70 రోజులు నరకం చూశా.. బిగ్‌బాస్‌పై యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్..

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu). ఇప్పటివరకు తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా ముగిసిన సీజన్ 9లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పడాల విజేతగా నిలవగా, బుల్లితెర నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ షోపై తాజాగా ఓ యంగ్ హీరో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. బుల్లితెర నటుడు, సినిమాల్లోనూ నటిస్తున్న రవికృష్ణ (Actor Ravi Krishna). విజయవాడకు చెందిన రవికృష్ణ తొలుత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, హృదయం, బొమ్మరిల్లు,మొగలిరేకులు, వరూధిని పరిణయం, మనసు మమత, సుందరకాండ, బావ మరదళ్లు వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు 3 ( Bigg Boss Telugu 3) లో కంటెస్టెంట్‌గా పాల్గొని, దాదాపు 70 రోజుల పాటు హౌస్‌లో నిలిచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నారు.

Bigg Boss Telugu Is Mental Hell Actor Ravi Krishna s Shocking 70-Day Experience

బిగ్‌బాస్ తర్వాత రవికృష్ణకు క్రేజ్ మరింత పెరిగింది. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుని అనుభవించు రాజా, విరూపక్ష, లవ్ మీ, ది బర్త్ డే బాయ్, కింగ్డమ్ వంటి చిత్రాల్లో నటించారు. తాజాగా ఆయన నటించిన దండోరా సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవికృష్ణ, తన బిగ్‌బాస్ జర్నీని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

'దాదాపు పది సంవత్సరాల పాటు సీరియల్స్‌లో నటించాను. నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే... ఏం చేసినా ఒకే రొటీన్. ఉదయం లేవడం, వర్కౌట్, షూటింగ్, డబ్బింగ్, ఇంటికి రావడం... ఇదే పదేళ్ల ప్రయాణం. బయట ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా జీవితం సాగిపోయింది. ఆ సమయంలోనే బిగ్‌బాస్ అవకాశం వచ్చింది'అని చెప్పారు. సీరియల్స్‌తో పోలిస్తే బిగ్‌బాస్ అనేది పూర్తిగా భిన్నమైన ప్రపంచమని, అదే తనను ఆకర్షించిందని రవికృష్ణ తెలిపారు.

మరో కారణంగా రెమ్యునరేషన్‌ను కూడా ప్రస్తావించారు.'నేను రెగ్యులర్‌గా తీసుకునే అమౌంట్‌ కంటే బిగ్‌బాస్‌లో నాలుగు రెట్లు ఎక్కువే వచ్చింది. ఫేమ్, గుర్తింపు త్వరగా వస్తాయి. బిగ్‌బాస్ ముందు నా క్యారెక్టర్‌ను చూసి ఇష్టపడేవారు. కానీ షోలో నా ఒరిజినల్ క్యారెక్టర్ చూసిన తర్వాత ఇంకా ఎక్కువగా ఇష్టపడడం మొదలుపెట్టారు'అని చెప్పారు.

బిగ్‌బాస్ హౌస్‌లో గడిపిన రోజులు గురించి చెబుతూ.. 'బిగ్‌బాస్‌లోకి వెళ్లడం ఓ సాహసం. చుట్టూ కెమెరాలే... మన ప్రవర్తన మనకే తెలియకుండా మారిపోతుంది. బయట సమాజంలో ఎవరో నచ్చకపోతే మాట్లాడకపోవచ్చు. కానీ బిగ్‌బాస్‌లో నచ్చినా, నచ్చకపోయినా మాట్లాడాల్సిందే. అది రియల్ లైఫ్‌కు పూర్తిగా విరుద్ధం. నేను 70 రోజులు ఉన్నాను... అది పూర్తిగా మెంటల్ ప్రెజర్. నిజంగా చెప్పాలంటే 70 రోజులు నరకం చూసిన ఫీలింగ్'అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిగ్‌బాస్ టాస్కులపై కూడా రవికృష్ణ ఆసక్తికర విషయాలు చెప్పారు. 'టీవీలో ఒక టాస్క్‌ను ఒకటి లేదా రెండు నిమిషాల్లో చూపిస్తారు. కానీ నిజంగా ఆ టాస్క్ ఆరు నుంచి ఏడు గంటలు జరుగుతుంది. ఒకసారి టాస్క్‌లో అద్దం పగిలి నా చేతికి 6-7 కుట్లు పడ్డాయి. రూమ్ మొత్తం రక్తమే. కానీ టీవీలో కేవలం 30 సెకన్లే చూపించారు' అని తెలిపారు. అయితే.. అన్ని కష్టాల మధ్య కూడా బిగ్‌బాస్ తనకు ఎంతో నేర్పిందని రవికృష్ణ అన్నారు.

'బిగ్‌బాస్‌లో పాల్గొన్న తర్వాత జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. అది ఒక రియల్ లైఫ్ ట్రైనింగ్ లాంటిది' అని చెప్పారు. అలాగే సీజన్ 3కి మొదటిసారి హోస్ట్‌గా వచ్చిన కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. 'చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. సడన్‌గా ఆయన ముందు నిలబడితే ఒక తెలియని ఫీలింగ్. ఆయన కంటెస్టెంట్లను ఎంతో ఎంకరేజ్ చేసేవారు' అని గుర్తు చేసుకున్నారు.

మొత్తానికి బిగ్‌బాస్ బయట కనిపించేదానికంటే లోపల చాలా కఠినమైన ప్రపంచమని, కానీ అదే జీవితానికి ధైర్యాన్ని ఇచ్చిందని రవికృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X