Guntur Kaaram కుర్చీని మడతపెట్టి.. రెచ్చిపోయిన శుభశ్రీ, టేస్టీ తేజ!
ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ ఫ్లాట్ ఫాం ఓపెన్ చేసినా కుర్చి మడతబెట్టి సాంగ్ వినిపిస్తుంది. దానిపై విపరీతంగా నెటిజన్స్ రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలోనిది ఈ పాట. అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మీమ్ డైలాగ్ ను ఈ పాటలో వాడటం విశేషం. ఇదిలా ఉంటే ఈ పాటకు బిగ్ బాస్ బ్యూటీ శుభ శ్రీ రాయగురు, టెస్టీ తేజలు డ్యాన్స్ వేశారు. కుర్చి మడతబెట్టి అంటూ రెచ్చిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది సెలబ్రెటీలు పాపులర్ అయ్యారు. ఈ షో ద్వారా ఎంతో మంది సోషల్ మీడియా స్టార్లు... సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ స్టార్స్ గా ఎదిగారు. ఇక సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగ్స్ చేసుకునే టేస్టీ తేజ చాలా మందికి తెలిసిందే. ఆయన జబర్ధస్త్ ప్రోగ్రామ్స్ లో కూడా స్కిట్స్ చేసేవాడు. ఇక అలా పాపులారిటినీ సొంతం చేసుకున్న టేస్టీ తేజ.. ఇటీవల బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టి బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు.
Recommended Video


ఇక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ శుభ శ్రీ రాయగురు.. బిగ్ బాస్ షోకి వచ్చే వరకు ఎవరికి పెద్దగా తెలియదు. ఈ భామ పలు సినిమాల్లో కూడా నటించింది. అయినా అంతగా గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్ షో ద్వారానే ఈ భామ బాగా ఫేమస్ అయింది. ఒకే ఒక్క డైలాగ్ మనోభావాలు దెబ్బతిన్నాయి బ్రో అంటూ ఫేమస్ అయింది. ఇక ఈ భామ షోలో ఉన్నది ఐదు వారాలే అయినా.. పాపులారిటి మాత్రం బాగానే సంపాదించుకుంది.
బిగ్ బాస్ షో అనంతరం బయటకు వచ్చాక టేస్టీ తేజ, శుభ శ్రీ, గౌతమ్ ఫుడ్ వ్లాగ్స్ చేశారు. గెట్ టు గెదర్ అయ్యారు. ఇక తాజాగా టేస్టీ తేజ... శుభ శ్రీ తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన కుర్చి మడత బెట్టి సాంగ్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం సినిమాలోని ఈ పాటపై మొదట ట్రోలింగ్ వచ్చినా... సోషల్ మీడిాయలో మాత్రం ఓ ఊపు ఊపేస్తుంది. మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలోనిది ఈ పాట.

సోషల్ మీడియాలో ఏ ఫ్లాట్ ఫాం ఓపెన్ చేసినా... వీటిపైనే రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టేస్టీ తేజ, శుభ శ్రీ కలిసి ఈ పాటపై స్టేప్పులు వేశారు. కుర్చి మడత బెట్టి అంటూ రెచ్చిపోయారు. శుభ శ్రీ అయితే థైస్ షో చేస్తూ.. నెటిజన్స్ కు ట్రీట్ ఇచ్చింది. చలి కాలంలో హీటెక్కించేలా డ్యాన్స్ చేసింది ఈ బ్యూటీ. టేస్టీ తేజ పక్కన రెచ్చిపోయి డ్యాన్స్ ఇరగదీసింది.
కొంత మంది క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ ఎక్కడ బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు. గౌతమ్, శుభ శ్రీ రాయగురు మంచి పెయిర్ అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇక గౌతమ్ ను వదిలేసి టేస్టి తేజతో డ్యాన్స్ చేయడంతో నెటిజన్స్ అలా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి రీల్ నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











