నా గుండె గట్టిది.. అలా ముక్కలు కాలేదు.. ఎలిమినేషన్ తర్వాత సుజాత ఎమోషనల్
అందరూ ఊహించినట్టుగానే బిగ్‌బాస్‌లో జోర్దార్ సుజాత ప్రయాణం ముగిసింది. ఎలిమినేట్ అయిన తర్వాత వేదికపైకి వచ్చి హోస్ట్ నాగార్జునతో కలిసి ముచ్చటించింది. ఇంటిలోని విషయాలను, ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. అయితే ఎలిమినేషన్ మాత్రం ఊహించనిది అంటూ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. నాగ్‌తో సుజాత మాట్లాడుతూ..

ఇంటి నుంచి వెళ్తానని ఊహించలేదు
ఎలిమినేషన్ మాత్రం ఊహించనిది. చాలా బాధగా ఉంది. ఇంటి నుంచి వెళ్లిపోతానని అసలు అనుకోలేదు. ఊహించనవి జరగనివే బిగ్‌బాస్. కాబట్టి ఎలిమినేషన్ గురించి కొంత బాధగా ఉన్నప్పటికీ.. మంచి అనుభూతులను తీసుకెళ్తున్నానని అని సుజాత అన్నారు. వేదికపైనే బాధపడుతూనే ముఖంలో ఆనందాన్ని తెచ్చి పెట్టుకొన్నారు.

బిగ్‌బాస్ తర్వాత నా జీవితం వేరు
లైఫ్‌లో ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ బిగ్‌బాస్‌లో ఉండటం గొప్పగా అనిపిస్తుంది. బిగ్‌బాస్‌కు ముందు జీవితం వేరు.. బిగ్‌బాస్‌లో ఉన్న రోజులు స్పెషల్. హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం వచ్చాను. నా తల్లిదండ్రులకు ఏదో సహాయం చేయాలని అనుకొన్నాను. కానీ అంతకుమించి నాకు, నా జీవితానికి, కుటుంబానికి బిగ్‌బాస్ ఇచ్చింది. నా విషయంలో నా తల్లిదండ్రులు మరింత గర్వపడే స్థాయికి రావడం సంతోషంగా ఉంది అని సుజాత తెలిపారు.

నోయల్ అంటే లవ్వు.. అభిజిత్ అంటే..
ఇంటి సభ్యుల్లో నోయల్ సీన్ నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. నా కోసం చాలా మారిపోయారు. నాలాగా మారిపోయి నన్ను చూసుకొన్నారు. అందుకే నాకు నోయల్ అంటే లవ్వు. అభిజిత్ విషయంలో నా హృదయం ముక్కలు చేశాడు. చెల్లి అనిపించుకోవడం నాకు అలవాటు. కానీ అభిజిత్ విషయంలో నాకు కొంత మిస్ అండర్‌స్టాండింగ్ జరిగింది అంటూ సుజాత చెప్పింది. అలా ఒక్కొక్కరి తన అభిప్రాయాలను చెప్పింది.
Recommended Video

అవినాష్ అందరికి ప్రేమను పంచుతూ
ఇంటి సభ్యులు గురించి చెప్పాలనే విషయం వచ్చే సరికి, బ్రోకెన్ హార్ట్ ఇంటి సభ్యులకు పెట్టేటప్పుడు నా గుండె గట్టిది. ఇన్ని ముక్కలు కాలేదు అంటూ చలాకీగా నవ్వింది. అవినాష్ గురించి మాట్లాడుతూ ప్రేమను అందరికి పంచుతున్నాడు. ఒక్కరితో కాకుండా అందరికీ గాలం వేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఓ విధంగా.. అక్కడికి వెళ్లి మరో విధంగా మాట్లాడుతూ మాయ చేస్తుంటాడు అని సుజాత చెప్పారు.


Click it and Unblock the Notifications











