»   » ‘బిగ్ బాస్’ నుండి ప్రిన్స్ ఔట్... డిప్రెషన్లో ఆదర్శ్, హరితేజ- శివ బాలాజీ రొమాన్స్!

‘బిగ్ బాస్’ నుండి ప్రిన్స్ ఔట్... డిప్రెషన్లో ఆదర్శ్, హరితేజ- శివ బాలాజీ రొమాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Telugu : Pince Eliminated From Bigg Boss

తెలుగులో రియాల్టీ షో 'బిగ్ బాస్' దాదాపుగా చివరి దశకు చేరుకుంది. షో పూర్తి కావడానికి మరో రెండు వారాలు మాత్రమే ఉంది. షో ముగింపు దగ్గర పడుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్లో షో హోస్ట్ ఎన్టీఆర్..... ఈ షో నుండి ప్రిన్స్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.

ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతోందని, గడిచిన వారం మొత్తం 2.82 కోట్ల ఓట్లు ప్రేక్షకులు వేశారని, దాని ప్రకారమే ఎలిమినేషన్ ప్రక్రియ జరుగిందని ఎన్టీఆర్ ప్రకటించారు. ప్రతి ఓటును పిడబ్ల్యుసి అనే సంస్థ ద్వారా ఆడిటింగ్ చేయిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.

ఎన్టీఆర్ రాకతో సందడి

ఎన్టీఆర్ రాకతో సందడి

వారంలో ఐదు రోజుల పాటు కాస్త నీరసంగా సాగే బిగ్ బాస్... వారాంతం వచ్చేసరికి చాలా హుషారుగా రన్ అవుతోంది. అందుకు కారణం శని, ఆదివారాల్లో ఈ షోను ఎన్టీఆర్ హోస్ట్ చేస్తుండటమే. ఈ శని, ఆదివారాల్లో కూడా ఎన్టీఆర్ హోస్ట్ షో ప్రేక్షకులను బాగా ఎంటర్టెన్ చేసింది.

కబడ్డీ కబడ్డీ

కబడ్డీ కబడ్డీ

వారాంతం షోలో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయించడానికి ఇంటి సభ్యులతో కబడ్డీ ఆడించారు ఎన్టీఆర్. కబడ్డీ గేమ్ చాలా ఫన్నీగా సాగింది. ఈ పోటీలో హరితేజ టీం ఓడిపోగా, అర్చన టీం విజయం సాధించింది.

డిప్రెషన్లో ఆదర్శ్

డిప్రెషన్లో ఆదర్శ్

ప్రిన్స్ ఎలిమినేట్ కావడాని కారణం ఆదర్శే అని ఎన్టీఆర్ ప్రకటించడంతో ఆడి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. కారణం ఏమిటో చెప్పాలని ఆదర్శ్ విన్నవించినా ఎన్టీఆర్ చెప్పకుండా మాట దాటేవేశాడు. దీంతో ఆడి మూడ్ ఔట్ గా కనిపించాడు.

శివ-హరితేజ రొమాన్స్

శివ-హరితేజ రొమాన్స్

ఇంట్లో శివ బాలాజీ, హరితేజ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుండటంతో ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుందనే ఒక వాదన మొదలైంది. దీనికి ఎన్టీఆర్ తనదైన టైమింగుతో వారిపై పంచ్ లు వేస్తూ నవ్వులు పూయించారు. హరితేజ శివ బాలాజీని తన కంట్రోల్ లో పెట్టుకుని గేమ్ మొత్తాన్ని తన గ్రిప్ లోకి తెచ్చుకుంటుందని జాగ్రత్తగా ఉండాలని ఎన్టీఆర్ సూచించారు.

నిప్పులాంటి నిజం

నిప్పులాంటి నిజం

నిప్పు లాంటి నిజం పేరుతో ఎన్టీఆర్ ఇంటి సభ్యులతో ఓ గేమ్ ఆడించారు. అందులో పలువురు సభ్యులు తమ జీవితంలో ఇప్పటి వరకు షేర్ చేసుకోని కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.

లై డిటెక్టర్

లై డిటెక్టర్

ఇంటి నుండి బయకు వచ్చిన ప్రిన్స్‌ను లై డిటెక్టర్ చైర్ మీద కూర్చొబెట్టి కొన్ని ప్రశ్నలు సంధించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ప్రశ్నలు, ప్రిన్స్ సమాధానాలు ఆసక్తిగా సాగాయి.

బిగ్ బాంబ్

బిగ్ బాంబ్

ఎలిమినేట్ అవుతున్న ప్రిన్స్ తనకు వచ్చిన బిగ్ బాంబ్ అవకాశాన్ని దీక్ష మీద ప్రయోగించాడు. దాని ప్రకారం... దీక్ష ఇంట్లో నడవకూడదు. వారం రోజుల పాటు ఎక్కడికి వెళ్లినా పాకుతూనే వెళ్లాలి.

English summary
Bigg Boss Telugu elimination: Prince evicted from Jr NTR's show. Jr NTR organises a Kabaddi game in the house with some interesting new rules. Later, he announces the name of the evicted contestant.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu