అమ్మా రాజశేఖర్ అవుట్.. ఓటింగ్ పట్టించుకోకుండానే.. గుట్టువిప్పిన బిగ్‌బాస్ సెలబ్రిటీ

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో ఎలిమినేషన్ కోసం రంగం సిద్ధమవుతున్నది. ఇప్పటికే నామినేషన్‌లో ఉన్న సెలబ్రిటీలను రక్షించుకొనేందుకు అభిమానులు, నెటిజన్లు, ప్రేక్షకులు ఓట్లు వేస్తూ తమకు ఇష్టమైన కంటెస్టెంట్‌ను సేవ్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్ ఇంటిలో 52వ రోజున ఎలిమినేట్ అయ్యే అభ్యర్థిపై కొందరు కంటెస్టెంట్లు మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. ఇంతకు ఎవరు ఎలిమినేట్ అవుతారని.. ఎవరు మాట్లాడారంటే..

అమ్మా రాజశేఖర్‌కు కష్టమే..

అమ్మా రాజశేఖర్‌కు కష్టమే..

ఇంటిలో లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బీబీ డే కేర్ గేమ్ పూర్తయిన తర్వాత డైనింగ్ టేబుల్‌పై హారిక, లాస్య, నోయల్ సీన్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ వారం నామినేషన్లు గట్టిగా జరిగాయి. అయితే అమ్మా రాజశేఖర్‌కు కష్టమయ్యే అవకాశం ఉంది అంటూ నోయల్ సీన్ ఆయన గట్టెక్కడం కష్టమే అన్నట్టు కామెంట్ చేశారు.

నామినేషన్ ప్రక్రియ తర్వాత కాళ్లుపట్టుకోబోయారు..

నామినేషన్ ప్రక్రియ తర్వాత కాళ్లుపట్టుకోబోయారు..

నామినేషన్ల ప్రక్రియలో ఆయన ఏదో ఏదో మాట్లాడాడు. అది ఆయనకు బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రియ తర్వాత మనతో మాట్లాడిన తర్వాత ఆయన నా కాళ్లు పట్టుకోబోయాడు. వయసులో పెద్దవాడవి అలా మాట్లాడటం, చేయడం సరికాదు అని చెప్పాను. అంత వరకు ఎందుకు తెచ్చుకొంటాడో అర్థం కాలేదు అంటూ లాస్యతో నోయల్ సీన్ చెప్పడం కనిపించింది.

కాళ్లు పట్టుకొనే వరకు తెచ్చుకొంటాడా?

కాళ్లు పట్టుకొనే వరకు తెచ్చుకొంటాడా?

ఇంటిలో అమ్మా రాజశేఖర్‌ను పెద్దవాడిగా చూస్తాం. అయన కాళ్లు పట్టుకొనే వరకు తెచ్చుకోకూడదు. అంతవరకు రానివ్వకుండా చూసుకోవాలి. ఆయన కొందరిపై పర్సనల్‌గా కామెంట్ చేస్తున్నారు. అదే ఆయనకు ఇబ్బందిగా మారింది. అలా చేయకూడదని చెప్పాను అని నోయల్ సీన్ పేర్కొన్నారు.

వాస్తవ పరిస్థితిని ఆయన గుర్తించడం లేదు

వాస్తవ పరిస్థితిని ఆయన గుర్తించడం లేదు

లాస్యతో అమ్మా రాజశేఖర్ వ్యవహారశైలిపై నోయల్ సీన్ టాపిక్‌ను కొనసాగిస్తూ.. అతడు వాస్తవ పరిస్థితిని గుర్తించడం లేదన్నారు. అమ్మా రాజశేఖర్ వ్యవహరిస్తున్న తీరుపై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు చెప్పలేకపోతున్నారు. అయితే తాను ఎన్నిసార్లు చెప్పినా నేను అంతేరా అంటున్నాడు. అది తన సమస్యకు పరిష్కారం కాదు అంటూ నోయల్ సీన్ వెల్లడించారు.

నామినేషన్‌లో ఉన్న సెలబ్రిటీలు వీరే..

నామినేషన్‌లో ఉన్న సెలబ్రిటీలు వీరే..

8వ వారానికి జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో అఖిల్, మోనాల్, మెహబూబ్, లాస్య, అరియానా, అమ్మా రాజశేఖర్ నామినేట్ అయ్యారు. అభిజిత్, హారిక, సోహైల్, అవినాష్‌ నామినేట్ కాలేదు. శనివారం, ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో ఈ వారం ఇంటి నుంచి వెళ్లిపోయే వారి గురించిన ప్రక్రియను హోస్ట్ నాగార్జున చేపడుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X