జీవితంలో అన్నీ వెన్నుపోట్లేనా?.. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి పోస్ట్ వైరల్
సోషల్ మీడియాలో యాప్స్ ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వాటి ద్వారా సాధారణ అమ్మాయిలకు సెలెబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. అలా డబ్ స్మాష్ ద్వారా అష రెడ్డి ఎక్కువగా ఫేమస్ అయింది. జూనియర్ సమంతగా అందరినీ ఆకట్టుకుంది. అషూ రెడ్డి బిగ్ బాస్ ఇంట్లోకి రావడం, ఆ తరువాత జరిగిన పరిణామాలతో మరింతగా ఫేమస్ అయింది. ఆమె లవ్ ట్రాకులు, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలు, పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు, టాటూలతో ఎక్కువగా ఫేమస్ అయింది. ఇక ఇప్పుడు అషూ రెడ్డి నెట్టింట్లో మరింతగా సందడి చేస్తుంటుంది.

బిగ్ బాస్ షోతో..
బిగ్ బాస్ బ్యూటీగా అషూ రెడ్డికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ షోలో అషూరెడ్డి కనిపించినా కూడా ఎక్కువగా ఫేమస్ అవ్వలేదు. ఆ తరువాత బయటకు వచ్చాక రాహుల్ సిప్లిగంజ్‌తో చేసుకున్న పార్టీలు, దిగిన ఫోటోలతో ఇంకా ఎక్కువగా ఫేమస్ అయింది. ఇక ఈ ఇద్దరి మధ్య ఉన్న విషయం ఏంటా? అని ఆ మధ్య ఎక్కువగా హాట్ టాపిక్ అయింది.

కాంట్రవర్సీలు..
బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డికి ఎప్పుడూ కాంట్రవర్సీలు చిక్కులు తెస్తూనే వచ్చాయి. రాహుల్ ట్రాక్, వర్మతో చేసిన పిచ్చి ఇంటర్వ్యూ, పవన్ కళ్యాణ్ టాటూలపై కామెంట్లు, కామెడీ స్టార్స్‌తో ఎక్స్ ప్రెస్ హరి ట్రాక్, అతను వేసుకున్న అషూ రెడ్డి పచ్చ బొట్టు ఇలాంటి వాటితో మరింతగా ఫేమస్ అయింది.

నెట్టింట్లో అలా..
అషూ రెడ్డి నెట్టింట్లో చేసే అందాల జాతర కూడా అలానే ఉంటుంది. ఆమె తన థైస్ షోను ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అలా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక ఆమె వెకేషన్లలో చేసే సందడి అయితే మామూలుగా ఉండదు. ఈ మధ్య నెలకు రెండు మూడు సార్లు దుబాయ్‌కు వెళ్తూ వస్తోంది.

ఫ్రెండ్ షిప్ డే..
ఇక అందరూ ఫ్రెండ్ షిప్ డే అంటూ తమ ఫ్రెండ్స్ గురించి చెబుతుంటారు. కానీ అషూ రెడ్డి మాత్రం తన శత్రువుల గురించి చెప్పింది. తనను వెన్ను పోటు పొడిచిన ఫ్రెండ్స్ గురించి కౌంటర్ వేసింది. తెలుగు సినిమాల్లో అలా ఫ్రెండ్స్‌లా వెంటే ఉంటూ వెన్ను పోటు పొడిచే సీన్లకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

మీ వల్లే జీవితం..
అషూ రెడ్డి ఫ్రెండే తన లవర్‌ను ట్రాప్ చేసి.. ప్రేమలో పడేసి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇలా ఫ్రెండ్ షిప్ నాడు.. వెన్ను పోటు పొడిచిన ఫ్రెండ్స్ గురించి పోస్ట్ చేయడంతో ఆమెలో ఇంకా ఆ బాధ వెంటాడుతోందనిపిస్తోంది. అలాంటి వెన్ను పోట్లు పొడిచే ఫ్రెండ్స్ ఉంటేనే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయ్ అని నవ్వుతూ పోస్ట్ వేసింది.


Click it and Unblock the Notifications











