twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెలబ్రిటీల ప్రాణాలకు ముప్పు.. ఎన్టీఆర్ బిగ్‌బాస్‌‌పై కేసు.. ప్రిన్స్, ముమైత్‌కు బాసటగా..

    అట్టహాసంగా ప్రారంభమై ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కొంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని శనివారం

    By Rajababu
    |

    అట్టహాసంగా ప్రారంభమై ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కొంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని శనివారం మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు ఆగస్టు 7 (సోమవారం) విచారణకు రానున్నది. మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదు కావడంపై నిర్వాహకులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

    కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు..

    కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు..

    బిగ్‌బాస్ ఇంటిలో ఉంటున్న సెలబ్రిటలకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. ఆ శిక్షలు సెలబ్రిటీల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. అలాంటి శిక్షలు అమలు చేసే అధికారం కోర్టులకు లేదు. ఎలాంటి విచారణ లేకుండా ఏ ఒక్కరిని శిక్షించే హక్కు పోలీసులకు కూడా లేదు. అన్ని చట్టప్రకారమే జరుగాల్సి ఉంటుంది అని బాలల హక్కుల కార్యకర్త అచ్చుతరావు ఫిర్యాదు చేశారు.

    Recommended Video

    Janatha Garage Team Vinayaka Celebrations | Ntr | Samantha | Mohanlal |
    బిగ్‌బాస్‌పై చర్యలు తీసుకోండి

    బిగ్‌బాస్‌పై చర్యలు తీసుకోండి

    తన ఫిర్యాదులో అనేక అంశాలను ప్రస్తావించారు. ఇటీవల ఇంటి కెప్టెన్‌గా విఫలమైన ప్రిన్స్‌కు స్విమ్మింగ్ పూల్‌లో 50 మునకలు వేయాలంటూ బిగ్‌బాస్ విధించిన శిక్ష హక్కుల ఉల్లంఘనే అని అచ్యుతరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయని, ఆట పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి అని హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు.

    మానవ హక్కుల ఉల్లంఘన

    మానవ హక్కుల ఉల్లంఘన

    అలాగే తెలుగు భాష మాట్లాడనందుకు పార్టిసిపెంట్ ముమైత్‌కు నోటికి కొన్ని గంటలపాటు స్టిక్కర్ వేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. శిక్షల పేరుతో ఆహారం తినకుండా, శ్వాస పీల్చుకోకుండా శిక్షలు వేసి బిగ్ బాస్ కార్యక్రమం హక్కులను ఉల్లంఘిస్తున్నదని అచ్చుతరావు ఆందోళన వ్యక్తం చేశారు.

     పిల్లలపై ప్రభావం పడుతుంది..

    పిల్లలపై ప్రభావం పడుతుంది..

    ప్రతీ రోజు ఈ కార్యక్రమాన్ని వేలాది మంది పిల్లలు చేస్తున్నారు. వారి ప్రవర్తన, ఆలోచనా విధానంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. టెలివిజన్ కార్యక్రమ ప్రభావంతో పిల్లలు ఇలాంటి చర్యలకు పాల్పడితే నీట మునిగే పోయే ప్రమాదం ఉంది అని అచ్యుతరావు పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఆగస్టు 7న విచారణ..

    ఆగస్టు 7న విచారణ..

    సామాజిక కార్యకర్త అచ్చుతరావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆగస్టు 7న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్ విచారించనున్నాయి. తదనంతరం పిటిషన్ దారుడి ఫిర్యాదుపై తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. జూలై 16న ప్రారంభమైన బిగ్‌బాస్ రియాలిటీ షోకు తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    The popular reality show Bigg Boss Telugu hosted by NTR has come under the scanner of Human Rights Commission. Hyderabad based child rights activist, Achyuta Rao filed a petion in The Human Rights Commission of Telangana & Andhra Pradesh. Verdict on the petitition come up for hearing on Monday (August 7).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X