బావ మళ్లీ పెళ్లి చేసుకోడు అక్కా.. మహానటిని మించి ఓవరాక్షన్.. తీన్మార్ సావిత్రిపై దారుణంగా నెటిజన్లు ట్రోల్స్
బుల్లితెరపై తెలంగాణ యాస, భాషతో విశేషమైన ఆదరణను సొంతం చేసుకొని అనతికాలంలోనే సెలబ్రిటీగా మారిపోయిన యాంకర్లలో సావిత్రి ఒకరు. అసలు పేరు జ్యోతి అయినప్పటికీ.. తీన్మార్ సావిత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. టీవీ షోలు, ఈవెంట్లు, స్పెషల్ ఫంక్షన్లతో తీన్మార్ సావిత్రి బిజీగా మారిపోయింది. అయితే తాజాగా ఆమె అమెరికాకు వెళ్తూ ఎయిర్‌పోర్టులో తన భర్త గంగూలీని పట్టుకొని ఏడ్వడంపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన జ్యోతి ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో తెలంగాణ నేపథ్యంతో ఉండే షోలో యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. కొద్దికాలంలోనే ఆమె షో పాపులర్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో యాంకర్‌గా ఆమె పేరు మార్మోగింది. ఆమె, తీన్మార్ మల్లన్న, బిత్తిరి సత్తి చేసిన వీడియోలకు మంచి వ్యూస్ లభించడంతో సోషల్ మీడియాలో పాపులర్‌గా మారిపోయింది.

తీన్మార్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించడంతో బిగ్‌బాస్ తెలుగు షోలో పాల్గొనే అవకాశం దక్కింది. బిగ్‌బాస్ షోలో యాస, భాష, తన ఎమోషనల్ యాటిట్యూడ్‌తో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. చివరి వరకు టైటిల్ కోసం ప్రయత్నించిన ఆమె ప్రేక్షకుల మనసులను గెలుచుకొని బయటకు వచ్చింది. అలా బిగ్‌బాస్ షో ద్వారా ఆమె మరింత పాపులారిటీని సొంతం చేసుకొన్నది.
బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత తీన్మార్ సావిత్రి బిజీ సెలబ్రిటీగా మారిపోయింది. రియాలిటీ షోలు, టెలివిజన్ షోలలో భర్త గంగూలీతో కలిసి తనదైన శైలిలో రాణిస్తున్నారు. తనకంటూ మంచి ఫాలోవర్స్‌ను ఆమె సొంతం చేసుకొంటూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు తొలిసారి అమెరికాకు వెళ్లే అవకాశం దక్కింది. ఇటీవల వీసా అప్రూవ్ కావడంపై తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకొన్న విషయం తెలిసిందే.
అయితే అమెరికాకు వెళ్తూ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భర్త గంగూలీని పట్టుకొని భోరున ఏడుస్తూ ఆ వీడియోలో కనిపించింది. గంగూలీని విడిచి వెళ్తున్నందుకు బాధగా ఉంది అంటూ కామెంట్ పెట్టింది. సావిత్రిని భర్త ఓదార్చుతూ కనిపించారు. ఈ సీన్ కాస్త ఓవర్ యాక్షన్‌గానే ఉందంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రకరకాల కామెంట్లతో సావిత్రిని ఆటాడుకొంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సావిత్రి వీడియోపై నెటిజన్లు కామెంట్ చేస్తూ.. ఆ రెండు వారాలకే ఏడుపా అక్కా, కథల్ వడుతుంది.ఏందిరాబై ఈ నాటకాలు అవసరమా చెప్పు, చాలు నీ ఓవర్ యాక్టింగ్ ఏడుపు కూడ likes రావాలని విడియో తిపిస్తున్నవ్.మహా నటి, అత్తగారింటికి పోయేటప్పుడు కూడా ఇలా ఏడవారు కదనే నీ over యాక్షన్, ఏడవకు అక్క బావ మళ్లీ పెళ్లి చేసుకోడు అంటూ నెటిజన్లు కామెంట్ల చేస్తున్నారు. ఓవరాక్షన్ కాకపోతే ఇలాంటి వీడియో కూడా పెట్టాలా?. ఇలాంటి ఎమోషన్స్ కూడా క్యాప్చర్ చేస్తారా? ఇది బిగ్‌బాస్ హౌజ్ కాదు అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.


Click it and Unblock the Notifications











