోతి పేరు చెప్పింది. ఆమె ప్రవర్తన యాక్ట్ చేస్తున్నట్లు ఉందని కార్తీక తెలిపారు.

సమీర్

సమీర్

సమీర్ మాట్లాడుతూ... తొలుత మహేష్ కత్తి పేరు చెప్పారు. ఆయన పెద్దాయన, అన్ని వర్క్స్ షేర్ చేసుకోలేక పోతున్నారు. అందరికీ ఆయనకు ఏమైనా వర్క్ చెప్పాలన్నా ఇబ్బందిగా ఉందన్నారు. సెకండ్ నేమ్ జ్యోతి పేరు చెప్పారు. ఆమె ప్రవర్త కూడా చాలా తేడా ఉందని సమీర్ తెలిపారు.

ముమైత్ ఖాన్

ముమైత్ ఖాన్

ముమైత్ ఖాన్ మాట్లాడుతూ... మొదట మహేష్ కత్తి పేరు చెప్పారు. సెకండ్ నేమ్ గా మధు ప్రియను ఎలిమినేషన్ కోసం నామినేట్ చేశారు.

ధనరాజ్

ధనరాజ్

ధనరాజ్ మాట్లాడుతూ... మొదట కత్తి మహేష్ పేరు చెప్పారు. ఆయన సరిగా పనులు చేయడం లేదన్నారు. తర్వాత కార్తీక పేరు సూచించారు.ఆమె ఎవరితోనూ పనులు షేర్ చేసుకోడం లేదని ధనరాజ్ తెలిపారు.

జ్యోతి

జ్యోతి

జ్యోతి మాట్లాడుతూ.... తొలుత మదు ప్రియ పేరు చెప్పింది. మధు ప్రియతో పాటు కార్తీకను కూడా ఎలిమినేట్ చేయాల్సిందిగా జ్యోతి సూచించింది.

మహేష్ కత్తి, హరితేజ, మధు ప్రియ, సంపూ

మహేష్ కత్తి, హరితేజ, మధు ప్రియ, సంపూ

మహేష్ కత్తి మాట్లాడుతూ... జ్యోతి, కార్తిక పేర్లను సూచించారు. హరితేజ మాట్లాడుతూ... కార్తీక, మధు ప్రియ పేర్లను సూచించారు. సంపూ మాట్లాడుతూ ధనరాజ్, శివ బాలాజీ పేర్లను హౌస్ నుండి నామినేట్ చేయాల్సిందిగా సూచించారు.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

ఇంటి సభ్యులు వేసిన ఓట్ల ప్రకారం... హరితేజ, మధు ప్రియ, మహేష్ కత్తి, కార్తీక, జ్యోతి పేర్లను బిగ్ బాస్ నామినేట్ చేశారు. వీరిలో ఒకరిని ఫైనల్ గా ఈ వారం బయటకు పంపుతారని తెలుస్తోంది. ప్రేక్షకులు కూడా తమ ఓటింగ్ ద్వారా బిగ్ బాస్ ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండ కూడదు అని నిర్ణయించవచ్చు.

ప్రేక్షకులు ఇలా ఎలిమినేట్ చేయవచ్చు

ప్రేక్షకులు ఇలా ఎలిమినేట్ చేయవచ్చు

హరితేజను ఎలిమినేట్ చేసేందుకు ఓటు వేయాలంటే 08433900171 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

జ్యోతిని ఎలిమినేట్ చేసేందుకు ఓటు వేయాలంటే- 08433900166 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

కార్తీకను ఎలిమినేట్ చేసేందుకు ఓటు వేయాలంటే- 08433900169 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
మధుప్రియను ఎలిమినేట్ చేసేందుకు ఓటు వేయాలంటే 08433900164 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
మహేష్ కత్తిని ఎలిమినేట్ చేసేందుకు ఓటు వేయాలంటే 08433900168 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X