బిగ్‌బాస్ హోస్ట్ ఎవరు? తెరపైకి సీనియర్ హీరోయిన్ పేరు.. సమంత పరిస్థితి ఏమిటంటే!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ ‌4లో మరో వారం కూడా హోస్ట్ ఎవరనే ప్రశ్న తలెత్తింది. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున హైదరాబాద్‌కు దూరంగా ఉండటంతో ఆయన స్థానంలో సమంత అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించింది. అయితే ఈ వారం కూడా నాగ్ అందుబాటులో ఉండకపోవడంతో మళ్లీ హోస్ట్ ఎవరనే ప్రశ్న మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకు ఈ వారం బిగ్‌బాస్‌కు ఎవరు హోస్ట్‌గా వ్యవహరించనున్నారంటే..

తెలుగు భాషపై పట్టులేకపోయినా...

తెలుగు భాషపై పట్టులేకపోయినా...

దసరా సందర్భంగా ప్రసారమైన మహా ఎపిసోడ్ వేదికపైకి సమంత అక్కినేని వచ్చింది. తెలుగు భాషపై అంతగా పట్టులేకపోయినా.. అతి జాగ్రత్తగా మాట్లాడుతూ హుందాగా ప్రవర్తించారు. వారాంతపు ఎపిసోడ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లడంతో సమంత తన ప్రతిభను చూపింది. మహా ఎపిసోడ్ తర్వాత సమంతకు హోస్టింగ్‌కు అనూహ్య స్పందన లభించింది.

వైల్డ్ డాగ్ షూటింగ్‌లో బిజీగా నాగ్

వైల్డ్ డాగ్ షూటింగ్‌లో బిజీగా నాగ్

ఇక వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్‌లో కోసం కులు మనాలి వెళ్లిన నాగార్జున మరో 21 రోజుల వరకు రావడం లేదంటూ వీడియోలో వెల్లడించారు. అంటే ఈ వారం కూడా హోస్ట్‌గా వ్యవహరించాల్సిన పరిస్థితి మరోసారి తలెత్తింది. అయితే మహా ఎపిసోడ్ తర్వాత సమంత మళ్లీ హెస్ట్‌గా వ్యవహరించడానికి సుముఖత చూపిస్తారా అనే విషయంపై చర్చ జరుగుతున్నది.

మరోసారి సమంతపై బాధ్యత

మరోసారి సమంతపై బాధ్యత

అయితే హోస్ట్‌గా వ్యవహరించాల్సిన బాధ్యత తనపై ఉండటంతో సమంతకు ఆ బాధ్యతను నాగార్జున అప్పగించారని, ఇక ఈ వారం కూడా ఆమెనే హోస్ట్‌గా వ్యవహరిస్తారనే ప్రచారం జరుగుతున్నది. అయితే సమంత అందుకు ఓకే అంటే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ సమంత కూడా అందుబాటులో లేకుంటే ఆమె స్థానంలో మరొకరిని ఎంపిక చేసే అంశంపై దృష్టిపెట్టే అవకాశం ఉంది.

సమంత కాకపోతే రోజా పేరు తెరపైకి

సమంత కాకపోతే రోజా పేరు తెరపైకి

నాగార్జున స్థానంలో సమంత హోస్ట్‌గా వ్యవహరించలేనని చేతులు ఎత్తివేస్తే.. ఆమె స్థానంలో రోజాను హెస్ట్‌గా తెరపైకి తెచ్చే ఆప్షన్‌ను నిర్వాహకులు స్టాండ్‌బైగా ఉంచుకొన్నారనే తాజా సమాచారం. ఇప్పటికే రోజాతో సంప్రదింపులు చేశారు. సమంత అందుబాటులో లేకుంటే రోజాను ప్రత్యామ్నాయంగా హెస్ట్‌గా ఉపయోగించుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రియాలిటీ షోలకు రోజా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
హెస్ట్ ఎవరు? ఎలిమినేట్ ఎవరు?

హెస్ట్ ఎవరు? ఎలిమినేట్ ఎవరు?

ఇక బిగ్‌బాస్ తెలుగు 4 విషయానికి వస్తే.. ఎనిమిదో వారం నుంచి తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టనున్నది. ఈ వారం నామినేషన్లలో అఖిల్, మోనాల్, మెహబూబ్, లాస్య, అరియానా, అమ్మా రాజశేఖర్ ఉన్నారు. అయితే నామినేట్ అయ్యే కంటెస్టెంట్లలో బలహీనంగా కనిపిస్తున్న అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ వారం హోస్ట్ ఎవరు? ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయం కొద్దిగంటల్లో వ్యక్తం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X