నలుగురు అమ్మాయిలతో బిగ్‌బాస్ సోహైల్.. నా సుక్కల రాజు అంటూ స్టెప్పులతో రచ్చ..
బుల్లితెర మీద నటుడిగా చిన్న చిన్న వేషాలతో రాణిస్తున్న సయ్యద్ సోహైల్ ర్యాన్‌కు బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో జీవితాన్ని మార్చివేసింది. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో సయ్యద్ సోహైల్‌కు భారీ ఆదరణ లభించింది. సాధారణ సినీ, బుల్లితెర ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఆయన యాటిట్యూడ్‌కు ఫిదా అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో తర్వా సోహైల్‌కు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం బూట్ కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అమ్మాయిలతో చేసిన రీల్ ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ఆ రీల్ వివరాల్లోకి వెళితే..
బుల్లితెరతో ప్రారంభమైన సోహైల్ కెరీర్ సినీ పరిశ్రమలోకి అడుగపెట్టేలా చేసింది. గుంటూరు మిర్చి అనే టీవీ సిరీస్‌తో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కోనాపురంలో జరిగిన కథ, యురేకా సినిమాల్లో నటించి బిగ్‌బాస్ నిర్వాహకులను ఆకర్షించారు. బిగ్‌బాస్ ఎంట్రీతో సోహైల్ క్రేజ్ రెండింతలు పెరిగింది.

బిగ్‌బాస్‌లో సోహైల్ టాలెంట్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌కు నాగార్జున, చిరంజీవి లాంటి అగ్రహీరోలు ఫిదా అయిపోయారు. చిరంజీవి ఏకంగా ఇంటి నుంచి సోహైల్‌కు మటన్ బిర్యానీ వండించుకొని రావడం క్రేజీగా మారింది. చిరంజీవి, నాగార్జున లాంటి ప్రముఖులు సోహైల్‌ను ప్రశంసల్లో ముంచెత్తడంతో మరింత క్రేజ్ పెరిగింది.
బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత వరుస ఆఫర్లు ఆయనను పలకరించాయి. లక్కీ లక్ష్మణ్ సినిమా మంచి రెస్పాన్స్ లభించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించలేకపోయింది. ఆ తర్వాత ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. అయినా సోహైల్ చేతి నిండా సినిమాలు ఉండటం విశేషంగా మారింది.

సోహైల్ ప్రస్తుతం మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్‌కట్ బాలరాజు సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమవుతున్నాడు. బూటకట్ బాలరాజ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో సోహైల్ స్టార్‌గా నిలబడే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని సినీ వర్గాలు ధృవీకరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ను సోహైల్ తనదైన శైలిలో ప్రారంభించి క్రేజ్ పెంచాడు.
సోహైల్ నటించిన బూట్ కట్ బాలరాజు సినిమా ప్రమోషన్స్‌ను తన స్నేహితులతో ప్రారంభించారు. ఆ సినిమాలోని రాజు.. నా బలరాజు.. రాజు.. నా చక్కని రాజు.. సుక్కల రాజు.. రాజు.. నా రారాజు.. అంటూ పాటపై నలుగురు అమ్మయిలతో సోహైల్ స్టెప్పులేస్తూ కేక పెట్టించారు. నలుగురు అమ్మాయిలతో కలిసి చేసిన రీల్ ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











