అతని కోసమే చదువు ఆపేశా.. ఇంట్లో నుంచి పారిపోయా.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

బుల్లితెర ప్రేక్షకులకు శ్రీసత్య (Sri Satya)ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ముద్దమందారం, త్రినయని, నిన్నే పెళ్లాడతా వంటి హిట్ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది సత్య. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 (Bigg Boss Telugu Season 6) ద్వారా మరింత పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం టీవీ షోలు, ఈవెంట్స్, డాన్స్ ప్రోగ్రామ్‌లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఓపెన్‌గా పంచుకుంది. చదువు, ప్రేమ, కుటుంబం, భవిష్యత్ ఆలోచనలు... అన్నింటిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరో కోసం చదువు ఆపేశా!
బిగ్ బాస్ బ్యూటీ, ఆర్జే కాజల్‌తో జరిగిన పాడ్ కాస్ట్ లో నటి శ్రీ సత్య చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. తన ఫేవరేట్ హీరో రామ్ పోతినేనీ (Ram Pothineni)17 ఏళ్లకే ఇండస్ట్రీలోకి రావడమే తనపై ప్రభావం చూపిందని చెప్పింది. 'ఇంటర్ తర్వాత చదువు ఆపేసి సినిమాల్లోకి వెళ్లిపోతాను అని ఇంట్లో చెప్పాను. ఆ మాట వినగానే అమ్మ నాతో మాట్లాడటం కూడా మానేసింది. కానీ నాన్న మాత్రం నన్ను ఎంకరేజ్ చేశారు. టీవీలో 'మిస్ విజయవాడ' పోటీలు అని స్క్రోలింగ్ చూసి... ప్రయత్నిస్తావా అని అడిగారు. అలా వెళ్లిన నేను చివరికి విజేతగా నిలిచాను' అంటూ తన కెరీర్ మొదటి అడుగు గుర్తు చేసుకుంది. ఆ పోటీకి గెస్ట్‌గా వచ్చిన శివాజీ తన సమాధానం నచ్చి తనను విన్నర్‌గా ప్రకటించారని చెప్పింది.

Bigg Boss Telugu Fame Sri Satya Reveals Shocking Truths About Quitting Studies Love amp amp Life

పిల్లలు కావాలి... పెళ్లి వద్దు!
ఇంటర్వ్యూలో మరో షాకింగ్ కామెంట్ చేస్తూ... 'నాకు పెళ్లి చేయాలనే ఆలోచన లేదు. కానీ పిల్లలు కావాలి, తల్లిగా మారాలనుంది. అందుకోసం నేనే పిల్లలను కనాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఎన్నో అనాధ ఆశ్రమాలు ఉన్నాయి. ఫ్యూచర్‌లో కచ్చితంగా ఒక ఆడపిల్లను దత్తత తీసుకుంటాను. మగ పిల్లాడు మాత్రం వద్దు... వాడిని హ్యాండిల్ చేయలేను'అంటూ తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి.

చిన్ననాటి అల్లరి... ఇంట్లో నుంచి పారిపోవాలనుకున్నాం!
తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా శ్రీ సత్య సరదాగా పంచుకుంది. 'నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని. ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఫెయిల్ అయ్యింది. ఇంట్లో తిడతారనే భయంతో... 'పద ఇంటికి వెళ్లొద్దు, పారిపోదాం' అని ఇద్దరం స్కూల్ తర్వాత ఆటో ఎక్కకుండా వీధుల్లో తిరిగాం. చీకటి పడుతుంటే భయం మొదలైంది. చివరకు టీచర్ కనిపించడంతో తప్పిపోయామని అబద్ధం చెప్పాం. ఆమె పేరెంట్స్‌కి ఫోన్ చేయడంతో మా పారిపోవాలన్న ప్లాన్ ఫెయిల్ అయింది. తర్వాత ఇంట్లో తెగ కొట్టారు" అంటూ నవ్వుతూ చెప్పింది.

ప్రస్తుతం బీబీ జోడి 2లో సందడి
ప్రస్తుతం సత్య బీబీ జోడీ2లో పాల్గొంటూ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటోంది. అర్జున్ కళ్యాణ్‌కు జోడీగా ఆమె చేసే పెర్ఫార్మెన్స్‌లకు మంచి స్పందన వస్తోంది. బిగ్‌బాస్ తర్వాత కూడా తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటూ, విభిన్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్తున్న శ్రీ సత్య... ఈ ఇంటర్వ్యూతో మరోసారి వార్తల్లో నిలిచింది. మొత్తానికి, తెరపై అమాయకంగా కనిపించే ఈ బుల్లితెర బ్యూటీ... నిజ జీవితంలో మాత్రం చాలా బోల్డ్ నిర్ణయాలు తీసుకున్న అమ్మాయిగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X