బిగ్ బాస్2: టార్గెట్ కౌశల్... దర్శకుడు రాజమౌళిని అనడంతో రెచ్చిపోయిన వైనం!
Recommended Video

బిగ్ బాస్ తెలుగు2 షో నుండి నుండి గత వారం తేజస్వి మదివాడ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వచ్చే వారం కోసం సోమవారం మళ్లీ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఇంటి నుండి ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటారో వారిపై గుడ్లు కొట్టాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడు. దీంతో ఇంటి సభ్యులు ఎక్కువ మంది కౌశల్‌ను టార్గెట్ చేశారు. కౌశల్ తర్వాత నామినేట్ అయినవారిలో బాబు గోగినేని, దీప్తి సునయన, గణేశ్, నందిని ఉన్నారు.

కౌశల్ మీద ఆరోపణలు
కౌశల్ తీరు సరిగా లేదని పలువురు ఇంటి సభ్యులు ఆరోపణలు చేశాడు. తనకు అనవసరమైన సలహాలు ఇస్తున్నాడని నందిని అతడిపై గుడ్లు పగలగొట్టింది. తనీష్ కూడా కౌశల్ వ్యవహారం తనకు నచ్చలేదని, రిలేషన్ షిప్ విషయంలో అతడి ఆలోచన సరైంది కాదన్నారు.

ఆ ఇద్దరిపై గుడ్లు కొట్టిన కౌశల్
కౌశల్ తన వంతు వచ్చినపుడు నందిని, బాబు గోగినేనిపై గుడ్లు కొట్టారు. నందినికి తాను హెల్ప్ చేసి తప్పు చేశానని వ్యాఖ్యానించారు. బాబు గోగినేనిపై గుడ్లు కొట్టడానికి కారణం... అతడు మా సినిమా వాళ్ల దేవుడు అయిన రాజమౌళిని విమర్శించడమే కారణమని చెప్పాడు.

రాజమౌళిని అంటే ఊరుకోను
బాబు గోగినేని గారు....మీరు దేవుళ్లను నమ్మరు. అది మీ ఇష్టం. మా టాలీవుడ్‌కి, యాక్టర్లకు, ఫిల్మ్ ఇండస్ట్రీకి దేవుడు రాజమౌళి, మ్యూజిక్ దేవుడు కీరవాణి. మీరు బిగ్ బాస్ ఇంటికి వచ్చిన తర్వాత వారిని కూడా విమర్శించారు. అది నాకు నచ్చలేదు.

రాజమౌళిని అనే హక్కు మీకు లేదు
రాజమౌళి నాస్తికుడు అయుండి మంత్రాలయం వెళ్లాడని మీరు చెప్పారు. అది అతడి ఇష్టం...వెళతాడు. రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచస్థాయి తెచ్చిన మహానుభావుడు. అతడి గురించి అంటే ఊరుకోను. అందుకే మీ మీద గుడ్డు కొట్టి నామినేట్ చేస్తున్నాను అని కౌశల్ తెలిపాడు.

తనీష్ మీద మండి పడ్డ కౌశల్
నామినేషన్ సమయంలో కౌశల్ ఇంటి సభ్యులపై పలు కారణాలు చెబుతూ మండి పడ్డారు. ప్రదీప్ వచ్చినపుడు ఇంటి సభ్యులందరి గురించి చెప్పమంటే... కౌశల్‌తో ఎవరు గొడవ పడితే వారు ఇంటి నుండి వెళ్లిపోతారు అని తనీస్ చెప్పాడు. అది నాకు చాలా సిల్లీగా అనిపించింది అని కౌశల్ తెలిపారు.

ఆ స్థానంలో ఎవరున్నా అంతే
ఒక సిల్లీ రీజన్‌ను ఇంత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదు. కౌశల్‌తో గొడవ పడితే బయటకు వెళ్లిపోతారు అనేది సిచ్యువేషన్. ఆ స్థానంలో ఎవరున్నా బయటకు వెళ్లక తప్పదు. సిల్లీని దయచేసి సిల్లీగానే తీసుకోండి.

గేమ్ ఆడటానికే వచ్చా, రిలేషన్ పెంచుకోవడానికి కాదు
నేను ఇక్కడ గేమ్ ఆడటానికే వచ్చాను. బంధాలు పెట్టుకోవడానికి, రిలేషన్ పెట్టుకోవడానికి రాలేదు. నా ఫోకస్ అంతా గేమే. నేను అలాగే పెరిగాను, అలాగే చస్తాను. ఇక్కడకు వచ్చింది ఒక ఏయిమ్ తో, బయకు వెళ్లిన తర్వాత బిగ్ బాస్ ను యూజ్ చేసుకుని ఏదైనా సాధించాలనే ఎయిమ్ తో... నా ఆలోచన అంతా అదే, కౌశల్ ఆడేది గేమ్ గానే తీసుకోండి.

బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరైన కొత్త వ్యక్తి ఎవరు?
సోమవారం అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరో ఓ కొత్త అమ్మాయి ప్రవేశించింది. అయితే అది ఎవరు? అనేది తెలియడం లేదు. వెంట బ్యాగ్ లాంటివేమీ లేకుండా ఆమె ఎంటరవ్వడం చూస్తుంటే ఎవరో సెలబ్రిటీ అయిఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











