Bigg Boss Telugu 6: నోరు జారి బుక్కైన ఇనాయా.. వాళ్లకు లవర్స్ ఉన్నా రొమాన్స్.. ఒకేసారి ఇద్దరితో!
తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వచ్చినా.. వాటన్నింటినీ బీట్ చేసి నెంబర్ వన్ ప్లేస్‌లో వెలుగొందుతోంది బిగ్ బాస్. మన దగ్గరే కాదు.. దేశంలోనే ఇది అత్యధికంగా రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక, ఈ షో ఇంతలా సక్సెస్ అవడానికి అందులో కనిపించే లవ్ ట్రాకులు, రొమాంటిక్ సీన్లు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అన్ని సీజన్లలో మాదిరిగానే ఆరో దానిలో సైతం కొంత మంది జంటలుగా సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇనాయా సుల్తానా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..!

కొత్తగా తెచ్చినా చూడడం లేదు
ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆరో దానిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే నిర్వహకులు ఆరంభం నుంచే అదిరిపోయే కంటెంట్‌ను తీసుకు వస్తూ మజాను పంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, అది సక్సెస్ కావడం లేదు. ఫలితంగా ఈ సీజన్‌కు ఆదరణ లభించక.. రేటింగ్ తక్కువగానే వస్తుంది.

లవ్ ట్రాకులు.. ఆరో సీజన్‌లోనూ
సాధారణంగా బిగ్ బాస్ షోలో కనిపించే లవ్ ట్రాకులు భారీ స్థాయిలో హైలైట్ అవుతూ ఉంటాయి. ఇలా ఇప్పటి వరకూ వచ్చని సీజన్లలో ఎంతో మంది జంటలుగా సందడి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌లో కూడా శ్రీ సత్య - అర్జున్ కల్యాణ్, ఆరోహి రావు - ఆర్జే సూర్య, ఇనాయా సుల్తానా - ఆర్జే సూర్య జోడీలుగా మారారు. దీంతో అందరి కంటే వీళ్లు మాత్రం ఫోకస్ అయ్యారు.

వాళ్లిద్దరి ట్రాక్ మరీ దారుణంగా
మొదట ఆరోహి రావుతో కలిసి తెగ సందడి చేసిన ఆర్జే సూర్య.. ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత ఇనాయా సుల్తానాతో రిలేషన్‌ను మొదలు పెట్టాడు. ఫలితంగా వీళ్లిద్దరూ బాగా డీప్ అయిపోయారు. ఒక సందర్భంలో అతడిని ఆమె బావ అని పిలిచేసింది. అలాగే, రొమాన్స్‌లోనూ హద్దు దాటిపోయారు. ఫలితంగా బాగా హైలైట్ అవడంతో పాటు విమర్శలూ ఎదుర్కొంటున్నారు.

నాగార్జున చీవాట్లు.. శ్రీహాన్‌తోనూ
ఆర్జే సూర్యతో లవ్ ట్రాక్ హైలైట్ అవడంతో ఇనాయా సుల్తానా ఆట కంటే వేరే వాటిపై ఫోకస్ చేస్తుందని నాగార్జున కౌంటర్లు వేశాడు. దీంతో ఆమె ఈ వారం నుంచి మారిపోతానని అతడికి ప్రామిస్ చేసింది. అయితే.. అతడికి కొంచెం దూరమైన ఇనాయా.. శ్రీహాన్‌పైకి ఫోకస్ చేసింది. దీంతో అతడికి స్వయంగా కేక్ తయారు చేయడం, పొగడడం, మాట్లాడడం వంటివి చేసి వార్తల్లో నిలిచింది.

నామినేషన్స్‌లో ఆ పాయింటు
ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్క్ గతంలో మాదిరిగానే సాగింది. ఇందులో తాను నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్.. ఇద్దరు ఫొటోలను మంటల్లో వేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఇనాయా సుల్తానా ఎంతో క్లోజ్‌గా ఉంటోన్న ఆర్జే సూర్య, శ్రీహాన్‌లను నామినేట్ చేసి అందరికీ షాకిచ్చింది. అదే సమయంలో నోరు జారి అడ్డంగా బుక్కైంది.

సూర్యను నామినేట్ చేస్తూనే
ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కులో ఇనాయా.. సూర్యను నామినేట్ చేస్తూ.. 'నాగ్ సార్ పదే పదే బుజ్జమ్మ గురించి చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనిద్దరం క్లోజ్‌గా ఉండడం తప్పు. మనది స్నేహమే అయినా అది బయటకు వేరే వెళ్తుంది. దీంతో తప్పు చేస్తున్నా అనిపిస్తుంది. అందుకే మన మధ్య ఏం లేదని చెప్పడానికి నామినేట్ చేస్తున్నా' అని అంది.

సిరి పేరును తీసుకొచ్చి మరీ
ఇదే టాస్కులో ఇనాయా సుల్తానా.. శ్రీహాన్‌ను కూడా నామినేట్ చేసింది. 'నీకు బయట సిరి ఉందని నాకు తెలుసు. ఇప్పుడు ఇంట్లో అందరూ మన మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు. వాళ్లందరికీ మన మధ్య ఏం లేదని చెప్పడం కోసమే ఇప్పుడు నిన్ను నామినేట్ చేస్తున్నా' అని చెప్పుకొచ్చింది. ఇలా నోరుజారి ఇనాయా తనకు తానే క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసుకుంది.


Click it and Unblock the Notifications











