Bigg Boss Telugu 6: షోలో చెండాలం.. పెళ్లి కాకుండానే ఆ పని.. బుజ్జమ్మ ఈ దారుణం చూసిందో లేదో!

ఓ విలాశవంతమైన ఇల్లు.. చుట్టూ పదుల సంఖ్యలో కెమెరాలు.. కంటెస్టెంట్లుగా కొంత మంది సెలెబ్రిటీలు.. నిర్వహకులు ఇచ్చే టాస్కులలో తమ వంతు శ్రమను చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకోడానికి వాళ్లు చేసే ప్రయత్నాలు.. ఇదే బిగ్ బాస్ షో నేపథ్యం. తెలుగులో సూపర్ సక్సెస్ అయిన ఈ షో సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ నడుస్తోంది. ఇందులో ఆర్జే సూర్య, ఇనాయా సుల్తానా ప్రేమికుల్లా వ్యవహరిస్తూ హాట్ టాపిక్ అవుతోన్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ల మధ్య ఓ షాకింగ్ సీన్ కనిపించింది. ఆ వివరాలు మీకోసం!

కంటెంట్ పెరిగినా కలిసిరాలే

కంటెంట్ పెరిగినా కలిసిరాలే

రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ షో చాలా భాషల్లో ప్రసారం అవుతోంది. కానీ, ఎందులోనూ రాని విధంగా తెలుగులో దీనికి రేటింగ్ దక్కుతోంది. దీంతో ఆరో సీజన్‌లో మరింత కొత్త కంటెంట్‌ను తీసుకు వస్తున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ సీజన్‌కు ప్రేక్షకుల నుంచి స్పందన చాలా తక్కువగా వస్తోంది. దీంతో ఈ సారి రేటింగ్ చాలా దారుణంగా పడిపోయింది.

ప్రేమ జంటలు.. హాట్ టాపిక్

ప్రేమ జంటలు.. హాట్ టాపిక్

బిగ్ బాస్ షోలో సాధారణంగా కంటెస్టెంట్ల మధ్య ఏర్పడే లవ్ ట్రాకులు బాగా హైలైట్ అవుతాయని తెలిసింది. వాళ్ల మధ్య లవ్ ఉన్న లేకున్నా.. నిర్వహకులు మాత్రం జోడీలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ప్రతి సీజన్‌లోనూ కనీసం ఒక్క జంటనైనా ఫోకస్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఈ షో వల్ల ఎంతో మంది జంటలుగా మారి హాట్ టాపిక్‌గా మారిపోయారు.

ఈసారి ఆ జంట హైలైట్‌గానే

ఈసారి ఆ జంట హైలైట్‌గానే

ప్రతి సీజన్‌లోనూ బిగ్ బాస్ నిర్వహాకులు లవ్ ట్రాకులను వాడుకుని క్యాష్ చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆరో సీజన్‌లోనూ ఇలా పలువురిని జంటలుగా మార్చడానికి బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఆర్జే సూర్య, ఆరోహి రావు మధ్య ట్రాకును బాగా హైలైట్ చేశారు. అందుకు తగ్గట్లుగానే వీళ్లు హగ్గులు, కిస్‌లతో యమా సందడి చేసి వార్తల్లో నిలిచారు.

 ఆరోహి వెళ్లాక.. ఇనాయాతోనే

ఆరోహి వెళ్లాక.. ఇనాయాతోనే

బిగ్ బాస్ హౌస్‌లో ఆర్జే సూర్య మొదట ఆరోహితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వ్యవహరించాడు. ఆమె బయటకు వెళ్లగానే ఈ కుర్రాడు ఇనాయా సుల్తానాతో జత కట్టాడు. ఆమె కూడా అతడికి బాగా కోపరేట్ చేస్తూ రెచ్చిపోతోంది. దీంతో ఇద్దరూ వీలైనంత ఎక్కువగా రొమాన్స్‌ను పండిస్తున్నారు. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ షోలో వీళ్లిద్దరూ జంటగా తెగ సందడి చేస్తూ కంటెంట్ ఇస్తున్నారు.

నాగ్ కౌంటర్లు.. మారుస్తానని

నాగ్ కౌంటర్లు.. మారుస్తానని

ఆర్జే సూర్య, ఇనాయా సుల్తానా మధ్య బంధం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫలితంగా వీళ్లిద్దరూ బాగా డీప్ అవుతున్నారు. ఒక సందర్భంలో అతడిని ఆమె బావ అని పిలిచేసింది. అలాగే, రొమాన్స్‌లోనూ హద్దు దాటుతున్నారు. దీంతో ఇనాయా ఆట కంటే వేరే వాటిపై ఫోకస్ చేస్తుందని నాగార్జున కౌంటర్లు వేశాడు. దీంతో ఆమె ఈ వారం నుంచి మారిపోతానని స్పష్టం చేసింది.

కర్వా చౌత్ సూర్యతో అంటూ

కర్వా చౌత్ సూర్యతో అంటూ

రెండు రోజుల క్రితమే కర్వా చౌత్ పండుగ జరిగిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. పెళ్లైన లేదా పెళ్లి కాబోతున్న అమ్మాయిలు తమ భర్త లేదా కాబోయే వాడి కోసం పూజ చేసి జల్లెడలో చంద్రుడి వైపు చూస్తారు. ఆ తర్వాత తమ పార్ట్‌నర్‌ ముఖాన్ని చూస్తారు. దీన్ని రోహిత్, మెరీనా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో తాను సూర్యతో ఈ పండుగ జరుపుకోవాలని ఇనాయా కోరుకుంది.

వీడియో వైరల్.. బుజ్జమ్మా!

వీడియో వైరల్.. బుజ్జమ్మా!

కర్వా చౌత్ పండుగను సూర్యతో జరుపుకోవాలని ఉందంటూ ఇనాయా అతడి పేరును రాసి రాజశేఖర్‌కు చూపించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ సందర్భంలో సూర్య కూడా పక్కనే ఉన్నా ఏమీ మాట్లాడలేదు. దీంతో అతడికి కూడా ఇనాయాపై ఇంట్రెస్ట్ ఉందని స్పష్టం అవుతోంది. మరి బుజ్జమ్మ ఈ వీడియోను చూసిందో లేదో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X