For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆదిరెడ్డితో రిలేషన్‌షిప్ అలాంటిది.. మందు పెట్టానా? భార్య ఆరోపణలపై గీతూ రాయల్ స్పందన

  |

  బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో గీతూ రాయల్, ఆదిరెడ్డి కెమిస్ట్రీ, బాండింగ్ హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ ఇంటిలో వారిద్దరి మధ్య బాండింగ్‌ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ఇంట్లో గీతూ రాయల్‌తో సన్నిహిత సన్నివేశాలు చూసి.. , ఆది రెడ్డి భార్య కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  తన భర్తకు ఏదో మందు పెట్టి దగ్గరకు చేసుకొన్నదనే కామెంట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఆది రెడ్డితో తన బాండింగ్, ఆది రెడ్డి భార్య కామెంట్లపై గీతూ రాయల్ వివరణ ఇచ్చారు. యూట్యూబ్ ఛానెల్‌కు ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..

  ఆదిరెడ్డితో నా రిలేషన్ అలాంటింది

  ఆదిరెడ్డితో నా రిలేషన్ అలాంటింది

  బిగ్‌బాస్ ఇంటిలో నేను చాలా యాక్టివ్‌గా ఉండేదానిని. పులిపిల్లలా ఎగిరి గంతేసేదానిని. అయితే ఆరోగ్య సమస్య కారణంగా నేను కదల్లేకపోయాను. అయితే ఆ సమయంలో బాత్రూంలు క్లీన్ చేయాల్సి ఉంది. నా పరిస్థితిని చూసి ఆదిరెడ్డి వచ్చి.. నేను కడిగేయాలా? అని అడిగాడు.

  అలా చొరవ తీసుకొని ఎవరైనా బాత్రూంలు కడుగుతారా? ఒక్కసారి ఆదిరెడ్డి అలా అనడంతో నేను పొంగిపోయాను. ఎవరైనా నాపై చిన్న ప్రేమ చూపిస్తే. నేను ఫ్లాట్ అయిపోతాను. అలా ఆదిరెడ్డితో నేను క్లోజ్ అయ్యాను. అలా మా బాండింగ్ బలపడింది. నాకు ఆదిరెడ్డి మంచి ఫ్రెండ్ మాత్రమే అని గీతూ రాయల్ చెప్పింది.

  ఆదిరెడ్డితో సన్నిహితంగా ఉండటం

  ఆదిరెడ్డితో సన్నిహితంగా ఉండటం

  ఆదిరెడ్డి చెవి పిసికడంపై కవిత తీవ్రంగా స్పందించడంపై గీతూ రాయల్ స్పందించారు. ఆదిరెడ్డిని గుద్దుతా? ఆదిరెడ్డి చెవిని పిసికిని సంఘటనలపై నాకు అనుమానాలు వచ్చాయి. ఈ సీన్లు బయట ఎలా రిసీవ్ చేసుకొంటున్నారో అనే విషయం నా మైండ్‌‌లో మెదిలింది. మా నాన్నకు కాల్ చేసినప్పుడు కూడా అదే విషయాన్ని అడిగాను. అయితే నీకు బుద్దే లేదు కదా.. అని అన్నాడు. అయితే ఆదిరెడ్డితో నా రిలేషన్‌లో అనుమానించాల్సిన విషయం లేదు అని గీతూ రాయల్ అంది.

  ఆదిరెడ్డి భార్య విలేజ్ అమ్యాయి అంటూ

  ఆదిరెడ్డి భార్య విలేజ్ అమ్యాయి అంటూ

  ఆదిరెడ్డి, గీతూ రాయల్ మధ్య క్లోజ్‌నెస్ పెరిగిపోవడంతో కవిత తన భర్త బయటకు వచ్చినా పర్వాలేదు. కానీ ఆమెను నా భర్తకు దగ్గరగా ఉండొద్దు అనే కామెంట్లపై గీతు రాయల్ స్పందించింది. కవిత పల్లెటూరి అమ్మాయి. ఆదిరెడ్డి మరో అమ్మాయితో మాట్లాడిన దాఖలాలు లేవు. అందుకే ఆదిరెడ్డి భార్య చాలా జెలసీ, ఇన్ సెక్యూర్‌గా ఫీలయ్యింది. అయితే నేను బయటకు వచ్చిన తర్వాత కవితతో మాట్లాడాను. అయితే ఆదిరెడ్డిని తక్కువ చేసి మాట్లాడటంతో ఆమె హర్ట్ అయింది అని గీతూ రాయల్ చెప్పింది.

  ఆదిరెడ్డి మనస్తత్వం అలాంటిది

  ఆదిరెడ్డి మనస్తత్వం అలాంటిది

  ఆదిరెడ్డి మనస్తత్వం విషయానికి వస్తే.. పొగిడితే.. వెంటనే పొంగిపోతాడు. అందుకే ఆయన పొంగిపోయి గేమ్ పాడు చేసుకొకుండా కంట్రోల్‌లో పెట్టే ప్రయత్నం చేశాను. కానీ ఆది రెడ్డిని డీ గ్రేడ్ చేయడం నా ఉద్దేశం కాదు. ఇంటిలో మరొకరితో కలిసి ఉండలేకపోయేవాడు. ఆదిరెడ్డి బాగా జోకులు వేస్తాడు. అందుకే నేను, అతడు కలిసి సరదాగా మాట్లాడుకొనే వాళ్లం. అది కవితకు వేరే విధంగా కనిపించింది. విలేజ్‌లో ఉండే వాళ్లకు, సిటీలో ఉండేవాళ్ల మనస్తత్వాలకు తేడా ఉంటుంది అని గీతూ రాయల్ చెప్పింది.

  ఆదిరెడ్డి భార్యకు క్లారిటీ ఇచ్చాను..

  ఆదిరెడ్డి భార్యకు క్లారిటీ ఇచ్చాను..

  ఆదిరెడ్డి నా కోసం పనులు చేయడం, నాకు చెంచాగా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్ చేయడంతో కవితకు కోపం వచ్చింది. అందుకే అలా నాపై కామెంట్స్ చేసి ఉంటారేమో. బయటకు వచ్చిన తర్వాత కవితకు క్లారిటీ ఇచ్చాను. దాంతో మా మధ్య అపోహలు తొలగిపోయాయి. నేను మందుపెట్టినట్టు బిగ్‌బాస్‌ను అడిగావా? అని అంటే.. అలా నేను అడగలేదు అని చెప్పింది. వాళ్లు హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నారు. కవిత సిటీ వాతావరణానికి అలవాటు పడితే.. అంతా క్లియర్ అవుతుంది అని గీతూ రాయల్ పేర్కొన్నది.

  నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే

  నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే


  నా ఆటతీరు వల్లే బిగ్‌బాస్ తెలుగు 6 ప్లాప్ అయిందంటే ఒప్పుకోను. నా గేమ్ నేను ఆడాను. దాని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అని అన్నారు. అయితే నా ఓవర్ కాన్ఫిడెన్స్‌ వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను. నా తప్పులు నేను తెలుసుకొన్నాను. కొన్ని తప్పులు తప్పులు కావని అర్ధమైంది. జరిగిపోయిన దానిని పట్టుకొని ఆలోచించడం వేస్ట్ అని గీతూ రాయల్ చెప్పింది.

  English summary
  Bigg Boss Telugu 6 Contestant and Youtuber Geetu Royal's relationship with Aadi Reddy become controversy. He has given clarity about Rift with Aadi Reddy's Wife Kavitha
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X