కోకోకోలా పెప్సీ అంటూ పాయల్ రాజ్‌పుత్ రచ్చ.. బిగ్‌బాస్‌లో అఖిల్ అక్కినేని, హైపర్ ఆది
బిగ్‌బాస్ తెలుగు 4లో దసరా పండుగ బ్రహ్మాండంగా సాగినట్టు కనిపిస్తున్నది. ఈ వారం ఇంటిలోని సెలబ్రిటీలతోపాటు సినీ తారలు వేదికపైన హంగామా చేశారు. ఇంటి సభ్యులతో దసరా ఉత్సవాన్ని జరుపుకోవడానికి హోస్ట్‌గా సమంత రాగా, ఆమెకు తోడుగా పాయల్ రాజ్‌పుత్, కార్తికేయ గుమ్మకొండ, హైపర్ ఆది, అఖిల్ అక్కినేని తదితరులు వచ్చారు. ఇంటిలో ఆదివారం ఎలాంటి హంగామా జరిగిందంటే..

అందాల ఆరబోతతో పాయల్ రాజ్‌పుత్
RX 100 చిత్రంతో మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్న పాయల్ రాజ్‌పుత్ బిగ్‌బాస్ వేదికపైన మెరిసింది. తనదైన శైలిలో గ్లామర్ పంట పండించి.. అందాల ఆరబోతతో ఇంటి సభ్యులను, ప్రేక్షకులను మెప్పించింది. కోకాకోలా పెప్పీ అంటూ స్పెషల్ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత సెలబ్రిటీలతో తన ఆనందాన్ని పంచుకొన్నారు.

సాహో పాటపై కార్తికేయ
ఇక RX 100 ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో పాటకు స్టెప్పులేసి దుమ్మురేపారు. వేదిక మీద స్పెషల్‌గా డిజైన్ చేయడంతో కార్తీకేయ ఎంట్రీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. దాదాపు 8 నిమిషాలపాటు సాగిన కార్తీకేయ అందర్నీ ఆకట్టుకొన్నది.

హైపర్ ఆది పంచులు
ఇక హైపర్ ఆది ప్రవేశం కూడా సూపర్బ్‌గా ఉంది. వస్తూ వస్తూనే సమంతకు పంచ్ ఇచ్చేశాడు. డిటెక్టివ్‌గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది నేను అలా కనపడటం లేదా అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. ఇక ఇంటి సభ్యులపై హైపర్ ఆది విసిరిన పంచులు బిగ్‌బాంబులుగా మారాయి.
అఖిల్ అక్కినేని స్పెషల్ ఎంట్రీ
ఇక బిగ్‌బాస్ సండే, ఫన్‌డే ఎపిసోడ్‌లో స్పెషల్ అప్పీరియెన్స్‌గా అఖిల్ అక్కినేని ఎంట్రీ ప్రేక్షకులకు షాకిచ్చేలా ఉంది. వేదిక మీదకు వచ్చి బిగ్‌బాస్ తెలుగు షోపై ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపు మూడుగంటలపాటు జరిగిన షోలో సినీతారల ప్రత్యేక పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











