పెళ్లి చేసుకోని విడిపోవడం కంటే.. లివింగ్ రిలేషన్ బెటరా? జబర్దస్త్ వర్ష ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు

బిగ్‌బాస్ ద్వారా పాపులరై సెలబ్రిటీలుగా మారినవారు ఎందరో ఉన్నారు. వారిలో టేస్టీ తేజ కూడా ఒకరు. ఫుడ్ వ్లాగ్స్, ఇతర వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌‌‌గా గుర్తింపు తెచ్చుకున్న టేస్టీ తేజకు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం రావడంతో అతని జీవితం మలుపు తిరిగింది. రెండు బిగ్‌బాస్ సీజన్‌లలో పాల్గొన్న కంటెస్టెంట్‌గానూ తేజ గుర్తింపు తెచ్చుకున్నాడు. సీజన్ 7లో 9 వారాలు, సీజన్ 8లో 13 వారాల పాటు ప్రేక్షకులను అలరించాడు టేస్టీ తేజ. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఫుడ్ వ్లాగ్‌తో పాటు బిజినెస్‌లోనూ ఎంట్రీ ఇచ్చాడు. నవాబ్స్ టీ పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి తన బిజినెస్‌ను విదేశాలకు సైతం విస్తరించి బిజినెస్‌మెన్‌గానూ సక్సెస్ అయ్యాడు. ఓ ప్రముఖ ఛానెల్‌లో జబర్దస్త్ కమెడియన్ వర్ష నిర్వహిస్తోన్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న టేస్టీ తేజ తన కెరీర్, పెళ్లి, బిగ్‌బాస్ జర్నీ సహా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

లివింగ్ రిలేషన్‌షిప్ మీద నీ అభిప్రాయం ఏంటీ? అని జబర్దస్త్ వర్ష ప్రశ్నించగా.. బాగుంటుంది అని ఆన్సర్ ఇచ్చాడు తేజ. పెళ్లి చేసుకుని విడిపోయే కంటే లివింగ్ రిలేషన్‌షిప్ బెటరే కదా. ముందే తెలుసుకుని విడిపోతున్నారు. పెళ్లయిన తర్వాత వాళ్లిద్దరి మధ్య డిస్ట్రబెన్స్ వస్తే రెండు కుటుంబాలు ఇబ్బందిపడతాయి. లివింగ్ రిలేషన్‌ షిప్‌లో అయితే వీళ్లిద్దరే కదా. లివింగే బెటర్ అని నేను అనడం లేదు.. లివింగ్ అంటే ఏంటో చెప్పా. అయినా ఇప్పుడు ఆల్‌మోస్ట్ అదే చేస్తున్నారు. నాకు తెలిసిన అమ్మాయి ఇదే ఫాలో అవుతోంది.. మంచిగానే ఉన్నారు అని తేజ చెప్పారు.

Bigg Boss Telugu Fame Tasty Teja Opens Up on Living Relationships Love Karma and His Journey

మరి ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారు కదా దాని మీద నీ అభిప్రాయం ఏంటీ? అని వర్ష ప్రశ్నించగా... ఒకసైడ్ నుంచే ఆలోచించి దేనిని జడ్జ్ చేయలేం. మనిద్దరం లవ్‌లో ఉన్నాం.. నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఒక ఆరు నెలలు ట్రావెల్ అయిన తర్వాత నేను నిన్ను వదిలేసి వెళ్లిపోయినా నీ కోణంలో నుంచి చూస్తే నాది మోసం అనిపిస్తుంది. నాకు నువ్వు నచ్చకపోవడానికి నా రీజన్స్ నాకు ఉన్నాయి. ఆ రకంగా చూస్తే నాకు నువ్వు మోసం అనిపిస్తావు. దానిని నేను ఎలా ఆలోచిస్తానంటే ఏ టైంలో ఎప్పుడు? ఏం జరగాలంటే అది జరుగుతుంది. డెస్టినీ అని నేను నమ్ముతాను.. అప్పటిదాకా ట్రావెల్ అయిన ఈ అమ్మాయిని వదిలేస్తే ఆ అమ్మాయికి మంచి జరుగుతుందేమో ఎవరికి తెలుసు. వీడు వదిలేసి వెళ్లిపోయాడు.. నెక్ట్స్ ఆ అమ్మాయికి మంచి జరుగుతుందేమో. వాళ్లను నమ్మి.. లవ్‌లో ఉన్నప్పుడే వాళ్ల గురించి తెలుసుకుని బ్రేకప్ అవ్వడం ఉత్తమం అని తేజ హితవు పలికాడు.

మ్యారేజ్ తర్వాత బ్రేకప్ అయితే రెండు ఫ్యామిలీలు ఇబ్బందిపడతాయి. మ్యారేజ్‌కు ముందే మీ ఇద్దరికీ పడక విడిపోతే కనుక మీ ఇద్దరే ఇబ్బందిపడతారు. ఆ బ్రేకప్ బాధను కొన్నిరోజుల తర్వాత అధిగమించే శక్తి మీకు వస్తుంది. ఆ బాధను భరించలేని పక్షంలో నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకో. అంతేకానీ ఎక్కడో ఒకచోట మీరిద్దరూ పెళ్లి చేసేసుకుని, పెళ్లి తర్వాత ఇలాంటి ఇబ్బందులు వస్తే మాత్రం రెండు ఫ్యామిలీలు కుప్పకూలిపోతాయి. కుటుంబాలను ఇబ్బంది పెట్టకూడదు అని టేస్టీ తేజ తెలిపాడు.

కర్మ అనే దానిని నువ్వు నమ్ముతావా? నీ జీవితంలో అలాంటిది ఏదైనా జరిగిందా? అని వర్ష అడగ్గా.. అలాంటివి చాలా జరిగాయి, ఎగ్జాంపుల్‌తో సహా నేను చెప్పలేను. లైవ్ ఎగ్జాంపుల్ జనానికి తెలిసిందే. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో నేను ఎవరినైతే నామినేట్ చేశానో వరుసగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. సరదాగా జనాల్లోకి వెళ్లమని సందీప్ మాస్టర్‌కు వేశా.. ఆ వెంటనే శివాజీ అన్న నన్ను నామినేట్ చేయడంతో నేను బయటకు వచ్చేశా. వన్ వీక్‌లో రివర్స్ వచ్చేసింది నాకు. అందుచేత కర్మను నమ్ముతా. ఆడపిల్ల ఉసురు పోసుకోకండి అనేదానిని ఇంకా దారుణంగా నమ్ముతా. ఎవరినైనా ఏడిపించడం అనేది తప్పు.. మనింట్లో మన చెల్లిని కొట్టడం, తిట్టడం చేస్తాం. వాళ్లు ఏడిస్తే బాగోదు.. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఆడపిల్లను ఏడిపించొద్దు అని చెప్పారు. పెద్దవాళ్లు ఏమైనా చెబితే ఖచ్చితంగా నమ్ముతా. ఇప్పటి వరకు నా వల్ల ఏడ్చిన అమ్మాయి అయితే ఎవ్వరూ లేరు. అమ్మాయిలనే కాదు.. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదు. దానికి మనం ఏం చేయలేం.. కొన్ని పరిస్ధితులు అంతే. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఎవరు కరెక్ట్ అని ఇద్దరు పేర్లు ఇస్తారు.. అలాంటప్పుడు ఏ పేరు చెబితే.. బీ ఫీల్ అవుతుంది. అక్కడ బీని ఇబ్బంది పెడుతున్నాం. కానీ పరిస్ధితి అలాంటిది. ఇలాంటివన్నీ బిగ్‌బాస్‌లో చాలా నేర్చుకున్నా. మనవల్ల బాధపడితే మాత్రం వివరణ ఇచ్చి కాంప్రమైజ్ చేసుకోవాలి అని తేజ సూచించారు.

లక్‌ని నమ్ముతావా? టాలెంట్‌ని నమ్ముతావా? అని వర్ష ప్రశ్నించగా.... మొన్నటి వరకు లక్ అనుకునేవాడిని, కానీ టాలెంట్ ఉండాల్సిందే. ఓన్లీ లక్‌తో నడవదు. కొంతమందిని చూస్తే ఏం లేకుండా ఏంట్రా వీడు అనుకునేవాడిని. ఎప్పటికైనా టాలెంట్ నిలబడుతుంది. టాలెంట్‌కు కొంచెం లక్ కలిసిరావాలి. టాలెంట్ ఉన్నవాడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు. లక్ ఉన్నవాడికి ఇమిడియేట్‌గా సక్సెస్ వచ్చినా దానిని తర్వాత వాడు నిలబెట్టుకోవాలి. నేను కూడా కొత్తగానే ఇండస్ట్రీకి వచ్చా. ఎంతచూసినా ఇందులో చాలా ఉంటుంది ఈ ఫీల్డ్‌లో. అవకాశాలు రావడం అనేది చాలా కష్టం. కృష్ణానగర్ వచ్చే వాళ్లందరూ టాలెంట్ ఉన్నవాళ్లే.. వాళ్లకి లక్ తోడు కావాలని తేజ అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X