Bigg Boss Telugu TRP: మొదటి సీజన్ నుంచి 6వ సీజన్ వరకు వచ్చిన రేటింగ్స్.. ఈసారి డిజాస్టర్!

బిగ్ బాస్ షో తెలుగులో స్టార్ట్ అయినప్పుడు అసలు సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. అలాగే కాంట్రవర్సీ లను తట్టుకొని షో నిలదొక్కుకోవడం కూడా చాలా కష్టమని అనుకున్నారు. కానీ నిర్వాహకులు చాలా తెలివిగానే షోను మరో లెవెల్ కు తీసుకు వెళ్లారు. ఇక తెలుగు బిగ్ బాస్ షో మొదటి సీజన్ నుంచి లేటెస్ట్ గా స్టార్ట్ అయిన 6వ సీజన్ వరకు మొదటి ఎపిసోడ్ కు ఎంత రేటింగ్స్ వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే.. అతి తక్కువగా 6వ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదటి సీజన్

మొదటి సీజన్

బిగ్ బాస్ మొదటి సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ఎన్నో అంచనాల మధ్యన మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఆ సీజన్ కు మొత్తంగా మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఎన్టీఆర్ కు మొదటిసారి హోస్టింగ్ కాబట్టి మంచి రేటింగ్స్ వచ్చాయి. ఇక ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు మాత్రం 16.8 టీఆర్పీ వచ్చింది.

రెండవ సీజన్

రెండవ సీజన్

ఇక రెండవ సీజన్ కూడా ఎన్టీఆర్ పోస్టింగ్ తోనే కొనసాగుతుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ సీజన్ సక్సెస్ కావడంతో మళ్ళీ ఎన్టీఆర్ వస్తాడు అనుకుంటే అతను ఒక వైపు సినిమాలు మరొకవైపు బిగ్ బాస్ బ్యాలెన్స్ చేయలేకపోయాడు. ఇక నేచురల్ స్టార్ నానిని తీసుకురాగా మొదటి ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బిగ్ బాస్ 2 సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ 15.05 రేటింగ్ అందుకుంది.

 మూడవ సీజన్

మూడవ సీజన్

ఇక బిగ్ బాస్ మూడో సీజన్ ఎవరితో కొనసాగిస్తారు అనేది అప్పట్లో మంచి ఆసక్తిని కలిగించింది. ఎన్టీఆర్ లేదా నాని ఎవరో ఒకరు వస్తారు అని అనుకున్నారు. కానీ నాని కూడా మూడవ సీజన్ చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో అక్కినేని నాగార్జునను రంగంలోకి దింపారు. అంతకుముందే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో ద్వారా మంచి అనుభవం ఏర్పరచుకున్న నాగర్జున బిగ్ బాస్ మూడో సీజన్ తో కూడా మెప్పించాడు. ఇక మూడవ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు 17.9 రేటింగ్ వచ్చింది.

4వ సీజన్

4వ సీజన్

ఇక బిగ్ బాస్ నాలుగో సీజన్ కూడా నాగార్జున ద్వారా కొనసాగిన విషయం తెలిసిందే. అప్పటికే ఒక సీజన్ చేసిన అనుభవం ఉండడంతో నాగార్జున పర్ఫెక్ట్ అని నిర్వాహకులు డిసైడ్ అయ్యారు. మధ్యలో కొంతమంది హీరోల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా నాగర్జున ద్వారానే మళ్లీ నాలుగవ సీజన్ అట్టహాసంగా మొదలైంది. అప్పుడు అత్యధికంగా ఫస్ట్ ఎపిసోడ్ కు 18.5 రేటింగ్ రావడం విశేషం.

5వ సీజన్

5వ సీజన్

ఇక బిగ్ బాస్ నాలుగో సీజన్ తర్వాత మళ్ళీ అందరూ ఊహించినట్లుగానే నాగార్జున 5వ సీజన్ ను గ్రాండ్ గా మొదలుపెట్టాడు. 5వ సీజన్ లో కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు అయితే పెద్దగా ఫోకస్ చేయలేదు. కేవలం గేమ్స్ లో మాత్రమే కొత్తగా ఆలోచించినప్పటికీ పెద్దగా పేరున్న సెలబ్రిటీలు రాకపోవడంతో ఐదవ సీజన్ మొదటి ఎపిసోడ్ కు చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. అప్పుడు ఐదవ సీజన్ మొదటి ఎపిసోడ్ కు 15.71 రేటింగ్ వచ్చింది.

6వ సీజన్.. చెత్త రికార్డ్

6వ సీజన్.. చెత్త రికార్డ్

ఇక ఇప్పటివరకు టెలివిజన్ లో ప్రసరమైన ఐదు సీజన్స్ కూడా ఎంతో కొంత పరవాలేదు అనిపించాయి. అయితే ఇప్పుడు 6వ సీజన్ కు మాత్రం చాలా తక్కువ స్థాయిలో రేటింగ్స్ వస్తున్నాయి అని అర్థమవుతుంది. అసలు ఈసారి కంటెస్టెంట్స్ పెద్దగా పేరున్న సెలబ్రిటీలు ఎవరు రాలేదు అనే ట్రోల్స్ కూడా ఒక రేంజ్ లో వచ్చాయి. ఇక మొత్తానికి లిస్ట్ కూడా ముందే బయటకు వచ్చింది. కాబట్టి షోపై పెద్దగా ఎవరు ఆసక్తి చూపలేదు అని ఈసారి ఫస్ట్ ఎపిసోడ్ కు వచ్చిన రేటింగ్స్ చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మొదటి ఎపిసోడ్ కు కేవలం 8.86 రేటింగ్ మాత్రమే వచ్చింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఇదొక చెత్త రికార్డుగా నమోదయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X