నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.. రిలేషన్‌షిప్స్ కలిసి రావట్లేదంటున్న బిగ్‌బాస్ భామ..
బిగ్‌బాస్ బ్యూటీ, హాట్ యాంకరమ్మ అరియానా గ్లోరీ (Ariyana Glory) మరోసారి తన ఓపెన్ హార్ట్ టాక్‌తో వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియా గ్లామర్ షోలు, బోల్డ్ స్టేట్మెంట్స్‌తో ఎప్పుడూ చర్చల్లో ఉండే అరియానా... ఈసారి మాత్రం తన వ్యక్తిగత జీవితంలోని బాధను, రిలేషన్‌షిప్స్ విషయంలో చేసిన తప్పులను చాలా నిజాయితీగా బయటపెట్టింది. తాజాగా ఆమె పాల్గొన్న 'కిసిక్ టాక్' షోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
టిక్‌టాక్ వీడియోలు, రీల్స్‌తో మొదట గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ, రాంగోపాల్ వర్మకు ఇచ్చిన బోల్డ్ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి, తన ముక్కుసూటితనం, స్పష్టమైన మాటలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. షోలో మొదట ట్రోల్స్ ఎదురైనా... తర్వాత మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. బిగ్‌బాస్ తర్వాత టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా కొనసాగుతోంది.

యాంకర్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కిసిక్ టాక్' షోలో తాజాగా అరియానా గ్లోరీ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో అరియానా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది. 'నా జీవితంలో నేను ఏదైనా పొందలేదు అంటే... అది ప్రేమ మాత్రమే. నాకు ప్రేమ దొరకడం చాలా కష్టం'అంటూ చెప్పింది. యాంకర్ వర్షా ప్రేమ ఎందుకు దొరకలేదని అడగ్గా... 'నా అనుకున్నవాళ్లు ఎప్పుడూ నాకు దూరమవుతారు. నిజమైన ప్రేమ ఇప్పటివరకు ఎవరి నుంచీ దొరకలేదు. నాకు ఉన్న ప్రేమ అంటే అమ్మ ప్రేమ, చెల్లి ప్రేమ మాత్రమే. మిగతా ప్రేమ నాకు రాసిపెట్టి లేదేమో' అంటూ తన మనసులోని బాధను బయటపెట్టింది.
'నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే'
పెళ్లి, రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడేటప్పుడు అరియానా షాకింగ్ కామెంట్స్ చేసింది. 'నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే... రాంగ్ పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకోవడమే. అందరూ వాడు మంచివాడు కాదు అని చెప్పినా... 'మీరు చూడని ఓ డిఫరెంట్ యాంగిల్ నేను వాడిలో చూస్తున్నా' అని వాళ్ల మాటలు వినకుండా నిర్లక్ష్యం చేసేదాన్ని. కొన్ని రోజులకు వాళ్లు చెప్పింది కరెక్ట్ అని అర్థమయ్యేది' అంటూ తన అనుభవాన్ని చెప్పింది. ఈ విషయంలో ఎన్నోసార్లు అదే తప్పు చేసినట్లు కూడా అంగీకరించింది.
రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడుతూ... 'ఇప్పుడిప్పుడే కొత్తగా వెళ్లి కొత్త పర్సన్‌ను వెతుక్కునేంత ఓపిక లేదు. ఆ ఎనర్జీ కూడా లేదు' అని స్పష్టం చేసింది. ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నారా అని అడిగితే... 'నేను కచ్చితంగా కమిటెడ్ కాదు. నాకు రిలేషన్ కావాలి. కానీ అనవసరమైన గొడవలు అవసరం లేదు. కష్టమైతే నేను ఒంటరిగానే చాలా బాగున్నాను. సెల్ఫ్ రెస్పెక్ట్‌తో బతుకుతున్నాను' అంటూ తన స్టాండ్ క్లియర్ చేసింది. అలాగే...'ఆ రిలేషన్ అన్నీ మ్యాజిక్‌లా అవే రావాలి. నేను వెళ్లి సెలెక్ట్ చేసుకుంటే మాత్రం అది నాకు సెట్ కావడం లేదు' అంటూ ఫన్నీగా చెప్పింది.
చివరిగా తనకు ఎలాంటి పార్ట్నర్ కావాలన్న విషయంపై క్లారిటీ ఇచ్చింది అరియానా. 'లుక్స్‌కి నేను ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. నన్ను అర్థం చేసుకునే వాడు కావాలి. ఈ పరిస్థితుల్లో నాకోసం ఏదైనా చేస్తాడు అనే ఫీలింగ్ ఇవ్వాలి. నాకు అండగా నిలబడే వ్యక్తి కావాలి' అని చెప్పింది. అలాంటి వ్యక్తి దొరకకపోవడమే తాను ఇంకా సింగిల్‌గా ఉండటానికి కారణమని తెలిపింది.
ఈ ఇంటర్వ్యూలో అరియానా గ్లోరీ తన గ్లామర్ ఇమేజ్‌ను పక్కనపెట్టి, చాలా రియల్‌గా మాట్లాడిందని చెప్పాలి. రిలేషన్‌షిప్స్‌లో చేసిన తప్పులను ఒప్పుకోవడం, ప్రేమపై తన నిస్సహాయతను చెప్పడం అభిమానులకు మరింత దగ్గర చేసింది. ప్రస్తుతం అరియానా మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











