twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ 4 హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ వైరల్.. జూ. ఎన్టీఆర్ కంటే రెండు రెట్లు!

    |

    తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ ఉన్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 రియాలిటీ షోకు రంగం సిద్ధమవుతున్నది. కాస్త లేటైనా లేటేస్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు కార్యక్రమాన్ని నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కొద్ది రోజుల్లో షో ప్రారంభం కానున్న నేపథ్యంలో హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ వివరాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఒక్కో ఎపిసోడ్‌కు నాగార్జున ఎంత తీసుకొంటున్నారంటే..

     క్రేజీ హీరో, హీరోయిన్లతో

    క్రేజీ హీరో, హీరోయిన్లతో

    తాజా రిపోర్టు ప్రకారం.. గతంలో కంటే బిగ్‌బాస్ తెలుగు 4 షోను మరింత గ్లామర్‌తో నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. లాక్‌డౌన్ సమయంలో షూటింగులు లేని కారణంగా క్రేజీ హీరోయిన్లు, యువ హీరోలను రంగంలోకి దించుతున్నట్టు ఇన్‌సైడ్ టాక్. అన్ని హంగులతో ఈ షోను ఆగస్టు 30న ప్రారంభించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది.

    100 ఎపిసోడ్స్‌తో

    100 ఎపిసోడ్స్‌తో

    ఇక గత ఎపిసోడ్స్ మాదిరిగానే సీజన్ 4 బిగ్‌బాస్‌ను 100 ఎపిసోడ్స్‌కు అటు ఇటుగా ఉండేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సెట్ పనుల పర్యవేక్షణ జరుగుతున్నట్టు సమాచారం. బిగ్‌బాస్ ఇంటిని మరింత ఆకర్షణీయంగా అన్నపూర్ణ స్టూడియోలో తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తున్నది.

     ఫస్ట్ సీజన్‌ హోస్ట్‌గా తారక్‌కు పారితోషికంా

    ఫస్ట్ సీజన్‌ హోస్ట్‌గా తారక్‌కు పారితోషికంా

    బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలియగానే ఆడియెన్స్‌లో ఓరకమైన ఉత్తేజం కనిపించింది. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారనే విషయంతో ఆ ఉత్సాహం రెట్టింపు అయింది. అయితే ఎన్టీఆర్ భారీ స్థాయిలో డిమాండ్ చేయడంతో ఎవరూ ఊహించనంాతగా రూ.35 లక్షలు ఒక్కో ఎపిసోడ్‌కు చెల్లించినట్టు సమాచారం.

    సెకండ్ సీజన్ హోస్ట్‌గా నానికి రెమ్యునరేషన్

    సెకండ్ సీజన్ హోస్ట్‌గా నానికి రెమ్యునరేషన్

    ఇక బిగ్‌ బాస్ సీజన్‌ 3 కోసం నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సీజన్ 2 కోసం ప్రతీ ఎపిసోడ్‌కు నానికి దాదాపు 12 లక్షల రూపాయలు నిర్వాహకులు చెల్లించారు. సీజన్ 2 తర్వాత నాని హోస్ట్‌ చేయడానికి నిరాకరించడంతో నాగార్జునకు అవకాశం దక్కింది.

    Recommended Video

    Kaushal Manda Breaks His Mobile Gifted By Bigg Boss
    మూడు, నాలుగు సీజన్లకు నాగ్‌కు ఎంతంటే..

    మూడు, నాలుగు సీజన్లకు నాగ్‌కు ఎంతంటే..

    ఇక బిగ్‌బాస్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్న అక్కినేని నాగార్జున రెమ్యునరేషన్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సీజన్ 3 కోసం నాగార్జున ఒక్కో ఎపిసోడ్‌కు 12 లక్షల లోపు పారితోషికం తీసుకొంటే.. సీజన్ 4 కోసం 14 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు తెలిసింది. దీంతో 100కు పైగా ఎపిసోడ్స్ కోసం నాగార్జునకు మొత్తంగా ఎంత ముడుతుందో ఊహించుకొంటే ఓ రకమైన షాక్ అభిమానులకు తగలడం ఖాయమనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తున్నది.

    English summary
    Bigg Boss Season 4 telugu news: Big Boss Telugu Show season 4 is getting ready to telecast. Reports sugggest that on August 30 show will be aired. Latest reports suggest that, Bigg Boss Telugu host Akkineni Nagarjuna remuneration goes viral in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X